బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో రూపొందిన ‘#BoyapatiRAPO’ చిత్రం సెప్టెంబర్ 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. నిర్మాతలు ఇటీవల రామ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌తో ప్రమోషన్‌లను ప్రారంభించారు. టీజర్ మాస్ తుఫాను సృష్టించింది.
జులై 3నగ్లింప్స్ ద్వారా టైటిల్‌ను లాంచ్ చేయనున్నారు . యాక్షన్‌తో కూడిన రగ్గడ్ అవతార్‌లో రామ్‌ని ప్రెజెంట్ చేసే ఊరా మాస్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. పోస్టర్ సూచించినట్లుగా టైటిల్ గ్లింప్స్ తుఫాను క్రియేట్ చేయనుంది.
మోస్ట్ హ్యాపెనింగ్ నటి శ్రీలీల రామ్ సరసన కథానాయిక. రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ థం డర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.
సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నతమైన సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. జీ స్టూడియోస్ , పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఎడిటింగ్ తమ్మిరాజు.
తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
ప్రెజెంట్స్: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్
సంగీతం: ఎస్ఎస్ థమన్
డివోపీ: సంతోష్ డిటాకే
ఎడిటింగ్: తమ్మిరాజు
పీఆర్వో: వంశీ-శేఖర్, పులగం చిన్నారాయణ
-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్…
ఫోనిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై, మాస్టర్ జియాన్స్ సమర్పణలో సత్యం రాజేష్, రియా సచ్యదేవ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న “ఫ్రెండ్లీ ఘోస్ట్”…
ఐశ్వర్య సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సింధుసూర్య నిర్మిస్తున్న నూతన చిత్రం 'శివ గాడి జిందగీ'. సచిన్ రామ్ ప్రతాప్, హాసిని…
ది మేజ్" చిత్రంతో దర్శకుడిగా డాక్టర్ కాబోయి యాక్టర్ కావడం చూస్తుంటాం కానీ డా. రవికిరణ్ గడలాయ్ ఎం.డి, పాథాలజిస్ట్…
ఎంఎస్ రాజు గారు ‘అగధ’ సీక్వెల్ ఎప్పుడు అంటారో చూడాలి - హీరో శ్రవణ్ రెడ్డి శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్…
హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని…