ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించే ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా, తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘భీమ్లా నాయక్’ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా ట్రైలర్ విడుదల అయ్యింది. నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటెన్స్ నెరేషన్, బలమైన ఎమోషన్స్, ఊహించని ట్విస్టులతో నిండిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సంగీత దర్శకుడు శ్రావణ్ భరద్వాజ్ స్కోర్ ట్రైలర్‌ను మరింత ఆకర్షణీయం చేసింది. ఉత్కంఠ, ఆందోళన, ఆకర్షణ మూడింటినీ సమానంగా కలిపి రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా విజయాన్ని ముందే సూచిస్తోంది. రియా జియా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉండేలా సూచిస్తున్నాయి. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో మూవీ టీం సినిమా ఔట్ పుట్ పై సంతోషం వ్యక్తం చేసింది. సినిమా పట్ల తమ నమ్మకాన్ని తెలియజేసింది.
డైరెక్టర్ ప్రణవ స్వరూప్ మాట్లాడుతూ, “ప్రతి ప్రేమకు ఓ చీకటి వైపు ఉంటుంది. ఆ సత్యాన్ని బలంగా చెప్పడమే మా లక్ష్యం. నందు, అవికా నటన ఈ చిత్రానికి బలం చేకూర్చింది. మా ప్రొడ్యూసర్లు సుభాషిణి గారు, లక్ష్మణ్ గారు ఈ సినిమా క్వాలిటీ విషయంలో నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. కచ్చితంగా ఈ సినిమా చూసి, ప్రేక్షకులు థియేటర్లలో మంచి అనుభవం పొందుతారు” అని తెలిపారు. అలాగే ట్రైలర్ లాంచ్ చేసిన సాగర్ కె చంద్ర గారికి కృతజ్ఞతలు తెలిపారు.
హీరో నందు మాట్లాడుతూ, “ఈ పాత్ర నాకు కొత్త ఛాలెంజ్. ఆసక్తికరమైన థ్రిల్లింగ్ సీన్స్‌తో నిండిన స్టోరీ ఇది. అవికా మంచి ఎమోషనల్ డెప్త్ ఇచ్చింది. డైరెక్టర్ ప్రణవ గారు ఈ సినిమాని చాలా బాగా తీశారు. ప్రొడ్యూసర్లు సుభాషిణి గారు, లక్ష్మణ్ గారు అద్భుతమైన నిర్మాణ విలువలు అందించారు. ప్రేక్షకులు ఈ సినిమాని కచ్చితంగా ఆస్వాదిస్తారు” అని తన ఉత్సాహం చూపించారు.
అవికా గోర్ మాట్లాడుతూ, “ఈ చిత్రం ద్వారా ప్రేమ యొక్క వాస్తవాలను చూపించాలనుకున్నాం. ట్రైలర్ చూశాక చాలా ఆనందంగా ఉంది. ఇంత అద్భుతమైన సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం. డైరెక్టర్ ప్రణవ గారికి, నిర్మాతలు సుభాషిణి గారు, లక్ష్మణ్ గారికి రుణపడి ఉంటాను. మే 22న థియేటర్లలో కలుద్దాం” అని అన్నారు. అలాగే ట్రైలర్ లాంచ్ చేసిన సాగర్ కె చంద్ర గారికి కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే నిర్మాతలు సుభాషిణి గారు, లక్ష్మణ్ గారు మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చిందన్నారు. డైరెక్టర్ ప్రణవ పనితనాన్ని.. నందు, అవిక ప్రదర్శనలను ఎంతగానో మెచ్చుకున్నారు. అలాగే ఈ మూవీకి మొదటి నుంచి ఎంతో సహకారం అందించిన బెక్కం వేణు గోపాల్ గారికి, ట్రైలర్ లాంచ్ చేసిన సాగర్ కె చంద్ర గారికి కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాత బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం టీం చాలా కష్ట పడిందని, ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని, ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని అన్నారు. మూవీ టీంకి తన బెస్ట్ విషెస్ తెలిపారు.
సాగర్ కె చంద్ర మాట్లాడుతూ, ట్రైలర్ చాలా బాగుందని టీం ని కొనియాడారు. ఈ సినిమాని తప్పకుండా ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. మూవీ టీంకి తన బెస్ట్ విషెస్ తెలిపారు.
నటీనటులు : నందు, అవికా గోర్, రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా మరియు ప్రజ్ఞా నయన్
బ్యానర్ : రియా జియా ప్రొడక్షన్స్
ప్రొడ్యుసర్ : సుభాషిని, కొండా లక్ష్మణ్
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ప్రణవ స్వరూప్
సహ నిర్మాతలు : రాజ్ నాగ్, అశ్విని శ్రీకృష్ణ
కెమెరా: శ్రీసాయికుమార్ దారా
ఎడిటింగ్ : శ్రీకాంత్ పట్నాయక్
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
ఆర్ట్ డైరెక్టర్ : విఠల్ కోసనం
పి ఆర్ ఓ: మధు వి ఆర్
డిజిటల్ మీడియా : వారే మీడియా , డిజిటల్ దుకాణం
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…