బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రజాకార్. ఈ చిత్రాన్ని సమర్‌వీర్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. యాటా సత్యనారాయణ దరకత్వం వహించారు. గతేడాది థియేటర్స్ లో రిలీజై మంచి విజయాన్ని అందుకున్న రజాకార్ సినిమా ఈ నెల 24వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో
నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ – సినిమాలను డబ్బు కోసం, ఎంటర్ టైన్ మెంట్ కోసం చేస్తుంటారు. కానీ మేము రజాకార్ సినిమాను ఒక బాధ్యతతో చేశాం. నిజాం పాలనలో రజాకార్లు సాగించిన అకృత్యాలను కళ్లకు కట్టినట్లు చూపించాలనే ప్రయత్నం చేశాం. రేపటి తరాలు రజాకార్ల అకృత్యాలను తెలుసుకోవాలి. మరోసారి అలాంటి వారు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ సినిమా నిర్మించే క్రమంలో నాకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. కానీ నేను భయపడలేదు. సినిమాను నిర్మించాను. ఐఎండీబీలో 9.5 రేటింగ్ వచ్చింది. గోవా ఫిలిం ఫెస్టివల్ లో సన్మానం చేశారు. మా టీమ్, మా డైరెక్టర్ యాాటా సత్యనారాయణ సపోర్ట్ తో సినిమా సక్సెస్ పుల్ గా ప్రేక్షకులకు రీచ్ చేయగలిగాం. సొసైటీకి ఇది నేను ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అనుకుంటా. ప్రజల నుంచి వచ్చిన స్పందన నాకు ఎంతో సంతృప్తిని మిగిల్చింది. ఈ సినిమాను మరో ప్రొడ్యూసర్ చేయలేడని చెప్పగలను. ఇప్పుడు మన తెలుగు వారి ఓటీటీకే మూవీ ఇవ్వాలని ఆహాలోకి తీసుకొస్తున్నాం. ఈ నెల 24వ తేదీ నుంచి ఆహాలో మా సినిమా ప్రీమియర్ కు వస్తోంది. మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
నటి ఇంద్రజ మాట్లాడుతూ – రజాకార్ సినిమాను ప్రొడ్యూసర్ గూడూరు సత్యనారాయణ రెడ్డి గారు ఎన్నో కష్టాలకు తట్టుకుని నిర్మించారు. దర్శకుడు యాటా సత్యనారాయణ గారు పదేళ్లు ఈ మూవీ కోసం కష్టపడ్డారు. రజాకార్ల అకృత్యాలకు ఈ సినిమా గొప్ప డాక్యుమెంటరీ. మన నేల చరిత్ర గురించి తెలుసుకోవడం ఇక్కడ బతికే ప్రతి ఒక్కరి బాధ్యత. మతాలకు అతీతంగా ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆహాలో చూడాలి. ఎందుకంటే ఇది హిందూ, ముస్లిం మతాల మధ్య విభేదాలు సృష్టించే మూవీ కాదు. చరిత్రలో జరిగింది జరిగినట్లు తెరకెక్కించారు. ముస్లిం జర్నలిస్ట్ క్యారెక్టర్ మా సినిమాలో గొప్పగా ఉంటుంది. అలాగే ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసిన ఆరో నిజాం ఘనతను కూడా చెప్పాం. నేను ఈ సినిమాలో వీరనారి చాకలి ఐలమ్మ క్యారెక్టర్ లో నటించాను. ఇలాంటి గొప్ప క్యారెక్టర్ లో నటించే అవకాశం కల్పించిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. చాకలి ఐల్మమ చేస్తున్నాని తెలిసినప్పుడు ఆమె చరిత్ర చదివి తెలుసుకున్నాను. ఆమె ఒక నిప్పురవ్వలా అప్పటి అకృత్యాలపై ఎదురుతిరిగారు. అన్నారు.
నటుడు నాగమహేశ్ మాట్లాడుతూ – రజాకార్ చిత్రంలో నేను రాపాక రామచంద్రారెడ్డి అనే దేశ్ ముఖ్ క్యారెక్టర్ లో నటించాను. చాలా క్రూరమైన పాత్ర ఇది. సినిమాలో కీలకమైన ఇలాంటి పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు యాటా సత్యనారాయణ గారికి థ్యాంక్స్. ఆయన ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమాను రూపొందించారు. అలాగే ఒక మంచి లక్ష్యంతో నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి గారు నిర్మించారు. ఆహా ఓటీటీలో రజాకార్ మూవీని చూసి సపోర్ట్ చేయండి. అన్నారు.
డైరెక్టర్ యాటా సత్యనారాయణ మాట్లాడుతూ – మా రజాకార్ మూవీకి తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, ఇతర భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. 18 ఫిలిం ఫెస్టివల్స్ కు అప్లై చేస్తే 15 ఫిలిం ఫెస్టివల్స్ కు సెలెక్ట్ అయ్యింది. గోవాలో జరిగిన ఇఫ్పీలో బెస్ట్ ఇండియా డెబ్యూగా నమోదైంది, బెస్ట్ డైరెక్టర్ గా నామినేట్ అయ్యాను. గోవాలో 75 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు రాజాకార్ సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో 72 దేశాల ప్రతినిధులు వచ్చి మా మూవీ చూశారు. ఇంత గొప్ప స్వాతంత్య్రపోరాటం జరిగిందా అని వారంతా ఆశ్చర్యపోయారు. ఎన్నో అవార్డ్ లు దక్కించుకుంది మా మూవీ. థియేట్రికల్ రిలీజ్ టైమ్ లో మంచి సమ్మర్, విద్యార్థులకు పరీక్షలు జరిగే టైమ్ కాబట్టి ఎక్కువమంది మా సినిమాను చూడలేకపోయారు. ఓటీటీలోకి మూవీని ఎప్పుడు తీసుకొస్తారు అని వందల ఫోన్ కాల్స్ వచ్చాయి. మాకు మూడు ఓటీటీల నుంచి ఆఫర్స్ వచ్చాయి. అయితే ఆహాలో మాత్రమే 25 నుంచి 30 లక్షల మంది తెలుగు ప్రేక్షకులు సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. మన చరిత్రను తెలుగు ప్రేక్షకులు తెలుసుకోవాలంటే ఆహా కరెక్ట్ ప్లాట్ ఫామ్ అని భావించి ఈ నెల 24న ప్రీమియర్ కు తీసుకొస్తున్నాం. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా మా మూవీ ఉంటుంది. తప్పకుండా మీరంతా ఆహాలో రజాకార్ సినిమా చూడాలని కోరుకుంటున్నా. మొదటి నుంచి ఆహా మాకు సపోర్ట్ గా ఉంది. ఫిలిం ఫెస్టివల్స్, హిందీ రిలీజ్ వల్ల ఓటీటీకి ఇవ్వడం ఆలస్యమైంది. తెలంగాణ చరిత్రకు సంబంధించి 20 మంది వీరుల కథలు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. అవకాశాన్ని బట్టి ఆ వీరుల చరిత్రను సినిమాగా రూపొందిస్తా. నిడివి ప్రకారం ఆపరేషన్ పోలోను ఎంతవరకు చూపించగలమో అంతవరకు మా మూవీలో తెరకెక్కించాం. అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ తిరుమల తిరుపతి మాట్లాడుతూ – రజాకార్ సినిమాకు ఆర్ట్ వర్క్ చేసే అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతకు థ్యాంక్స్. చాలా పెద్ద స్పాన్ ఉన్న చిత్రమిది. ఇలాంటి హిస్టారికల్ మూవీకి ఆర్ట్ వర్క్ చేయడం ఎంతో హ్యాపీగా అనిపించింది. డైరెక్షన్ టీమ్, మా డైరెక్టర్ గారు ఇచ్చిన ఇన్ పుట్స్, మెటీరియల్ సపోర్ట్ తో వర్క్ చేశాను. ఈ సినిమా పూర్తయ్యాక నాకు ఎంత సంతృప్తి కలిగిందంటే మరో మూవీ నేను చేయకున్నా ఫర్వాలేదు అనిపించింది. అన్నారు.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…