‘మీటర్’ థియేటర్ లో రఫ్ఫాడించేస్తుంది : రమేష్ కడూరి

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్  ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అతుల్య రవి కథానాయికగా నటిస్తోంది. ఔట్ అండ్ ఔట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో దర్శకుడు రమేష్ కడూరి మీటర్ విశేషాలని విలేఖరుల సమావేశంలో పంచుకున్నారు.  

మీ నేపధ్యం గురించి చెప్పండి ?
మాది విజయనగరం జిల్లా గరివిడి మండలం. సినిమాలపై ఇష్టంతో దర్శకుడు కావాలని పరిశ్రమలోకి వచ్చాను. బాబీ గారు , గోపీచంద్ మలినేని గారి దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశాను. ఇప్పుడు మీటర్ తో దర్శకుడిగా పరిచయమౌతున్నాను.

మీటర్  ప్రాజెక్ట్ ఎలా ఓకే అయ్యింది ?
రచయిత శ్రీకాంత్ విస్సా మైత్రీ మూవీ మేకర్స్ కి రిఫర్ చేశారు. తర్వాత బాబీ గారు, గోపీచంద్ మలినేని గారి ప్రోత్సాహంతో ఈజీ అయ్యిది. కరోనా లాక్ డౌన్ తర్వాత ప్రాజెక్ట్ ఓకే అయ్యింది.

మీటర్ టైటిల్ పెట్టడానికి కారణం
మీటర్ అంటే కొలత. ఇందులో హీరోయిజానికి సంబధించిన ఒక కొలత.. ఎమోషన్, ప్రేమకు సంబధించిన ఒక కొలత… కిరణ్ అబ్బవరం ఇంతకుముందు చేసిన సినిమాలన్నిటి కంటే ఇది డిఫరెంట్ గా వుంటుంది.

కిరణ్ సీరియస్ పోలీస్ లా కనిపిస్తారా ?
ఇందులో తన పాత్ర ఒక డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్ గా వుంటుంది. తను సీరియస్ కాప్ గా సెకండ్ హాఫ్ లో ఓ పది నిమిషాలు వుంటుంది. ఆ పది నిముషాలు థియేటర్ లో రఫ్ఫాడించేస్తాడు. మిగతా అంతా ఒక మంచి ఎంటర్ టైనర్ గా మంచి ఫన్ తో వెళుతుంది.

పక్కా కొలతలు పెట్టుకొని కమర్షియల్ ఫార్మెట్ లో చేసినట్లుగా వున్నారు ?
కావాలని పెట్టుకున్న కొలతలు కాదు. ఈ కథ అలా కుదిరింది. అలా అని రెగ్యులర్ ఒక పాట ఫైటు అన్నట్టుగా వుండదు. రెగ్యులర్ ఫార్మెట్ ని బ్రేక్ చేస్తుంది. డిఫరెంట్ గా ఉంటూనే కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వుంటుంది.

కిరణ్ అబ్బవరం ఇంత మాస్ పాత్రకు ఎలా సూట్ అవుతారనే ఆలోచన రాలేదా ?
మన దగ్గర ఏముందో దానితోనే గెలవాలి. ఈ కథ తో ఇద్దరు ముగ్గురు హీరోలని సంప్రదించాను. అయితే అప్పటికే వాళ్ళు చేయాల్సిన ప్రాజెక్ట్ లు వుండటం , ఇంకొన్ని కారణాల వలన కుదరలేదు. అలా అని వుండిపొతే నా కెరీర్ ఆగిపోతుంది. అందుకే ఎవరిని పట్టుకున్న మనం అనుకున్నట్లు చూపించాలని నిర్ణయించుకున్నాను.  అప్పడే ఎస్ఆర్ కళ్యాణ మండపం తో వచ్చాడు కిరణ్. నిర్మాతలు కూడా ఆ సినిమాని చూశారు. ఈ కథ అతనికి పడితే బావుంటుందని ఫీలయ్యారు. వెళ్లి కథ చెబితే ఓకే చేశారు. ఓకే చేసిన తర్వాత ఇంక అలోచించలేదు.

అతుల్య రవిని ఎలా ఎంపిక చేశారు ?
తను తమిళ్ లో చేసిన రెండు సినిమాలు చూశాను. తన నటన బావుంటుంది. తనకి తెలుగు కూడా రావడంతో నాకు ఇంకా ప్లస్ అయ్యింది.

మీలో ఎనర్జీ సినిమాలో చూపించారా ?
మాగ్జిమమ్ ప్రయత్నించాం(నవ్వుతూ) నాకు మంచి ఊపు, ఎంటర్టైమెంట్ వున్న కమర్షియల్ సినిమాలు ఇష్టం. నా మనస్త్వం కూడా అదే.

సాయి కార్తిక్ మ్యూజిక్ గురించి ?
కమర్షియల్ టోన్ తెలిసిన సంగీత దర్శకుడు సాయి కార్తిక్. తన చేసిన పటాస్ సినిమా నాకు చాలా ఇష్టం. ఈ కథకు మా పరిధిలో సరైన ఎంపిక సాయి కార్తిక్. నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ ఇచ్చాడు.

మీటర్  లో మెసేజ్ ఉంటుందా ?
లేదండీ. నేను ఎప్పుడూ మెసేజ్ ఇవ్వను. మీటర్ చాలా మంచి ఎంటర్ టైనర్. తండ్రి కొడుకుల మధ్య మంచి ఎమోషన్ వుండే కథ. సినిమా అంతా చాలా ఎంటర్ టైనర్ గా వుంటుంది.

అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్ అయ్యిందని విన్నాం ?
సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే బడ్జెట్ కి వెనుకడుగు వేయని నిర్మాతలు దొరకడం నా అదృష్టం. సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే మనం అడగకముందే ఇస్తారు. చెర్రీగారికి, రవి గారికి, నవీన్ గారి లైఫ్ లాంగ్ రుణపడి వుంటాను.

కొత్త చేయబోతున్న సినిమాలు గురించి ?
కొన్ని కథలు వున్నాయి. అయితే ఏదీ ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం మీటర్ విడుదలపైనే నా దృష్టంతా వుంది.
ఆల్ ది బెస్ట్
థాంక్స్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

15 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

15 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

15 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago