‘సంక్రాంతికి వస్తున్నాం’ విక్టరీ నా కెరీర్ లో ఓ హిస్టరీ: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి

‘ఈ పదేళ్ళు ప్రతి సినిమా ఒక వండర్ ఫుల్ ఎక్సపీరియన్స్. ప్రతి హీరోతో ఒక అద్భుతమైన రిలేషన్. నేను ఏ జోనర్ సినిమా చేసిన ఆడియన్స్ గొప్పగా సపోర్ట్ చేశారు. ప్రతి సినిమాకి ఒకొక్క మెట్టు ఎక్కిస్తూ ఫైనల్ గా ఈ పొంగల్ కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో ఓ అద్భుతమైన విజయం ఇచ్చారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ విక్టరీ నా కెరీర్ లో ఓ హిస్టరీ’ అన్నారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. దర్శకుడిగా ఆయన జర్నీకి జనవరి 23 తో పదేళ్ళు. ఈ సందర్భంగా విలేకరుల సమవేశంలో ముచ్చటించారు అనిల్ రావిపూడి.

దర్శకుడిగా ఈ పదేళ్ళ జర్నీ ఎలా అనిపించింది ? ఎలాంటి హైస్ , లోస్ చూశారు ?
-లక్కీగా ఆడియన్స్ సపోర్ట్ తో అన్నీ హైసే చూశాను. ఈ పదేళ్ళలో చేసిన ప్రతి సినిమా ఒక ఎక్సపీరియన్స్. నేను ఏ జోనర్ సినిమా చేసిన ఆడియన్స్ గొప్పగా సపోర్ట్ చేశారు. ప్రతి సినిమాకి ఒకొక్క మెట్టు ఎక్కిస్తూ ఫైనల్ గా ఈ పొంగల్ కి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో అద్భుతమైన విజయం ఇచ్చారు. ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ క్రెడిట్ అంతా ఆడియన్స్ కే ఇస్తాను. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మామూలు సక్సెస్ కాదు. ఆరు రోజుల్లో వందకోట్ల షేర్, వన్ వీక్ లో 200 కోట్లు క్రాస్ చేయడం అంటే ఓ అద్భుతం. ఇది నా కెరీర్ లో హిస్టరీ. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కి ఈ బలం వుందని ఆడియన్స్ చాలా స్ట్రాంగ్ గా స్టేట్మెంట్ ఇచ్చారని అనిపిస్తోంది.

మీరు కెరీర్ మొదలుపెట్టినప్పుడు అనుకున్న గోల్ కి రీచ్ అయ్యారా ?
-డైరెక్టర్ కావడం నా డ్రీం. అది ‘పటాస్’ తో తీరిపోయింది. ఇదంతా బోనస్ గా భావిస్తున్నాను. నాకు లైఫ్ ఇచ్చింది ఆడియన్స్. వారికి పైసా వసూల్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడమే నా టార్గెట్. అదే చేసుకుంటూ వస్తున్నాను.

-ఈ పదేళ్ళు ప్రతి సినిమా ఒక వండర్ ఫుల్ ఎక్సపీరియన్స్. ప్రతి హీరోతో ఒక అద్భుతమైన రిలేషన్. కళ్యాణ్ రామ్ గారు లేకపొతే నా కెరియర్ లేదు. ఆయన ప్రొడ్యూస్ చేసి నన్ను డైరెక్టర్ గా నిలబెట్టారు. ఈ పదేళ్ళ క్రెడిట్ ముందు కళ్యాణ్ రామ్ గారికి ఇస్తాను. తర్వాత సాయి ధరమ్ తేజ్ గారితో సుప్రీం, రవితేజ గారితో రాజా ది గ్రేట్, వెంకటేష్ గారితో ఎఫ్2, సూపర్ స్టార్ మహేష్ గారితో సరిలేరు నీకెవ్వరు, మళ్లీ వెంకీ గారితో ఎఫ్3, బాలకృష్ణ గారితో భగవంత్ కేసరి మళ్లీ వెంకీ గారితో సంక్రాంతికి వస్తున్నాము.. ప్రతి హీరోతో ప్రతి సినిమా ఒక మెమరబుల్ ఎక్స్ పీరియన్స్. నేను సినిమాలు చూస్తూ విజిల్స్ కొట్టిన హీరోలతో కలిసి పనిచేయడం అల్టిమేట్ ఫీలింగ్.

