యంగ్ టాలెంట్ సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా లైక్ షేర్ సబ్
స్క్రైబ్ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. వైవిధ్యమైన ప్రచారంతో ఈ
సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు హీరో సంతోష్ శోభన్. దసరా
పండుగ టైమ్ లో రిలీజ్ చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ నుంచి ఈ సినిమా మీద హైప్
పెరుగుతూ వచ్చింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాని సంతోష్ శోభన్ గురించి
ప్రత్యేకంగా మాట్లాడటం ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసింది. సంతోష్ లో తనను
తాను చూసుకుంటానని నాని చెప్పడం ఆయన గొప్పదనం కాగా ఈ యంగ్ హీరోలోని
టాలెంట్ కు ఈ కామెంట్స్ ఒక ఎగ్జాంపుల్ గా చెబుతున్నారు. సునైనతో చేసిన
స్పెషల్ ఇంటర్వ్యూ, నిఖులు ఫన్ ఇంటర్వ్యూ సినిమా మీద హైప్ క్రియేట్
చేశాయి.
ఇక తాజాగా మా సినిమా మీకు తెలుసా అంటూ నేరుగా ప్రేక్షకుల దగ్గరకే వెళ్లి
సినిమా వాళ్లలో ఎంత క్యూరియాసిటీ తీసుకొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం
చేశారు హీరో సంతోష్ శోభన్. కొందరు సినిమా రిలీజ్ గురించే తెలియదు అనడం,
సంతోష్ శోభన్ ను గుర్తుపట్టకపోవడం వంటిని ఈ వీడియోలో ఫన్ తీసుకొచ్చాయి.
దీన్ని ట్రోల్ వీడియోలా మార్చి రిలీజ్ చేశారు. గొప్ప సినిమాను
తెరకెక్కించడమే కాదు దాన్ని అంతే గొప్పగా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా
చూడటం ముఖ్యం. నటించాను నా పని పూర్తయింది అనుకోకుండా సొంత ప్రాజెక్ట్ లా
అందులో చాలా ఇన్వాల్వ్ అయి ప్రమోషన్ చేస్తున్న సంతోష్ శోభన్ ను పలువురు
అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్ వీడియోలకు పాజిటివ్ కామెంట్స్
వస్తుండటంపై టీమ్ హ్యాపీగా ఉంది.