ప్రముఖ కథానాయకుడు నితిన్ తదుపరి ఆసక్తికరమైన చిత్రం సాంప్రదాయ పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమైంది.
నాణ్యమైన, విజయవంతమైన చిత్రాలను అందించడంలో పేరుగాంచిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి, ప్రతిభావంతులైన దర్శకులు నారి సిరిసవాడ మరియు సోమశేఖర్ టి దర్శకత్వం వహిస్తున్నారు. బలమైన సృజనాత్మక బృందం ఏకమవ్వడంతో, ప్రకటనతోనే ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ చిత్రంలో నితిన్ కథానాయకుడిగా నటిస్తుండగా, రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా అనిత్ మదాడి, కళా దర్శకుడిగా జానీ షేక్ వ్యవహరిస్తున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక బృందం తమ నైపుణ్యంతో దృశ్యపరంగా ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ నిర్మాణ సంస్థల కలయికలో ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలు రావడంతో, ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ఈ సినిమా చిత్రీకరణ మే రెండో వారం నుండి ప్రారంభం కానుంది. చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నద్ధమవుతోంది.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
నటీనటులు: నితిన్, రితికా నాయక్
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం: అనిత్ మదాడి
కళ: జానీ షేక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)
సహ నిర్మాతలు: ఉప్పుటూరి వెంకట్, వీఎంఆర్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మక చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు…
2 లక్షలకు పైగా ప్రజలు హాజరవడం, 2.6 లక్షల మంది యూట్యూబ్ వీక్షకులు ఏకకాలంలో వీక్షించడంతో, భారతీయ సినిమా చరిత్రలో…
‘ఇట్లు అర్జున’ ఆద్యంతం ఆకట్టుకుంది. అనీష్‌కు తొలి సినిమాతోనే ఛాలెంజింగ్ రోల్ రావడం, దాన్ని అద్భుతంగా నిరూపించుకోవడం, ప్రేక్షకుల ఆశీస్సులు…
57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తొలి తెలుగు రాజకీయ వెబ్…
AI దుర్వినియోగంపై పటిష్ఠ రక్షణ చర్యలు కోరుతూ వినతిపత్రం - సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేస్తామని కేంద్ర మంత్రి…
"యంగ్ అండ్ డైనమిక్", "మా రాముడు అందరివాడు" వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్…