రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా “సంహారం”

గతంలో దాసరి, మోహన్ బాబు, జగపతిబాబు, శ్రీకాంత్ తదితరుల వద్ద వందకు పైగా సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేసిన ధర్మ ఇప్పుడు మెగా ఫోన్ పట్టారు. రత్న మేఘన క్రియేషన్స్ పతాకంపై దర్శక, నిర్మాతగా ఆయన తెరకెక్కించిన చిత్రం “సంహారం”.
ఆదిత్య, కవిత మహతో హీరో హీరోయిన్లుగా నటించారు.

ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుని ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. చిత్రం పాటలను, ప్రోమోస్ ను ప్రదర్శించారు.
దీనికి అతిధిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ, “గురువు దాసరి గారి కాంపౌండ్ లో పలు చిత్రాలకు ధర్మ పనిచేయడం వల్ల నాకు పరిచయం ఉంది. చిత్రపరిశ్రమలోని ఆటుపోట్లను సుదీర్ఘ అనుభవంలో అర్ధం చేసుకుని, అవహగాన చేసుకున్న టెక్నీషియన్ ధర్మ ఈ చిత్రం ద్వారా దర్శక, నిర్మాతగా మారడం అభినందనీయం. పాటలు, ప్రోమోస్ చాలా బావున్నాయి” అని అన్నారు.

దర్శక, నిర్మాత ధర్మ మాట్లాదుతూ, “రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఒక అమ్మాయి తనకు, తన అక్కకు అనుకోని ఘటనలు ఎదురైనపుడు తను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ తో దుష్టులను ఎలా ఎదుర్కొంది అన్న పాయింట్ తో ఈ సినిమాను మలిచాం. తమను తాము కాపాడుకునేందుకు అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ అత్యంత ఆవశ్యకమని ఈ చిత్రంలో చూపించాం. సంగీత సాకేత్ సాయిరాం ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించడంతో పాటు మంచి సంగీతాన్ని అందించారు. తప్పకుండా ఈ చిత్రం మా అందరి అంచనాలను నిలబెడుతుంది” అని చెప్పారు.

సంగీత దర్శకుడు, ఈ చిత్రంలో విలన్ గా నటించిన సాకేత్ సాయిరాం మాట్లాడుతూ, ఇప్పటివరకు 44 సినిమాలకు సంగీతాన్ని అందించాను. గతంలో నేను దర్శకత్వం వహించిన చిత్రాలలో కూడా నటించాను. కాకపోతే ఈ చిత్రంలోని ప్రధాన విలన్ పాత్ర పేరు తెచ్చిపెడుతుందన్న నమ్మకం ఉంది. ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి. పాటలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి” అనిఅన్నారు .

ఇంకా ఈ చిత్రానికి పనిచేసిన ఛాయాగ్రాహకుడు శ్రీనివాస్ శ్రీరాముల, గాయనీగాయకులు రవి వర్మ, హరి, మానస ఆచార్య పలువురు
సాంకేతిక నిపుణులు పాల్గొని, చిత్రం గురించి మాట్లాడారు.

ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో కోటయ్య, రాధోడ్, స్నేహశర్మ, రామకృష్ణ, రామిరెడ్డి, దాస్, సాయి, సాయిరాం చౌదరి తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: సాకేత్ సాయిరాం, ఛాయాగ్రహణం: శ్రీనివాస్ శ్రీరాముల, ఎడిటింగ్: కృష్ణ, డాన్స్: వినయ్, సమర్పణ: శ్రీరాముల నాగరత్నం, నిర్మాత, దర్శకత్వం: ధర్మ

Tfja Team

Recent Posts

షూటింగ్‌ పూర్తి చేసుకున్న హ్రీం…

తెలుగు భీజాక్షరాల్లో ‘హ్రీం’ అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. ‘హ్రీం’ అనే ఒక్క భీజాక్షరంలో…

16 hours ago

యూవీ కాన్సెప్ట్స్, సంతోష్ శోభన్ “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా నుంచి ‘గాబరా గాబరా..’ లిరికల్ సాంగ్ రిలీజ్

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ…

17 hours ago

ఫిబ్రవరి 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ‘హే భగవాన్‌’

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

17 hours ago

త్వ‌ర‌లోనే నితిన్ 36వ సినిమా షూటింగ్ ప్రారంభం

నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న యూనిక్ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌.. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో…

4 days ago

ప్రముఖ సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కాంస్య విగ్రహవిష్కరణ

తానా సాహిత్య విభాగం - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల…

4 days ago

రికార్డులు తిరగరాస్తున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్‌ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద విజయంయూఎస్‌లో హ్యాట్రిక్…

1 week ago