‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ‘వంద దేవుళ్ళు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల

విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజీ నిర్మించిన చిత్రం ‘వంద దేవుళ్ళు’. ఈ మూవీలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధీషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్ ముఖ్య పాత్రలను పోషించారు. ‘బిచ్చగాడు’ తరువాత దర్శకుడు శశితో విజయ్ ఆంటోని చేసిన ఈ చిత్రం జూన్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మేరకు సోమవారం నాడు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల, దర్శకుడు త్రినాథరావు నక్కిన ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

విజయ్ ఆంటోని మాట్లాడుతూ .. ‘శశి గారు 20 ఏళ్ల నన్ను మ్యూజిక్ దర్శకుడిగా పరిచయం చేశారు. పదేళ్ల క్రితం శశి గారు ‘బిచ్చగాడు’ చిత్రంతో హీరోగా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ‘వంద దేవుళ్ళు’ అంటూ మేం రాబోతోన్నాం. శశి గారు కథ చెప్పిన తరువాత నేను ఎంతో ఏడ్చేశాను. నాకు కన్నీళ్లు మాత్రం ఆగలేదు. నా పాత్ర చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. ‘బిచ్చగాడు’ నుంచి నాతో ప్రయాణిస్తున్న భాష్య శ్రీ గారికి థాంక్స్. శశి గారు ఈ మూవీతో కొత్త టెక్నికల్ టీంను పరిచయం చేశారు. ‘వంద దేవుళ్ళు’ మూవీని సుబ్బారెడ్డి గారు, మైత్రి శశి గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నా నిర్మాత ఫాతిమా గారికి థాంక్స్. జూన్ 19న రాబోతోన్న మా ‘వంద దేవుళ్ళు’ తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘‘వంద దేవుళ్ళు’ మూవీని ఆల్రెడీ నేను చూశాను. శశి గారు తీసిన ‘శ్రీను’ మూవీ చూసి నేను వెక్కి వెక్కి ఏడ్చాను. ఆయన ‘బిచ్చగాడు’ లాంటి గొప్ప సినిమాని తీశారు. ప్రతీ ఒక్కరూ హార్ట్ పెట్టి మూవీకి పని చేసినట్టుగా కనిపిస్తోంది. పెళ్లి అయితే, పిల్లల్ని కంటే అమ్మాయి అమ్మగా మారిపోతుంది. అయితే అమ్మలోనూ అమ్మాయి ఉంటుంది. అదే పాయింట్‌ను గొప్పగా చూపించారు. స్వాసిక గారు చాలా అద్భుతంగా నటించారు. అజయ్, కావ్య అందరూ చక్కగా నటించారు. ‘వంద దేవుళ్ళు’ అనే టైటిలే నాకు చాలా బాగా నచ్చింది. టైటిల్‌తోనే అందరినీ ఆకట్టుకున్నారు. విజయ్ ఆంటోని గారు చేసే ప్రతీ సినిమాలో అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. ఆయన దర్శకుడు, హీరో, నిర్మాత, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఎన్ని ఉన్నా.. అన్నింటికంటే కూడా ఆయన ఒక మంచి వ్యక్తి. ఆయన్ను కలిసి మాట్లాడాక మరింత గౌరవం పెరిగింది. ఈ చిత్రంలో ఫ్యాన్ నుంచి టీ కప్పు వరకు అన్నింటికీ ఓ ఇంపార్టెన్స్, ఓ కారెక్టర్ ఉంటుంది. ఎంత ఎమోషనల్‌గా ఉంటుందో.. అంతే వినోదాత్మకంగా ఉంటుంది. విజయ్ ఆంటోని గారి పాత్ర ఎంతో గొప్పగా ఉంటుంది. ఆలోచన రేకెత్తించేలా సినిమా ఉంటుంది. కమర్షియల్ అంశాలతోనే గొప్పగా చిత్రాన్ని మలిచారు. అమ్మను కలిగిన ప్రతీ ఒక్కరూ ‘వంద దేవుళ్ళు’ సినిమాని చూడాలి. ‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ .. ‘విజయ్ ఆంటోని గారి సినిమాలంటేనే యూనిక్ కంటెంట్ ఉంటుంది. ఆయన ఎలాంటి సబ్జెక్ట్ చేసి ఉంటారా? అని తెలుసుకునేందుకు అయినా సినిమాని చూస్తుంటాను. కంటెంట్‌ని మాత్రమే నమ్ముకుని ఆయన చిత్రాలు చేస్తుంటారు. ‘వంద దేవుళ్ళు’ కోసం ఇక్కడకు ఇలా రావడం ఆనందంగా ఉంది. ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోని మాట్లాడుతూ .. ‘‘వంద దేవుళ్ళు’ ఈవెంట్‌కు వచ్చిన నిహారిక గారికి, త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్. శశి గారు, విజయ్ ఆంటోని గారు కలిసి చేసిన ‘వంద దేవుళ్ళు’ అందరినీ ఆకట్టుకుంటుంది. భాష్య శ్రీ గారు మా ఇంట్లోనే స్క్రిప్ట్ డబ్బింగ్ వర్షెన్ కంప్లీట్ చేస్తుంటారు. జూన్ 19న మా సినిమా రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు.

