ప్రామిసింగ్ యంగ్ హీరో సందీప్ కిషన్, టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ రెండవసారి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘ఊరు పేరు భైరవకోన’ కోసం జతకట్టారు. ఫాంటసీ అడ్వంచర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తునారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత.
సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు ఇదివరకే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్.. ఈ సినిమా కోసం ఒక ఫాంటసీ వరల్డ్ ని క్రియేట్ చేశారని సూచించింది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సౌండ్‌ట్రాక్‌లను అందించారు. మేకర్స్ మొదటి సింగిల్ ‘నిజమే నే చెబుతున్నా’ విడుదల చేయడం ద్వారా మ్యూజికల్ జర్నీని ప్రారంభించారు.
సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మపై చిత్రీకరించిన బ్రీజీ రొమాంటిక్ నంబర్‌ను కంపోజ్ చేశారు శేఖర్ చంద్ర. సిద్ శ్రీరామ్ తన మ్యాజికల్ వాయిస్ తో మరింత ప్రత్యేకంగా ,మంత్రముగ్ధులను చేసాడు. ఇన్స్టెంట్ హిట్‌గా మారిన ఈ ఆహ్లాదకరమైన పాటలో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మపై తన భావాలను వివరిస్తూ కనిపించారు. శ్రీమణి సాహిత్యం అందించారు. అద్భుతమైన కంపోజిషన్, బ్యూటిఫుల్ సింగింగ్, ఆకట్టుకునే సాహిత్యంతో ఈ పాట మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలుస్తుంది. సందీప్ కిషన్ డ్యాన్స్‌లు గ్రేస్ ఫుల్ గా ఉన్నాయి. వర్ష బొల్లమ్మ చాలా అందంగా కనిపించింది.
కావ్య థాపర్ మరో కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.
తారాగణం: సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ తదితరులు
సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: విఐ ఆనంద్
సమర్పణ: అనిల్ సుంకర
నిర్మాత: రాజేష్ దండా
సహ నిర్మాత: బాలాజీ గుత్తా
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ : రాజ్ తోట
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: ఎ రామాంజనేయులు
సంభాషణలు: భాను భోగవరపు, నందు సవిరిగాన
పీఆర్వో: వంశీ-శేఖర్
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…