-‘సంక్రాంతికి వస్తున్నాం’కు వస్తున్న కాంప్లిమెంట్స్ చూస్తుంటే చాలా ఎమోషనల్ గా ఫీలౌతున్నాను. ‘మా అమ్మ ముఫ్ఫై ఏళ్ల తర్వాత సినిమాకి వచ్చింది’ అని ఓ ఫ్రెండ్ ఫోటో షేర్ చేస్తూ మెసేజ్ పెట్టాడు. కొంతమంది వీల్ చైర్ లో వచ్చీ మరి సినిమా చూశారు. సినిమాకి దూరమైన ఆడియన్స్ మళ్ళీ థియేటర్ కి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.

-ఇది ఫ్యామిలీ జోనర్ కి వున్న బలం. ఫ్యామిలీ జోనర్ నా స్ట్రెంత్. ఈ జోనర్ లో సినిమా చేసినప్పుడు ఇంకాస్త కాన్ఫిడెంట్ గా అల్లరి చేస్తూ మంచిగా తీస్తాను(నవ్వుతూ). ఎంటర్ టైన్మెంట్ ఆడియన్స్ నాకు ఇచ్చిన వెపన్. దాన్ని లైఫ్ లైన్ గా ఎప్పుడూ వాడుకుంటాను.

పదేళ్ళ కెరీర్ లో ఏం సంపాదించగలిగారు ?
-నా సినిమాని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్ ప్రేమ. ఈ పదేళ్ళుగా నాకు వచ్చిన ఆస్తి అదే. దీన్ని సినిమా సినిమాకి పెంచుకుంటూ వెళ్తున్నా. సంక్రాంతికి వస్తున్నాం తో నా ఆస్తి విలువేంటో ఆడియన్స్ మళ్ళీ చూపించారు. ఆడియన్స్ ప్రేమ పరంగా నేను మల్టీ మిలీనియర్ ని.(నవ్వుతూ).

సంక్రాంతికి వస్తున్నాం కథ రాసుకున్నప్పుడే ఇంత పెద్ద విజయాన్ని ఊహించారా ?
-ఎఫ్ 2 లాంటి మంచి ఎంటర్ టైనర్ తీద్దామని అనుకున్నాను. ఎఫ్ 2 లా ఆడితే చాలు అనుకున్నా, ఇది మా అంచనాలుకు మించి ఆడుతోంది. ఎనిమిదో రోజు కూడా సినిమా ఫిగర్స్, రెవెన్యు షాకింగ్ గా వుంది. ఇది చాలా సర్ ప్రైజింగ్ గా వుంది. ఫైనల్ నెంబర్ కూడా అందరూ సర్ ప్రైజ్ అయ్యే నెంబర్ ఉండబోతోంది. ఇది వెంకటేష్ గారికి, మా టీం అందరికీ ఆడియన్స్ ఇచ్చిన గొప్ప తీర్పు.

సంక్రాంతి సీజన్ మీకు కలిసొచ్చిందని భావిస్తున్నారా?
-సీజన్ 20% అడ్వాంటేజ్ ఉంటుంది. 80% కంటెంట్ లో విషయం ఉండాలి. సీజన్ సినిమాని కాపాడుతుందని నేను ఎప్పుడు బిలీవ్ చేయను. సినిమా బాగుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఆ అడ్వాంటేజ్ ప్రతి సినిమాకి ఉంటుంది. ఈ సినిమాలో కంటెంట్ పరంగా మేము కొత్తగా ఫీల్ అయింది ఒక భార్య, ఒక మాజీ ప్రేయసితో ఒక వ్యక్తి ప్రయాణం. ఈ మధ్యకాలంలో ఇలాంటి టెంప్లేట్ నేను ఎక్కడా చూడలేదు. ఇది చాలా ఫ్రెష్ గా ఫీల్ అయ్యారు. అది సినిమా అంతటా కమ్యూనికేట్ చేయగలిగాను. ఆడియన్స్ కంటెంట్ ని కొత్తగా ఫీల్ అవ్వడం వల్లే ఇంత గొప్ప జడ్జిమెంట్ ఇచ్చారని భావిస్తున్నాను.

