సైకలాజికల్ థ్రిల్లర్ “కలి” మూవీ నుంచి మెలొడీ సాంగ్ ‘హల్లో హల్లో. రిలీజ్

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా “కలి”. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు రచించి దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “కలి” మూవీ నుంచి రొమాంటిక్ మెలొడీ సాంగ్ ‘హల్లో హల్లో..’ ను రిలీజ్ చేశారు మేకర్స్.

‘హల్లో హల్లో..’ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి బ్యూటిఫుల్ లిరిక్స్ అందించగా, జీవన్ బాబు (జె.బి.) ప్లెజెంట్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. హైమత్ హైమత్ అహ్మద్, అదితీ భావరాజు మంచి ఫీల్ తో పాడారు. ‘హల్లో హల్లో హల్లో పూలదారుల్లో పాదం వేద్దాం ఓ పిల్లో, ఛల్లో ఛల్లో ఛల్లో రంగు రంగుల్లో జీవించేద్దాం ఛల్ ఛల్లో, కలవని దూరం దూరం నిన్న వరకు, అడుగులో అడుగేసేద్దాం చివరి వరకు…’అంటూ రొమాంటిక్ గా సాగుతుందీ పాట. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కథకు ‘హల్లో హల్లో..’ పాట కలర్ ఫుల్ పిక్చరైజేషన్ తో కొత్త ఫ్లేవర్ తీసుకొస్తోంది.

నటీనటులు – ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి. తదితరులు.

టెక్నికల్ టీమ్:

సంగీతం – జీవన్ బాబు
ఎడిటర్ – విజయ్ కట్స్.
సినిమాటోగ్రఫీ – నిషాంత్ కటారి, రమణ జాగర్లమూడి.
పాటలు – సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి,
క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ – రాధాకృష్ణ తాతినేని, ధరణి కుమార్ టీఆర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఫణీంద్ర
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
సమర్పణ – కె. రాఘవేంద్ర రెడ్డి
నిర్మాత – లీలా గౌతమ్ వర్మ
రచన, దర్శకత్వం – శివ శేషు

Tfja Team

Recent Posts

హీరో సుడిగాలి సుధీర్ “సుధీర్స్ జోకర్” సినిమా నుంచి వెర్సటైల్ యాక్టర్ మురళీశర్మ బర్త్ డే పోస్టర్ రిలీజ్

-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్…

3 days ago

ఫ్రెండ్లీ ఘోస్ట్ టీజర్ విడుదల !!!

ఫోనిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై, మాస్టర్ జియాన్స్ సమర్పణలో సత్యం రాజేష్, రియా సచ్యదేవ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న “ఫ్రెండ్లీ ఘోస్ట్”…

4 days ago

ఘనంగా ‘శివ గాడి జింద‌గీ’ మూవీ టైటిల్, సాంగ్ లాంచ్!

ఐశ్వర్య సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సింధుసూర్య నిర్మిస్తున్న నూతన చిత్రం 'శివ గాడి జింద‌గీ'. సచిన్ రామ్ ప్రతాప్, హాసిని…

4 days ago

హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) “ది మేజ్” చిత్రంతో దర్శకుడిగా ప్రతిభ చాటనున్న డా. రవికిరణ్ గడలాయ్

ది మేజ్" చిత్రంతో దర్శకుడిగా డాక్టర్ కాబోయి యాక్టర్ కావడం చూస్తుంటాం కానీ డా. రవికిరణ్ గడలాయ్ ఎం.డి, పాథాలజిస్ట్…

4 days ago

‘అగధ’ డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌గా చాలా అద్భుతంగా ఉంటుంది – హీరో శ్రవణ్ రెడ్డి

ఎంఎస్ రాజు గారు ‘అగధ’ సీక్వెల్ ఎప్పుడు అంటారో చూడాలి - హీరో శ్రవణ్ రెడ్డి శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్…

4 days ago

పాతబస్తీ మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో బంగారు బోనం ఎత్తిన సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల

హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని…

4 days ago