అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. టైటిల్ పాత్రలో యువ గాయకుడు కృష్ణ చైతన్య, ఆయన భార్య సావిత్రి పాత్రలో మృదుల నటించారు. అన్యుక్తరామ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పతాకంపై శ్రీమతి ఫణి నిర్మాతగా, గాయకుడు జి.వి భాస్కర్ నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ‘ఘంటసాల పాటశాల’ సంకలన కర్త సి.హెచ్. రామారావు దర్శకత్వం వహించారు. షూటింగ్ తదితర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ను ఫిల్మ్ చాంబర్‌లో ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ ఆవిష్కరించారు.
ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ ‘‘ఘంటసాల అనగానే మనందరి ఒళ్లు పులకరిస్తుంది. మన నరనరాన ఆయన పేరు ఉండిపోయింది. అలాంటి గొప్ప వ్యక్తి కథతో, ఘంటసాలగారి మీద ఉన్న అభిమానంతో దర్శకుడు రామారావు ఈ ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నానికి నిర్మాతలు చక్కని సహకారం అందించారు. ఘంటసాల గారి మీద మనకున్న అభిమానాన్ని చూపించాలంటే ఈ సినిమాను సూపర్‌హిట్ చేయాలని ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ప్రేక్షకులు అందరినీ కోరుతున్నా. టైటిల్ పాత్ర పోషించిన గాయకుడు కృష్ణ చైతన్యకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నా’’ అని అన్నారు.
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఈ మధ్యకాలంలో చాలా బయోపిక్‌లు వస్తున్నాయి. అసలు తీయాల్సింది ఘంటసాల గారిది. లేట్ అయినా గానీ మంచి ప్రయత్నం చేశారు. చరిత్రను ఈ జనరేషన్ తెలియజేయడం చాలా అవసరం’’ అని అన్నారు.
నిర్మాతల మండలి కోశాధికారి తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ‘‘సినిమా తీయడం ఎంతో కష్టం. బయోపిక్ అంటే మరీ కష్టం. అప్పటి స్మృతులను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించాలి. రామారావుగారు ఆ విషయంలో వంద శాతం న్యాయం చేశారు. నేనూ ఈ చిత్రంలో ఓ మంచి పాత్ర పోషించా. ఇది మనందరి సినిమా. ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంచి అత్యధిక సంఖ్యలో థియేటర్లు ఇచ్చి సహకరించాలి. మేం కూడా ఆ దిఽశగా సాయం అందిస్తాం’’ అని చెప్పారు.
నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ‘‘ఘంటసాలగారి పాట భూమి, ఆకాశాలు ఉన్నంతకాలం చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. ఆయన భౌతికంగా లేకపోయిన ఆయన పాటలు ప్రపంచం మొత్తం మార్మోగుతూనే ఉంటాయి. భావితరాలకు ఆయన చరిత్ర తెలియ చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆయన చరిత్రను పుస్తకాల్లో సిలబస్‌గా ఉంచడం ప్రభుత్వాల బాధ్యత. ఘంటసాల గారికి రావల్సిన గుర్తింపు చాలా ఉంది’’ అని అన్నారు.
ఘంటసాల పాత్రధారి కృష్ణచైతన్య మాట్లాడుతూ ‘‘ఘంటసాల పాత్ర పోషించడం ఓ గాయకుడిగా నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. ప్రపంచానికి ఆయన గాయకుడిగానే తెలుసు. ఆయన ఎదుగుదలలో ఎదురైన ఆటుపోట్లు, ఆయన గురించి తెలియని ఎన్నో విషయాలు ఎన్నో ఈ చిత్రంలో ఉన్నాయి’’ అని తెలిపారు.
