అభిమానుల‌కు రాకింగ్ స్టార్ య‌ష్ హృద‌య‌పూర్వ‌క‌మైన లేఖ‌

Must Read

రాకింగ్ స్టార్ య‌ష్‌.. కె.జి.య‌ఫ్ ఫ్రాంచైజీ చిత్రాల‌తో గ్లోబ‌ల్ రేంజ్ స్టార్ డ‌మ్‌ను సొంతం చేసుకున్న క‌థానాయ‌కుడు. అభిమానుల‌కు త‌న హృద‌యంలో ప్ర‌త్యేక‌మైన స్థానం ఇచ్చిన ఈయ‌న వారికి ఓ ప్ర‌త్యేక‌మైన లేఖ‌ను రాశారు. ఈ ఏడాది ముగుస్తున్నందున అంద‌రూ వేడుక‌ల‌ను నిర్వ‌హించుకునే వారు, అలాగే త‌న పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసుకునే అభిమానులు అంద‌రూ ఆరోగ్యం, భ‌ద్ర‌త‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని య‌ష్ లెట‌ర్‌లో పేర్కొన్నారు. ఇలాంటి వేడుక‌ల్లో పాల్గొన‌టం కంటే అభిమానులు వారి గొప్ప ల‌క్ష్యాల‌ను చేరుకుంటున్నార‌ని తెలిసి ఎంతో ఆనంద‌పడుతున్నాన‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలియ‌జేశారు.

య‌ష్ త‌న అభిమానుల‌ను ఉద్దేశించి రాసిన హృద‌య‌పూర్వ‌క లేఖ‌లో ప్రేమ‌ను వ్య‌క్త ప‌రిచే విధానాన్ని మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. గ‌తంలో త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జ‌రిగిన దుర‌దృష్ట‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌ల‌ను ఆయ‌న గుర్తు చేసుకున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో య‌ష్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా.. క‌ర్ణాట‌క‌లో గ‌ద‌గ్ జిల్లాలో ముగ్గురు అభిమానులు భారీ క‌టౌట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఆ స‌మ‌యంలో య‌ష్ ప్ర‌మాదంలో చ‌నిపోయిన అభిమానుల కుటుంబాల‌ను ప్ర‌త్యేకంగా వెళ్లి క‌లిసి నివాళులు అర్పించ‌ట‌మే కాకుండా, ఆ కుటుంబాల‌కు మ‌ద్ద‌తుగా ఉంటామ‌ని తెలియ‌జేశారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత త‌న‌కు బ్యాన‌ర్స్‌ను క‌ట్ట‌టం, ప్ర‌మాద‌క‌ర‌మైన బైక్ చేజింగ్‌ల్లో పాల్గొన‌టం, నిర్ల‌క్ష్య‌పు సెల్ఫీలు తీసుకోవ‌టం మానుకోవాల‌ని య‌ష్ అభిమానుల‌కు రిక్వెస్ట్ చేశారు. ఇలాంటి చ‌ర్య‌లు చేయ‌ట‌మ‌నేవి.. నిజ‌మైన అభిమానాన్ని చూపిన‌ట్లు కాద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

‘మీరు నా నిజ‌మైన అభిమాని అయితే మీ ప‌నిని మీరు శ్ర‌ద్ధ‌గా చేయండి, మీ జీవితం మీదే, సంతోషంగా ఉండండి, విజ‌య‌వంతంగా ముందుకెళ్లండి’ అని మీడియాలో తన అభిమానుల‌కు య‌ష్ రిక్వెస్ట్ చేశారు. 2019లో ఓ అభిమాని య‌ష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న్ని క‌ల‌వాల‌నుకుని, క‌ల‌వ‌లేక‌పోయారు. దీంతో స‌ద‌రు అభిమాని ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోయారు. ఆ సంద‌ర్భంలోనూ ఇలాంటి చ‌ర్య‌లు స‌రైన‌వి కావ‌ని అభిమానుల‌కు య‌ష్ విజ్ఞ‌ప్తి చేశారు.

త్వ‌ర‌లోనే త‌న పుట్టిన‌రోజు రానున్న సంద‌ర్భంగా ఈసారి య‌ష్‌, త‌న అభిమానుల భ‌ద్ర‌త కోసం ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. వారు సుర‌క్షితంగా ఉండ‌ట‌మే త‌న‌కు ల‌భించిన గొప్ప బ‌హుమ‌తి అని ఆయ‌న ఈ సంద‌ర్భంగా తెలియజేశారు.

య‌ష్ ప్ర‌స్తుతం ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్‌’ సినిమా చేస్తున్నారు. ఈ భారీ ప్ర‌తిష్టాత్మ‌కమైన ఎంట‌ర్‌టైన‌ర్‌ను కె.వి.ఎన్‌.ప్రొడ‌క్ష‌న్స్‌, మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్ బ్యానర్స్‌పై గీతు మోహ‌న్‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌ట్ కె.నారాయ‌ణ‌, య‌ష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News