ప్రముఖ కొరియోగ్రాఫర్, తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్‌కు నృత్య రీతులు సమకూర్చిన జానీ మాస్టర్ కథానాయకుడిగా రూపొందుతోన్న సినిమా ‘రన్నర్’. ‘అరవింద్ 2’ చిత్ర నిర్మాతలు విజయ భాస్కర్, జి. ఫణీంద్ర, ఎం. శ్రీహరి విజయ ఢమరుక ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ చౌదరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రోజు జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ వెల్లడించడంతో పాటు ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
పోలీస్ నేపథ్యంలో తండ్రీ కుమారుల మధ్య అనుబంధంతో సాగే కథతో సినిమా రూపొందిస్తున్నామని చిత్ర బృందం తెలియజేసింది. ‘రన్నర్’ ఫస్ట్ లుక్ చూస్తే… ఖాకీ ప్యాంట్ వేసిన జానీ మాస్టర్, షర్టులో వేరియేషన్ చూపించారు. ఒకవైపు ఖాకి ఉంటే… మరోవైపు ఖద్దర్ ఉంది. ఎందుకు అలా డిజైన్ చేశారు? ఆయన ఎవరికి నమస్తే పెడుతున్నారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
చిత్రదర్శకుడు విజయ్ చౌదరి మాట్లాడుతూ ”మా హీరో, డ్యాన్సింగ్ స్టార్ జానీ మాస్టర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనతో సినిమా చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. జానీ గారి నటన, ఆయన క్యారెక్టరైజేషన్, కథలో తండ్రి కుమారుల మధ్య సెంటిమెంట్ సీన్స్ హైలైట్ అవుతాయి. ఇదొక డిఫరెంట్ థ్రిల్లర్ సినిమా. మణిశర్మ గారు అద్భుతమైన బాణీలు అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన ట్యూన్లకు జానీ మాస్టర్ వేసే స్టెప్పులు అదిరిపోతాయి. ఇతర నటీనటులు, మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అని చెప్పారు.
చిత్ర నిర్మాతలు విజయ భాస్కర్, జి. ఫణీంద్ర, ఎం. శ్రీహరి మాట్లాడుతూ ”జానీ గారికి హ్యాపీ బర్త్డే. మా దర్శకుడు విజయ్ చౌదరి మంచి కథ రాశారు. స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా క్లారిటీతో చేశారు. హైదరాబాద్ నగరంలో కొన్నాళ్ళ క్రితం జరిగిన వాస్తవ ఘటనలు, సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేశాం” అని చెప్పారు.
జానీ మాస్టర్ హీరోగా నటిస్తున్న ‘రన్నర్’ చిత్రానికి డిజిటల్ మీడియా ప్రమోషన్స్ : టాక్ స్కూప్, పీఆర్వో : పులగం చిన్నారాయణ, ఛాయాగ్రహణం : పి.జి. విందా, సంగీతం : ‘మెలోడీ’ బ్రహ్మ మణిశర్మ, నిర్మాణ సంస్థ : విజయ ఢమరుక ఆర్ట్స్, నిర్మాతలు : విజయ భాస్కర్, జి. ఫణీంద్ర, ఎం. శ్రీహరి, కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : విజయ్ చౌదరి.
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…