రంగబలి గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్

యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘రంగబలి’ తో వస్తున్నారు. ఎస్‌ ఎల్‌ వి సినిమాస్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌, థియేట్రికల్ ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. జూలై 7న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకునే సుమగారు ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఉండటం ఆనందంగా వుంది. సుధాకర్ గారు, నేను ఎప్పటి నుంచో కలసి సినిమా చేయాలని అనుకున్నాం. పవన్ చెప్పిన కథ మా ఇద్దరికీ నచ్చింది. చేస్తే ఇలాంటి కథ చేయాలనిపించింది. చాలా నమ్మకంగా చెబుతున్నాను. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. నాకు ఈ సినిమా నుంచి బ్లాక్ బస్టరే కావాలి. చాలా మంచి సినిమాని ప్రేక్షకులకు, అభిమానులకు ఇవ్వబోతున్నాననే నమ్మకం వుంది. ఇప్పటివరకూ సుధాకర్ గారికి వచ్చిన లాభాలు కంటే ఈ సినిమాకి వచ్చిన లాభాలు ఎక్కువగా ఉంటాయని నమ్మకంగా చెబుతున్నాను.  యుక్తి చక్కగా నటించింది. సత్య మంచి టైమింగ్ వున్న నటుడు. ఇందులో మంచి ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. వంశీ, దివాకర్ మణి మంచి విజువల్స్ ఇచ్చారు. పవన్ చాలా మంచి ఆల్బం ఇచ్చారు. పాటలకు వండర్ ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు పవన్ చాలా భాద్యత  గా, నిజాయితీగా సినిమా తీశారు. తను చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. జూలై 7న థియేటర్ లో కలుద్దాం” అన్నారు.

సుమ మాట్లాడుతూ.. ఈ వేడుకలో ముఖ్య అతిధిగా మాట్లాడటం ఆనందంగా వుంది. ఇలాంటి కమర్షియల్ సబ్జెక్ట్, ఎంటర్ టైన్ మెంట్ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. శౌర్య మొదటి సినిమా నుంచి ఎంతో కష్టపడుతున్నారు. సుధాకర్ గారు సినిమా అంటే ప్యాషన్ వున్న ప్రొడ్యుసర్. పవన్ గారికి అభినందనలు. సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. జులై 7 థియేటర్ థియేటర్ లో కలుద్దాం” అన్నారు.

దర్శకుడు పవన్ బాసంశెట్టి మాట్లాడుతూ.. ఈ వేదికపై ఉండటానికి కారణం శౌర్య అన్న, సుధాకర్ గారు. ఈ సినిమాలో శౌర్య హీరోయిజం, ఎమోషన్ కొత్తగా చూస్తారు. నిర్మాత ఎక్కడ రాజీపడకుండా తీశారు. వంశీ, దివాకర్ మణి గారు బ్రిలియంట్ వర్క్ చేశారు. యుక్తి చాలా చక్కగా నటించింది. ఈ సినిమాలో నటించిన అందరికీ థాంక్స్. పవన్ సిహెచ్  మంచి పాటలు ఇచ్చారు. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి ట్యాలెంటెడ్ టీంతో పని చేశాం. చాలా మంది కొత్త దర్శకులు పరిశ్రమలోకి వస్తున్నారు. వారికి కూడా ఇలాంటి మంచి హీరో, నిర్మాత దొరకాలని కోరుకుంటున్నాను. అంతా ఈ సినిమా మొదటి రోజు చూడండి. కొత్త దర్శకుల సినిమాని నేను కూడా ఫస్ట్ డే చూస్తాను. అందరికీ కృతజ్ఞతలు” తెలిపారు.

యుక్తి తరేజ మాట్లాడుతూ..దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. శౌర్య గారి  తో  కలసి పని చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ టీంతో కలిసి పని చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. జులై 7న అందరూ సినిమాని థియేటర్ లో చూడండి” అన్నారు

కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఖచ్చితంగా మన వూరిని గుర్తు తెచ్చి ఆకట్టుకునే సినిమాలా అనిపిస్తుంది. సొంత ఊరు చాలా ప్రత్యేకం. నిజానికి నా పేరు కిషోర్. తిరుమల అనేది మా ఊరు పేరు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు

శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. శౌర్య, సుధాకర్ గారికి ఇది పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. దర్శకుడిగా పరిచయం అవుతున్న పవన్ కి అభినందనలు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలి” అన్నారు. ఈ వేడుకలో రాజ్ కుమార్ కేసిరెడ్డి, నోయల్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

9 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

9 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago