నేటి నుండి ఆహాలో స్ట్రీమ్ కానున్న “కాఫీ విత్ ఏ కిల్లర్”

ఆర్ పి పట్నాయక్ కథ రచనా దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ నిర్మాతగా ఆహా ఓటిటిలో నేటి నుండి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనున్న చిత్రం “కాఫీ విత్ ఏ కిల్లర్”. టెంపర్ వంశీ, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, రవిబాబు, అంబటి శ్రీను, శ్రీరాప, జెమిని సురేష్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం క్రైమ్ జోనర్ లా అనిపిస్తుంది. అనుష్ గోరక్ ఈ చిత్రానికి డిఓపి, ఎడిటర్, డిఐ గా వ్యవహరించగా తిరుమల డైలాగులు రాశారు. నేటి నుండి ఆహాలో స్క్రీన్ స్ట్రీమ్ కానున్న సందర్భంగా ఈ చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా స్పందించారు.

ఈ సందర్భంగా నటుడు అంబటి శ్రీను మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మంచి కాఫీ తాగే ఫీల్ కలిగిస్తుంది. ఈ చిత్రంలో నాకు మంచి పాత్రను ఇచ్చిన ఆర్ పి పట్నాయక్ గారికి నా కృతజ్ఞతలు. ఆయన అంటే నాకు ఎంతో అభిమానం. నేను ఆయన పాటలకు వీరాభిమానిని. ఆర్ పి పట్నాయక్ గారి అభిమానులు ఆయన నుండి ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ రావాలని కోరుకుంటున్నారు. అలాగే ఈ చిత్రం నిర్మాత సతీష్ గారికి, గౌతం పట్నాయక్ గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాలో నటించిన నటీనటులు ఎవరికీ కూడా ఈ చిత్ర కథ ఏంటి అనేది తెలీదు. కాబట్టి చిత్రాన్ని అందరూ తప్పకుండా ఆహ్వానం చూసి ఎంజాయ్ చేయండి” అన్నారు.

నటి శ్రీరాప మాట్లాడుతూ… “మీడియా వారికి పెద్దలకు అందరికీ నమస్కారం. కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమా గురించి మాట్లాడాలి అంటే ముందుగా నేను గౌతమ్ గారి గురించి మాట్లాడాలి. ఆయన ఈ చిత్రానికి ఎంత ముఖ్యమైన వ్యక్తి. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన వారికి నా కృతజ్ఞతలు. అలాగే ఆర్ పి పట్నాయక్ గారు అంటే తెలియని వారు లేరు. ఆయన సంగీత దర్శకుడుగా అలాగ దర్శకుడిగా ఎంతో మంచి పేరు ఉన్న వ్యక్తి. ఆయన దర్శకత్వంలో పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది” అన్నారు.

నటుడు జెమిని సురేష్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈ చిత్రంలో నటించిన నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ చిత్రంలో కాఫీ షాప్ మేనేజర్ పాత్ర పోషిస్తున్నాను. సినిమా అంతా నా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఈ సినిమాలో కిల్లర్ ఎవరు? ఎవరిని చంపుతాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆహాలో ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఎంతో మంది కమెడియన్స్ అంతా కలిసి చాలా కాలం తర్వాత నటించిన చిత్రం. చిత్రంలో ప్రతి సీన్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. చిత్రానికి సాంకేతిక బృందం ఎంతో ప్రత్యేకమైనది. ఈ చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులు అందరూ చాలా టాలెంటెడ్. ఈ రోజుల్లో ఒక సినిమా తీసి బయటికి వెళ్లాలంటే ఎంతో ఛాలెంజ్ అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో సతీష్ గారు ఈ చిత్రాన్ని నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ చిత్రంలో నా పాత్ర మీకు గుర్తుండిపోతుంది. అలాగే ఎన్నో మంచి సినిమాలు అందిస్తున్న ఆహాలో ఈ చిత్రం ఇంకా మంచి సినిమాగా నిలిచిపోతుంది. ఈ చిత్ర టీం అందరికీ నా ధన్యవాదాలు” అన్నారు.

నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ… “మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఒక మంచి సినిమా చేశాము. అందరికీ ఎంతో ఇష్టమైన సంగతి దర్శకుడు అలాగే ప్రతిసారి ప్రత్యేకమైన చిత్రాలతో ప్రేక్షకులకు ముందుకు వచ్చే దర్శకుడు ఆర్పి పట్నాయక్ గారు. ఆయన చేసిన చిత్రం ఈ “కాఫీ విత్ ఏ కలర్” నేటినుండి ఆహాలో స్క్రీన్ అవుతుంది. రెండు గంటలపాటు మిమ్మల్ని ఎక్కడికి కదలకుండా చేసే ఒక ప్రత్యేకమైన చిత్రంగా ఉండబోతుంది. తిరుమల నాగ్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. శ్రీనివాస్ రెడ్డి గారి పాత్ర ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ఈ చిత్రానికి సాంకేతిక బృందం చాలా కష్టపడి పనిచేశారు. ఈ చిత్రం ప్రేక్షకులు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే సినిమా అంటే పాటలు, యాక్షన్ వంటి సీన్లతో ఉండేలా కాకుండా ఒక కాన్సెప్ట్ ని కథగా అనుకుని సినిమాగా తీసే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. ఈ సినిమాను మా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ లో నిర్మించినందుకు ఆర్ పి పట్నాయక్ గారికి ధన్యవాదాలు. ఈ చిత్రం ఆహాలు స్ట్రీమ్ అవుతుంది. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు టెంపర్ వంశీ మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ఆర్ పి గారు నన్ను ముఖ్య పాత్రలో ఒక సినిమా చేస్తున్నాము అని చెప్పగానే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నన్ను పెట్టి సినిమా తీయడం ఏంటి అని. ఆయన ఆలోచన చెప్పిన తర్వాత నాకు ఎంతో ఎక్సైట్ గా అనిపించింది. ఈ చిత్రానికి పనిచేసిన వారందరితో పనిచేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. నిజానికి నేను ఆర్పి పట్నాయక్ గారికి అభిమానిని. నాకు సినిమాలో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్. గౌతమ్ గారికి, సెవెన్ హిల్స్ సతీష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. చత్ర బంధం అందరికీ కృతజ్ఞతలు. అందరూ తప్పకుండా ఆహలో ఈ చిత్రాన్ని చూడండి” అన్నారు.

నటుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… “ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఈ చిత్రంలో ప్రతి పాత్ర వంశీ గారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నటించిన ప్రతి ఒక్కరూ కీలక పాత్రే. చిత్రంలో నా పేరు పోతన. సినిమాలో డైలాగ్స్ గాని కాన్సెక్ట్లు గాని ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. కొన్ని కథలో మధ్య జరిగే కథలా ఈ చిత్రం ఉండబోతుంది. ఆర్ పి పట్నాయక్ గారి చిత్రంలో పనిచేయడం చాలా ఆనందకరం. ఈ చిత్రానికి సాంకేతిక బృందం ప్రత్యేకమైనది. నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ గారు మమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చాలా ప్రశాంతంగా సినిమా వచ్చేలా చేశారు. మీరు ముందు ముందు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలి. చిత్రంలో నటించిన నటీనటులతో పనిచేయడం సంతోషకరం. ఈ చిత్రం ఆహాలో స్టీమ్ అవుతుంది. నీ చిత్రాన్ని చూసి ప్రేక్షకులంతా ఎంతో ఎంజాయ్ చేస్తారు. ప్రతి సీన్ లోను ట్విస్టులు ఉంటాయి. డబ్బింగ్ కూడా ఎంతో బాగా వచ్చింది. ఆర్ బి గారితో పని చేయడమే కాదు ఆయన దగ్గర ఉండటం కూడా ఎంతో ఆనందకరం. నా స్నేహితుడు సత్యం రాజేష్ తరపున కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్రం ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. డైలాగ్ తిరుమల నాగ్ గారితో కలిసి నేను గతంలో పనిచేశాను. ఆయన రేటింగ్స్ ఎంత బాగుంటాయో నాకు తెలుసు. కొలత కొలిసినట్లుగా డైలాగ్స్ రాస్తారు” అన్నారు.

