ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో ఉన్న లింగ భైరవి దేవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ ద్వారా ఒక్కటయ్యారు.
కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకను అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన పవిత్ర ప్రక్రియే ఈ ‘భూత శుద్ధి వివాహం’. లింగ భైరవి ఆలయాల్లో లేదా ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించే ఈ వివాహ క్రతువు, వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుంది. వారి దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది.
సమంత, రాజ్ జంటకు ఈశా ఫౌండేషన్ హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలిపింది. దేవి అపారమైన అనుగ్రహంతో వీరి జీవితం ఆనందమయంగా సాగాలని ఆకాంక్షించింది.
https://www.instagram.com/p/DRtrePWET2L/?hl=en&img_index=1
లింగ భైరవి గురించి సద్గురు చేతుల మీదుగా ఈశా యోగ కేంద్రంలో ‘ప్రాణ ప్రతిష్ఠ చేయబడిన లింగ భైరవి దేవి, స్త్రీ శక్తికి సంబంధించిన ఉగ్ర మరియు కారుణ్య స్వరూపం. జీవితాన్ని సుసంపన్నం చేసే ఎన్నో విశిష్టమైన ఆచారాలకు ఈ ఆలయం నెలవు. విశ్వంలోని సృజనాత్మక శక్తికి ప్రతీకగా నిలిచే ఈ ఎనిమిది అడుగుల శక్తి స్వరూపం- భక్తుల మనశ్శరీరాలను, శక్తులను స్థిరపరుస్తూ, జననం నుండి మరణం (ముక్తి) వరకు జీవితంలోని ప్రతి దశలోనూ వారికి అండగా నిలుస్తుంది.
నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…
శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…
సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…
ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…
ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…