-ప్రమోషన్స్ కూడా చాలా ప్లాన్డ్ గా చేసాం. నాతోపాటు వెంకటేష్ గారు జాయిన్ అవ్వడం అనేది ఒక అద్భుతం. ఆయనకున్న స్టార్డం కి రీల్స్ చేయడం, స్కిట్స్ చేయడం.. ఇవన్నీ పబ్లిక్ పరిశీలించారు. ఈ సినిమాలో ఏదో ఉంది వెళ్లి చూడాలనే ఆసక్తి ఆడియన్స్ లో కలిగింది.

సంక్రాంతి వస్తున్నాం బుక్ మై షోలో టాప్ ట్రెండింగ్ వుండటం ఎలా అనిపిస్తోంది?
-సినిమాకి జెన్యూన్ గా ఆడియన్స్ ఎంతమంది వెళ్తున్నారనేది బుక్ మై షో చూస్తే అర్ధమైపోతుంది. ఈ సినిమా ఓపెనింగ్స్ నుంచే రికార్డ్ స్థాయిలో టికెట్స్ సోల్డ్ అవుతున్నాయి. చాలా ఏరియాల్లో రికార్డ్స్ క్రియేట్ అయ్యాయని చెబుతున్నారు. ఈ సినిమా నా కెరీర్ లో ఎయిత్ వండర్.

సక్సెస్ మీట్ లో దిల్ రాజు గారు శిరీష్ గారు ఈ సక్సెస్ తో అనిల్ మమల్ని నిలబెట్టారని చెప్పడం ఎలా అనిపించింది ?
-నిలబెట్టింది నేనుకాదు..ఆడియన్స్. ఈ క్రెడిట్ అంతా ఆడియన్స్ కే ఇస్తాను. దిల్ రాజు గారు ఎన్నో అద్భుతమైన సక్సెస్ లు ఇచ్చారు. ఈ విజయంతో ఆడియన్స్ వారిని నిలబెట్టారు. సినిమాకి బళ్ళుకట్టుకొని వచ్చి చూశారు. ఈ సినిమా విజయం ఓ వండర్. ఓ కేస్ స్టడీ. ఈ సినిమా ఎందుకు ఇంతపెద్ద హిట్ అయ్యిందో నేను కేస్ స్టడీగా పెట్టుకోవాలి. మేమంతా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాం.

మీ సక్సెస్ సీక్రెట్ ?
-థియేటర్స్ లో ఆడియన్స్ కి చాలా దగ్గరగా ఉండి కథ రాసుకుంటాను. నా నుంచి ఆడియన్స్ ఎలాంటి సినిమా కోరుకుంటారు. అసలు నా బలం ఏమిటి అనేది అనలైజ్ చేస్తాను. ప్రతి సినిమాకి ముందు సినిమా తాలూక క్యారెక్టర్స్, రిసంబులెన్స్ పడకుండా జాగ్రత్త పడతాను. ఆటోమేటిక్ గా సినిమా ఫ్రెష్ గా ఉంటుంది.

ఈ పదేళ్ళలో మీలో మార్పు ఏమిటి ? ఏం నేర్చుకున్నారు?
-ఎలాంటి మార్పు లేదండి. ఇంతకు ముందు ప్రతిదానికి రియాక్ట్ అయ్యేవాడిని. ఇప్పుడు పట్టించుకోవడం మానేశాను. వర్క్ పైనే ఫోకస్ చేస్తాను. ప్రతి శుక్రవారం వచ్చే సినిమాలు చూస్తాను. నేర్చుకోవాల్సిన విషయాలు వుంటే నేర్చుకుంటాను. ఇది ఈ పదేళ్ళుగా చేస్తున్నాను.

దర్శకుడు కాకముందే మీ జర్నీ ఎలా వుండేది ?
-పటాస్ కు ముందే ఏడాదిన్నర జర్నీ వెనక్కి వెళ్లి చూసుకుంటే స్ఫూర్తిదాయకంగా వుంటుంది. చాలా ఎమోషనల్ జర్నీ. చాలా ఓపికగా ప్రయత్నం చేశాను. నాకున్న లిమిటేషన్ తో చాలా కాంపాక్ట్ బడ్జెట్ తో పటాస్ చేశాం. అది ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. డెబ్యునే అందరూ మాట్లాడుకునేలా చేసి సినిమా సినిమాకి ఒకొక్కమెట్టు ఎదుగుతూ ప్రతి సినిమాకి ప్రూవ్ చేసుకోవడం నాకే ఒక ఇన్స్పిరేషన్.

