సోమవారం సాయంత్రం హైదరాబాద్ AMB సినిమాస్‌లో జరిగిన “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” గ్రాండ్ ప్రీమియర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. పలువురు సినీ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరు కాగా.. వారి నవ్వులతో, సందడితో సాయంత్రం ఆహ్లాదంగా మారింది. అతిథులు, సెలబ్రిటీలు, నటీనటులు, సాంకేతిక బృందం మరియు క్రియేటర్లు.. ఇలా అందరూ కలిసి ప్రాంతీయ OTT వినోదంలో పెద్ద హిట్‌గా నిలిచిన సేవ్ ది టైగర్స్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన సీజన్3ను ఎంజాయ్ చేశారు.
తారల తళుకులతో మెరిసిన ఈ రెడ్ కార్పెట్ వేడుకకు టీవీ సీరియల్స్ నుంచి సినిమాల వరకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్లు, హై-ఫ్యాషన్‌లో సెలబ్రిటీల మెరిసే హాజరు, ఎక్స్‌క్లూజివ్ మీడియా ఇంటరాక్షన్లు, అలాగే ప్రీ స్క్రీనింగ్ గెట్-టుగెదర్స్.. ఇలా అన్నీ కలిసి ఈ స్ట్రీమింగ్ ప్రారంభానికి అద్భుతమైన వేదికగా నిలిచాయి.
సేవ్ ది టైగర్స్ 3 స్పెషల్ సెలబ్రిటీ ప్రీమియర్ వేడుకలో టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, కామాక్షి భాస్కర్ల, రాగ్ మయూర్, బిగ్ బాస్ తెలుగు 5 విజేత వీజే సన్నీ, కళ్యాణ్ పడాలా (బిగ్ బాస్ సీజన్ 9 విజేత), చైతన్య రావు, వెంకటేష్ కాకుమాను, కార్తిక్ రత్నం, ఆదిత్య మండల, శ్రీనాథ్ మాగంటి, జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్, నిరుపమ్, కిరీటి దామరాజు, మానస్ సహా పలువురు ప్రముఖులు పాల్గొని ప్రీమియర్‌ను ఎంజాయ్ చేశారు.
ప్రియదర్శి, వెన్నెల కిషోర్, జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య, దేవియాని శర్మ, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి వంటి నటీనటుల పెర్ఫామెన్స్‌లకు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మూడు జంటల కథతో పాటు ప్రత్యేకమైన పాత్రలో వెన్నెల కిషోర్ నటించిన ఈ సిరీస్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది.
సేవ్ ది టైగర్స్ సీజన్3కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇది వరకు మేకర్స్ చెప్పినట్లుగానే, “రెండు ప్రపంచాలు ఢీకొట్టేలా చేసిన గర్జన! దీనిని దేవుడి ప్లాన్ అనాలా, లేక విధి అనాలా!… అందరి దృష్టిని ఆకర్షిస్తూ, పరిస్థితులను తలకిందులు చేస్తూ, ప్రేక్షకుల మన్ననలు పొందేలా టైగర్స్ మళ్లీ వచ్చేశారు. “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” జూన్ 19 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది.
ఓటీటీల్లో వ్యూయర్‌షిప్ పరంగా “సేవ్ ది టైగర్స్” అతిపెద్ద తెలుగు వెబ్ సిరీస్‌గా నిలిచింది. మొదటి రెండు సీజన్స్‌లోని కామెడీ, ఆసక్తికరమైన పాత్రలు, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. దీంతో సీజన్3పై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు ఈ కొత్త సీజన్ సరికొత్త ఫ్యాంటసీ ట్విస్ట్‌తో మరింత ఉత్కంఠను పెంచేందుకు సిద్ధంగా ఉంది.
నటీనటులు:
ప్రియదర్శి-జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య-దేవియాని శర్మ, అభినవ్ గోమటం-పావని గంగిరెడ్డి, వెన్నెల కిషోర్, రోహిణి తదితరులు
క్రియేటెడ్ బై మహి వి.రాఘవ్, ప్రదీప్ అద్వైతం
దర్శకత్వం: శ్రీరామ్ ఎరగం
నిర్మాతలు: శివ మేక, సాహితి చింతలపూడి
రైటర్స్: విజయ్ నమోజు, డి.ఎస్.గౌతమ్
కెమెరా: విశ్వేశ్వర్ శిల కోటి
మ్యూజిక్: అజయ్ అరసాడ
ఎడిటర్: శ‌్రవణ్ కటికనేని
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…