దర్శకుడు శశి మాట్లాడుతూ .. ‘‘బిచ్చగాడు’ మూవీతో పదేళ్ల క్రితం ఇక్కడకు వచ్చాను. అప్పుడు మా గురించి ప్రేక్షకులకు ఏమీ తెలియకపోయినా పెద్ద హిట్ చేశారు. ఆ మూమెంట్ నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. తెలుగు ప్రేక్షకుల్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఇప్పుడు మళ్లీ విజయ్ ఆంటోనితోనే ‘వంద దేవుళ్ళు’ అని తల్లీకొడుకుల కథతో రాబోతోన్నాను. ఇది ‘బిచ్చగాడు’కి పూర్తి భిన్నంగా ఉంటుంది. అమ్మని దేవతలా చూస్తే అది ‘బిచ్చగాడు’.. అమ్మని సాధారణ మనిషిలా చూస్తే ‘వంద దేవుళ్లు’. ‘బిచ్చగాడు’ ఎంతలా నచ్చిందో.. ‘వంద దేవుళ్ళు’ కూడా అంతే స్థాయిలో నచ్చుతుంది’ అని అన్నారు.

నటి కావ్య అనిల్ మాట్లాడుతూ .. ‘విజయ్ ఆంటోని గారితో పని చేయడం ఆనందంగా ఉంది. శశి గారి ముందు నేను ఒక స్టూడెంట్‌లా ఉండి అంతా నేర్చుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోని సర్‌కు థాంక్స్. ఆయన్నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. మా సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ .. ‘‘వంద దేవుళ్ళు’ సినిమా అద్బుతంగా వచ్చింది. మైత్రితో కలిసి ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాం. విజయ్ ఆంటోని గారికి మంచి విజయం దక్కబోతోంది. మాకు సపోర్ట్ చేస్తున్న నిహారిక గారికి, త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్’ అని అన్నారు.

రైటర్ భాష్య శ్రీ మాట్లాడుతూ .. ‘‘బిచ్చగాడు’ నుంచి విజయ్ ఆంటోని గారితో జర్నీ కొనసాగుతోంది. శశి గారు ప్రతీ చిన్న విషయాన్ని ఎంతో పరిశీలిస్తుంటారు. ‘వంద దేవుళ్లు’ కేవలం ఒక సినిమా కాదు.. ఇదొక గొప్ప ఆలోచన. ఈ ఆలోచనను మీడియానే ముందుకు తీసుకు వెళ్లాలి. అమ్మకి జరిగిన ఘటన చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. ఈ మూవీకి మాటలు, పాటలు రాశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన శశి గారు, విజయ్ గారికి థాంక్స్’ అని అన్నారు.

మన్యం రమేష్ మాట్లాడుతూ .. ‘‘వంద దేవుళ్ళు’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. శశి గారు మంచి కథతో రాబోతోన్నారు. విజువల్స్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. విజయ్ ఆంటోని గారికి మళ్లీ ఓ పెద్ద సక్సెస్ రాబోతోంది’ అని అన్నారు.

నటీనటులు : విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, లిజోమోల్ జోస్, కావ్య, శక్తి, పదిని, కర్ణాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుల్ దాస్, బక్స్, వినోదిని, మునీష్‌కాంత్, కొడంగి వడివేలు తదితరులు

సాంకేతిక సిబ్బంది:

బ్యానర్: విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్
సమర్పణ: ఫాతిమా విజయ్ ఆంటోని
నిర్మాత: రామాంజనేయులు జవ్వాజి
దర్శకుడు: శశి
సంగీతం: బాలాజీ శ్రీరామ్
DOP: SB దర్శన్ కిర్లోష్
ఎడిటర్: హరీష్ యువరాజ్
డైలాగ్స్: భాష్యశ్రీ
PRO: సాయి సతీష్

TFJA

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

3 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

4 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 weeks ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

2 weeks ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

2 weeks ago