బుల్లి రాజు పాత్రకు హైహై నాయిక సినిమా స్ఫూర్తి ఉందా ?
-ఉంది. జంధ్యాల గారి సినిమాలు నాకు చాలా ఇష్టం. హైహై నాయక లో ఒక సౌండ్ ఎఫెక్ట్ తో అది వస్తుంది. ఇప్పుడు ఓటీటీ నేపధ్యంలో బుల్లిరాజు పాత్రని డిజైన్ చేశాను. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

మిమ్మల్ని ఆడియన్స్ ఈవివి గారితో పోల్చడం ఎలా అనిపిస్తుంది.

  • ఈవివి గారు ఓ లెజెండ్. ఆయన సినిమాలు చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఆయనతో పోల్చడం బిగ్గెస్ట్ కాంప్లిమెంట్, బిగ్గెస్ట్ రెస్పాన్స్ బులిటీ.

చిరంజీవి గారితో చేసే సినిమా ఎలా వుంటుంది ?
-చిరంజీవి గారితో చేయబోయే సినిమా గురించి ఇప్పుడే మాట్లాడటం టూ ఎర్లీ అవుతుంది. ఎలాంటి జోనర్ లో చేయాలనే టాక్స్, హోమ్ వర్క్ జరుగుతుంది. వందశాతం అందరూ ఊహించినదానికంటే ఎక్కువగా చిరంజీవి గారిని ప్రజెంట్ చేయాలనే విల్ పవర్ తో వున్నాను.

నాగర్జున గారితో సినిమా ఎప్పుడు ?
-వందశాతం చేస్తాను. ఆయనతో హలో బ్రదర్ లాంటి సినిమా చేయాలని వుంది. నేను చూసిన ఫోర్ పిల్లర్స్ తో నాలుగు సినిమాలు చేశాననే రికార్డ్ కూడా నాకు వుంటుంది.

Tfja Team

Recent Posts

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘విలేజ్ స్టార్స్’ సినిమా

హైదరాబాద్: తెలుగు తెరపైకి మరో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ రాబోతొంది. ఎన్‌ఎస్‌వీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కనున్న నూతన చిత్రం ‘విలేజ్ స్టార్స్’…

53 minutes ago

కల్ట్ ప్రొడ్యూసర్ SKN గారి చేతుల మీదగా మిస్సింగ్ మేఘన మూవీ టీజర్ లాంచ్*

ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో…

2 hours ago

‘అమీర్ లోగ్’ లాంటి చిత్రం ఇప్పటి వరకు రాలేదు.. ఇది కచ్చితంగా హిట్టు బొమ్మ.. ప్రెస్ మీట్‌లో దర్శకుడు రమణా రెడ్డి సోమ

'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా…

2 hours ago

విజయదశమి పర్వదినం సందర్భంగా అక్టోబర్ 17న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ “కిల్లర్”

సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచుతున్న "కిల్లర్" రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్…

2 hours ago

ప్రకాష్ రాజ్, మధుబాల, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’.. సెప్టెంబర్ 4గా స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించిన అమెజాన్ ప్రైమ్ వీడియో

భారతదేశంలో ప్రత్యేకమైన ఒరిజినల్స్ అందించే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో తాజాగా తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్…

4 hours ago

అనుకున్న సమయానికి, తక్కువ బడ్జెట్‌లో సినిమా ప్రాజెక్ట్‌ పూర్తి కావాలా?.. ఆల్‌ ఇన్‌ వన్‌ సాఫ్ట్‌వేర్ ‘సినరీ’ ఉందిగా!

సినిమా, షార్ట్‌ ఫిల్మ్‌, వెబ్‌ సిరీస్‌ వంటి ప్రాజెక్టులను రూపొందించే ప్రతి నిర్మాత, దర్శకుడు, మూవీ ప్రొఫెషనల్‌కు ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌…

6 hours ago