రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “చిట్టి పొట్టి”. ఈ చిత్రాన్ని భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కిన “చిట్టి పొట్టి” సినిమా ఈనెల 3వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. “చిట్టి పొట్టి” సినిమా చూసిన సెన్సార్ బృందం సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమాలోని అన్నా చెల్లి అనుబంధాలు, కుటుంబ భావోద్వేగాలు తమను కదిలించాయంటూ ఉద్వేగానికి గురయ్యారు సెన్సార్ సభ్యులు. “చిట్టి పొట్టి” సినిమా టీమ్ పై ప్రశంసలు కురిపించారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి మంచి సకుటుంబ చిత్రం రాలేదని సెన్సారు వారు చెప్పడం విశేషం.
చిరకాలం తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా అన్నా, చెల్లి అనుబంధం నేపథ్యంలో మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా దర్శక నిర్మాత భాస్కర్ యాదవ్ “చిట్టి పొట్టి” సినిమాను రూపొందించారు. కుటుంబ విలువలు, మన కుటుంబ వ్యవస్థ గొప్పదనం చెప్పేలా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల రివార్డ్స్ తో పాటు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డ్ లు గెల్చుకుంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. సినిమా విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నారు “చిట్టి పొట్టి” సినిమా టీమ్.
నటీనటులు – రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి, కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ, తదితరులు
టెక్నికల్ టీమ్
బ్యానర్ – భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా
ఎడిటర్ – బాలకృష్ణ బోయ
మ్యూజిక్ – శ్రీ వెంకట్
సినిమాటోగ్రఫీ – మల్హర్ భట్ జోషి
పీఆర్ఓ – లక్ష్మీ నివాస్
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం – భాస్కర్ యాదవ్ దాసరి
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…