చిత్ర నిర్మాణ సారథి జి.వి. భాస్కర్ మాట్లాడుతూ ‘‘2018లో ఈ సినిమా టీజర్‌ను ఎస్.పి.బాలుగారి చేత విడుదల చేయించి ఎంతో పేరు సంపాదించాం. తదుపరి పలు కారణాల వల్ల ఘంటసాల కుటుంబంతో లీగల్‌గా చిన్నచిన్న సమస్యలొచ్చాయి. అవన్నీ ఇప్పుడు తొలగిపోయి ఆయన కుటుంబం నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది. ఈ సినిమా విషయంలో లక్ష్మీ ప్రసాద్, మాధవపెద్ది సురేష్‌గారు అందించిన సహకారం మరువలేనిది. త్వరలో ప్రమోషన్ స్టార్ట్ చేసి సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు.
చిత్ర సమర్పకులు లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ప్రపంచవ్యాప్తంగా ఘంటసాలగారికి అభిమానులున్నారు. ఈ సినిమా పెద్ద స్థాయిలో జనాలకు చేరువవుతుంది. ఈ సినిమా సక్సెస్ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. లీగల్ సమస్యల వల్ల సినిమా డిలే అయింది. ఇప్పుడు అలాంటి సమస్యలేమీ లేవు’’ అని అన్నారు.
చిత్ర దర్శకుడు సిహెచ్ రామారావు మాట్లాడుతూ ”దర్శకుడిగా నా మొదటి చిత్రమిది. నేను అభిమానించే ఘంటసాల గారి జీవిత కథతో సినిమా తీసే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన పేరు చెబితే గుర్తొచ్చేది పాట. మహాగాయకులు అంటే అన్నమయ్య, రామదాసు, ఒక ఘంటసాల అని భావిస్తుంటారు. అన్నమయ్య, రామదాసులపై రాఘవేంద్రరావుగారు సినిమాలు తీశారు. మూడో వ్యకి ఘంటసాలగారిపై సినిమా తీసే అవకాశం నాకు దక్కింది. ఘంటసాల పాట అంటే అందరికీ ఇష్టమే కానీ ఆ పాట కోసం ఆయన ఎంత కష్టపడ్డారో చాలామందికి తెలీదు. అలాంటి ఎన్నో విషయాలను ఈ చిత్రంలో చూపించనున్నాం. గాయకుడి కన్నా ఆయన వ్యక్తిగతంగా ఎంతో మంచి మనిషి. ఆయన జీవితంతో ఎంత పోరాటం చేశారో.. ఈ సినిమా ప్రయాణంలో నేనూ అంతే కష్టపడ్డా. మా టీమ్ అందరి కృషితో సినిమా విడుదల వరకూ వచ్చాం. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. ఘంటసాలగా కృష్ణ చైతన్య కరెక్ట్‌గా సరిపోయాడని ఎస్‌పి బాలుగారు చెప్పారు. అదే మా తొలి సక్సెస్‌గా భావిస్తున్నాం’’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శకులు బాబ్జి, బాలాజీ కర్రి తదితరులు పాల్గొన్నారు. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
కృష్ణ చైతన్య, మృదుల, సుమన్, సుబ్బరాయ శర్మ, దీక్షిత్ మాస్టర్, జె.కె. భారవి, అశోక్ కుమార్, మాస్టర్ అతులిత్ (చిన్న ఘంటసాల), సాయి కిరణ్, అనంత్, గుండు సుదర్శన్, జి.వి.భాస్కర్, దీక్షితులు,
జయవాణి ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.
ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ : శ్యామ్ కుమార్. పి సంగీతం: సాలూరి వాసూరావు, కెమెరా: వేణు మురళీధర్. వి, ఎడిటింగ్: క్రాంతి (RK), ఆర్ట్: నాని, సహ నిర్మాత: జి.వి. భాస్కర్, సంగీతం : వాసూరావు సాలూరి, నిర్మాణం : అన్యుక్త్ రామ్ పిక్చర్స్, నిర్మాత: శ్రీమతి ఫణి, రచన – దర్శకత్వం: సిహెచ్. రామారావు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…