చిత్ర దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ… “ఇక్కడికి వచ్చిన అందరికీ నా థాంక్స్. ముందుగా ఈ సినిమా ఆహాలో విడుదల కావడానికి కారణమైన సాయి రాజేష్ గారికి థాంక్స్ చెప్పాలి. అందరి ఆలోచనలు ఎక్కడ ఆగిపోతాయో మన ఆలోచన అక్కడ మొదలవ్వాలి కానీ నేను ఆనందిస్తాను. హీరో హీరోయిన్ లేకుండా ఒక సినిమా తీయాలి అంటే ఎలా అని ఆలోచనతో ఈ కథ మొదలైంది. కథ హీరో అయితే ఎలా ఉండబోతుంది అని ఈ కథ రాశాము. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాను మొత్తం దగ్గరుండి చూసుకున్నది మా అన్నయ్య గౌతమ్ పట్నాయక్ గారు. ఈ చిత్రంలోని కీలక పాత్ర విషయానికి వస్తే నాకు వంశీ మాత్రమే కచ్చితంగా ఈ కథకు, పాత్రకు పర్ఫెక్ట్ అని అనిపించింది. వేరే ఎవరిని నేను ఆ పాత్రలో ఊహించుకోలేకపోయాను. జెమిని సురేష్ క్యారెక్టర్ ప్రత్యేకమైనది. నా ఆలోచనలు అర్థం చేసుకునే తిరుమల నాగ్ కలిసి ఈ చిత్రం కోసం పని చేశాను. డిఓపి అనూష్ ఎంతో సౌమ్యుడు. ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి. చిత్రంలో నటించిన నటీనటుల క్యారెక్టర్లు చూస్తే కొన్ని ఎంతో ప్రత్యేకంగా అలాగే కొత్తగా ఉంటాయి. శ్రీనివాస్ రెడ్డి గారికి ఆయన కాకుండా ఇంకా ఎవరు అంత బాగా చేయలేరు అన్నట్లు వచ్చింది. ఆయన టైమింగ్ ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఈ చిత్రం ఎంతో శ్రద్ధగా టీమ్ అంతా కలిసి టీం వర్క్ గా చేసాము. సినిమాలో హీరో హీరోయిన్ ఉండరు కానీ విలన్ ఉంటాడు. ఈ సినిమాను ఎంతోమంది థియేటర్లో విడుదల చేయమని నన్ను అడిగారు కానీ నేను ఈ సినిమా ఖచ్చితంగా ఓటిటి లోనే విడుదల కావాలి అని పట్టు పట్టి ఆహాలో విడుదల చేస్తున్నాము. నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన త్వరలోనే పెద్ద నిర్మాతల స్థాయికి చేరతారు. మా డైరెక్షన్ టీం 24 గంటలు అందుబాటులో ఉంటూ ఎంతో కష్టపడి పని చేశారు. చివరిగా యాంకర్ గీతా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆమె మా రైటింగ్ టీమ్ లో కూడా ఉంటారు” అంటూ ముగించారు.

రవి బాబు , శ్రీనివాస్ రెడ్డి , శ్రీ రాపాక , జెమిని సురేష్, సత్యం రాజేష్, టెంపర్ వంశీ

స్టోరీ – స్క్రీన్ ప్లే – డైరెక్టర్:
ఆర్ పి పట్నాయక్
ప్రొడ్యూసర్ : సెవెన్ హిల్స్ సతీష్
ప్రెజెంట్స్: షేక్ ఖాజా , మొహియుద్దీన్ భాష
కో – ప్రొడ్యూసర్ : ఐ వెన్నదరి
డైలాగ్స్ : తిరుమలనాగ్
క్రియేటివ్ హెడ్ : గౌతం పట్నాయక్
ఎడిటర్ : అనీష్ గోరఖ్
పిఆర్ఓ : మధు విఆర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

Tfja Team

Recent Posts

ఘనంగా ప్రారంభమైన ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ చిత్రం

హైదరాబాద్:ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలను ఎండగట్టే ఉత్కంఠ రేపుతూ ఆసక్తికరంగా సాగే కథనంతో తెలుగు తెరపైకి ఓ సినిమా రాబోతుంది. రాజేష్…

9 hours ago

ఏఐ ఫీచర్ ఫిల్మ్‌గా రాబోతున్న ‘అంబ’s రివెంజ,

▪️తెలుగు సినీ పరిశ్రమలో తొలి పూర్తి స్థాయి AI మూవీ▪️విడుదలకు సిద్ధమవుతూ ప్రచార పర్వం ప్రారంభంహైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమలో…

9 hours ago

మురళీ శర్మ ఓటీటీ ఎంట్రీ.. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ ‘సూపర్ సుబ్బు’తో ప్రేక్షకుల ముందుకు

జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న కామెడీ-డ్రామాలో కుక్కుటేశ్వరరావు పాత్రలో మురళీ శర్మ మూడు దశాబ్దాలకుపైగా హిందీ, తెలుగు,…

14 hours ago

ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యగ్రంథంగా చేర్చాలి, టీడీ జనార్ధన్ ఓ అరుదైన నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు – మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు.

ఆంధ్రుల ఆరాధ్య దైవంగా వెండితెరపై మూడున్నర దశాబ్దాల పాటు వెలిగి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన నందమూరి తారక…

16 hours ago

బిలియన్ వ్యూస్ సాధించి చరిత్ర సృష్టించిన బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా జయ జానకి నాయక.

భద్ర సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక చిత్రం సంచలనం…

2 days ago

శివాజీ బర్త్ డే స్పెషల్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతోన్న విలక్షణ నటుడు

తెలుగు సినిమా లోకానికి, తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు శివాజీ. నటుడిగా, హీరోగా ఎన్నో విలక్షణమైన…

2 days ago