‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ నిర్మాణంలో లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రానున్న చిత్రం ‘సతీ లీలావతి’. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మే 8న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు హీరోయిన్ లావణ్య త్రిపాఠి మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన సంగతులివే.

  • ‘సతీ లీలావతి’ మూవీని ఆల్రెడీ చూశాను. చాలా బాగుంది. నాకు ఎంతో నమ్మకం ఉంది. ఇక ఆడియెన్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి. ఈ మూవీ షూటింగ్ టైంలోనే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. కానీ టీం ఇచ్చిన సపోర్ట్‌తో షూటింగ్ సాఫీగా చేశాను.
  • ప్రతీ రోజూ షూటింగ్ అయిన తరువాత హాస్పిటల్‌కి వెళ్లి చెకప్ చేసుకుంటూ ఉండేదాన్ని. చిత్రీకరణలో చిన్న చిన్న గాయాలు అవ్వడం అనేది కామన్ కదా. అయితే ఈ కథ విన్నప్పుడు వరుణ్‌కి చెప్పాను. అప్పుడు నాకు ప్రెగ్నెంట్ అని తెలీదు, ఎలాంటి సింప్టమ్స్ కూడా లేవు. షూటింగ్ కూడా అంత ఈజీ కాదని అర్థమైంది. ఈ మూవీ కోసం వెయిట్ కూడా తగ్గాను. కానీ నాకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే మాత్రం షూటింగ్‌లకు బ్రేక్ ఇస్తాను.
  • నేను ఈ చిత్రంలో డైరెక్టర్ పాత్రలో కనిపిస్తాను. ఇందులో ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా ఉంటుంది. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు. నేను, నా మేనేజర్ సినిమా చూస్తూ ఫుల్లుగా నవ్వుకున్నాం. కొన్ని చోట్ల ఎమోషనల్‌గా ఉంటుంది. మంచి మెసెజ్ ఉన్నా కూడా ఏదో బోధిస్తున్నట్టుగా, క్లాస్ పీకుతున్నట్టుగా అనిపించదు.
  • ‘సతీ లీలావతి’లో చూపించినట్టుగా రిలేషన్స్ బయటి ప్రపంచంలో ఉండవు. అలాంటి పరిస్థితి కూడా ఏ మహిళకీ రాకూడదు. నాకు రియల్‌ లైఫ్‌లో వరుణ్ లాంటి మంచి భర్త దొరికారు. ప్రస్తుతం నేను నా భర్త, కొడుకుతో హ్యాపీగా ఉన్నాను.
  • నేను ప్రెగ్నెంట్ కదా? అని స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాకపోతే యాక్షన్ సీక్వెన్స్‌లో మార్పులు చేశారు. నేను ఫస్ట్ టైం యాక్షన్ సీక్వెన్స్ చేశాను. కాలితో కొట్టే సీన్ ఒకటి చేశాను. అప్పుడు కాస్త ఇబ్బంది అనిపించింది.
  • రామ్ చరణ్ గారు మాకు ఎప్పుడూ సపోర్టివ్‌గానే ఉంటారు. ఏమైనా హెల్ప్ చేయాలా? కావాలా? అని ఆయన అడుగుతుంటారు. మా కోసం ఆయన ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషంగా అనిపించింది. రామ్ చరణ్ రిలీజ్ చేయడంతో మాకు మరింత రీచ్ వచ్చింది.
  • దేవ్ మోహన్ గారు మంచి వ్యక్తి. ఆయన అద్భుతమైన నటుడు. ఈ మూవీ కోసం డబ్బింగ్ కూడా చెప్పారు. నేను కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పాలనే ప్రయత్నిస్తున్నాను. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవడం ఆనందంగా ఉంటుంది.
  • చిరంజీవి గారు మా అందరినీ ఎంతో ఎంకరేజ్ చేస్తుంటారు. ఆయన్ను ప్రమోషన్స్‌కి పిలిస్తే కచ్చితంగా వస్తారు. మేం కూడా ఆయనకు ట్రైలర్ చూపించాలని అనుకుంటున్నాం.
  • ప్రస్తుతం నేను సినిమాల్ని ఒప్పుకోవడం లేదు. నేను నా ఫ్యామిలీకే టైం కేటాయించాలని అనుకుంటున్నాను. నా కొడుకుతోనే నాకు టైం సరిపోతోంది. కాస్త గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను.
  • సీనియర్ యాక్టర్ నరేష్ గారు, వీటీవీ గణేష్ గారు ఇలా అందరూ అద్భుత పాత్రలు పోషించారు. చాలా ఎంటర్టైనింగ్‌గా ఈ చిత్రం ఉంటుంది. కమల్ హాసన్ గారి ‘సతీ లీలావతి’తో పోల్చలేం. కానీ మా సినిమా మాత్రం వినోదాత్మకంగా సాగుతుంది. అదొక క్లాసికల్ చిత్రం. ఆ చిత్రంతో మా సినిమాని పోల్చకూడదు.
  • వరుణ్‌తో కలిసి నటించాలని నాకు కూడా ఉంది. ఈ మధ్యే ఓ కథ కూడా వచ్చింది. కానీ మేం రియల్ లైఫ్‌లో కలిసే ఉన్నాం. తెరపైనా అలానే కనిపించాలంటే కథ కాస్త కొత్తగా, డిఫరెంట్‌గా ఉండాలి. భవిష్యత్తులో అలాంటి కథ వచ్చినప్పుడు ఆలోచిస్తాం.
  • ‘సతీ లీలావతి’ చిత్రం ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఆడియెన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది.
TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago