ప్రఖ్యాత కూచిపూడి నృత్యకారిణి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న తెలుగు నటి సంధ్యారాజుకు అరుదైన గౌరవం దక్కింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం అందింది. 77వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో నిర్వహించే `ఎట్ హోమ్`సెలబ్రేషన్స్ కి ఆహ్వానిస్తూ లేఖ అందింది.
తన తొలి చిత్రం `నాట్యం`తో రెండు జాతీయ పురస్కారాలను దక్కించుకున్న ఘనత సంధ్యారాజుకు సొంతం. తమిళనాడు బేస్డ్ వ్యాపారవేత్త, రామ్‌కో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ పి.ఆర్.వెంకట్రామరాజా పుత్రిక సంధ్యారాజు. హైదరాబాద్‌లో నిశృంఖల డ్యాన్స్ అకాడెమీ, నిశృంఖల ఫిల్మ్ ఫౌండర్‌గా అనేక కార్యకలాపాలు చేస్తున్నారు. తన నృత్య కళతో ప్రపంచ యవనిక మీద అసమానమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారు సంధ్యారాజు. ప్రత్యక్ష నృత్య ప్రసారాల్లో పాల్గొనడమే కాదు, చలనచిత్ర రంగంలోనూ తనదైన ముద్రతో దూసుకుపోతున్నారు.
నటిగా, క్లాసికల్ డ్యాన్సర్‌గా, జాతీయ పురస్కారాన్ని అందుకున్న కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా… భారతీయ సాంస్కృతిక రంగంలో ఎంతో మందికి స్ఫూర్తి పంచుతున్నారు సంధ్యారాజు. ఎట్ హోమ్ రిసెప్షన్ ని ఆగస్టు 15 సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహిస్తారు. ఆగస్టు 15న ఉదయం జెండా వందనం పూర్తవగానే సాయంత్రం ఎట్ హోమ్ రిసెప్షన్‌ని రాష్ట్రపతి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
ఈ రిసెప్షన్‌లో రాష్ట్రపతి మన కట్టుబొట్టును ప్రతిబింబించే వస్త్రాలలో కనిపిస్తారు. హాజరైన అతిథులతో ఆత్మీయంగా సమావేశమవుతారు. ఈ రిసెప్షన్‌కి సీనియర్ రాజకీయనాయకులు, మిలిటరీ అధికారులు, ఇతరత్రా రంగాల్లో క్రియాశీలక వ్యక్తులు హాజరవుతారు. అతిథులు ఫార్మల్, సెమీ ఫార్మల్ వేషధారణలో హాజరవుతారు.
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ…
సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం 'అనగనగా ఒక…
అంతకుమించి చిత్రం పేం సతీష్ జై, డాక్టర్ మైత్రి షరణ్ ల కుమార్తె "నైరా" మొదటి పుట్టినరోజు వేడుకలు ఇటీవల…
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు…