గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్

ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “ఆర్ కే దీక్ష”. డి.ఎస్. రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్లుగా నటించగా, కిరణ్ హీరోగా కనిపించనున్నారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దర్శకనిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ చిత్ర సాంగ్స్ , టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో నిర్మాత ఎ. గురురాజ్ మాట్లాడుతూ – “డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘ఆర్కే దీక్ష’ చిత్రాన్ని ఎంతో క్వాలిటీగా రూపొందించారని సాంగగ్స్, టీజర్ చూస్తేనే తెలుస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

పొలిటికల్ లీడర్ గ్యాదరి బాలమల్లు మాట్లాడుతూ – “సిద్ధిపేట ప్రాంతం నుంచి వచ్చిన డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు రాజకీయంగా, సినీ రంగంలో ఎంతోకాలంగా కొనసాగుతున్నారు. అనేక చిత్రాలు నిర్మించి, దర్శకత్వం వహించారు. నటుడిగానూ రాణించారు. ‘ఆర్కే దీక్ష’ చిత్రం కూడా ఆయనకు సక్సెస్ అందించాలి” అన్నారు.

కెనడా వాసి తరుణ్ సాహి మాట్లాడుతూ – “ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంది. సినిమా టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్” అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ మాట్లాడుతూ – “ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఇచ్చిన డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి థ్యాంక్స్. హీరో కిరణ్, హీరోయిన్ అక్స ఖాన్ తమ పాత్రల్లో జీవించారు. ఈ చిత్రంలో మంచి సంగీతం అందించాం” అన్నారు.

బీసీ సంఘం నేత అంజలి మాట్లాడుతూ – “డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ గతంలో మంచి మూవీస్ చేశారు. ‘దీక్ష’ చిత్రం కూడా అందరికీ ఇన్స్‌పైర్ చేసేలా ఉండబోతోంది. సాంగ్స్, టీజర్ ఆకట్టుకునేలా ఉన్నాయి” అన్నారు.

విశ్రాంత న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ – “సినిమాలు వినోదంతో పాటు ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉండాలి. సమాజానికి మంచి చేయాలి. అలాంటి మంచి ప్రయత్నాన్ని ‘ఆర్కే దీక్ష’ చిత్రంతో చేస్తున్నారు” అన్నారు.

హీరో కిరణ్ మాట్లాడుతూ – “డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు ఎంతోమంది కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నారు. దీక్ష, పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలం అని చెప్పే చిత్రమిది. రాజ్ కిరణ్ సంగీతం మా సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుంది” అన్నారు.

హీరోయిన్ అక్స ఖాన్ మాట్లాడుతూ – “ఈ రోజు విడుదల చేసిన సాంగ్, టీజర్ అందరికీ నచ్చాయని నమ్ముతున్నాం. మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా చేశాను” అన్నారు.

చిత్ర సమర్పకులు డీఎస్ రెడ్డి మాట్లాడుతూ – “ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి సందేశాన్ని అందిస్తుంది. మన వీర జవాన్ల సాహసాలపై రూపొందించిన స్పెషల్ సాంగ్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది” అన్నారు.

ఫైట్ మాస్టర్ రవి మాట్లాడుతూ – “ఈ చిత్రంలో ఫైట్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆర్కే గౌడ్ గారు ఎంతోమంది ఫైటర్స్‌కు ఉచితంగా మెంబర్‌షిప్‌లు ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారు” అన్నారు.

నటి తులసి మాట్లాడుతూ – “ఈ చిత్రంలో ఫ్రెండ్ పాత్రలో నటించాను. మన సైనికుల ధైర్యసాహసాలను చెప్పేలా రూపొందించిన పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అన్నారు.

దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – “ఈ రోజు మా మూవీ సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ప్రతి మనిషిలో దీక్ష, పట్టుదల ఉంటాయి. వాటితో పనిచేస్తే ఏదైనా సాధించగలం అని చెప్పే చిత్రమిది. వీర జవాన్ మురళీనాయక్ గొప్పతనాన్ని తెలియజేసేలా ఒక స్పెషల్ సాంగ్ రూపొందించాం. జూన్ 12న విడుదల కానున్న ‘ఆర్కే దీక్ష’ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలి” అన్నారు.

నటుడు సుమన్ మాట్లాడుతూ – “డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు సినిమాపై ప్యాషన్ ఉన్న వ్యక్తి. వీర జవాన్ సాహసాన్ని చెప్పే పాటను థ్రిల్లింగ్‌గా రూపొందించారు. ఈ చిత్రంలో మంచి కంటెంట్ ఉంది. కిరణ్, అక్సా ఇద్దరూ చాలా బాగా నటించారు” అన్నారు.

నటీనటులు:
కిరణ్, అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి, తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు.

టెక్నికల్ టీమ్:
దర్శక నిర్మాత : డా. ప్రతాని రామకృష్ణ గౌడ్
సమర్పకులు : డీఎస్ రెడ్డి
బ్యానర్స్ : ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్
సంగీతం : రాజ్ కిరణ్
ఎడిటర్ : మేఘన శ్రీను
ఫైట్స్ : రవి
డాన్స్ : ఆనంద్
పిఆర్ఓ : చందు రమేష్

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago