కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
‘బ్రహ్మచారి భర్తగా మారాలని నిర్ణయించుకున్న తరువాత జీవితం యుద్ధభూమిలా మారుతుంది’ అని వెన్నెల కిషోర్ డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత వచ్చే సీన్లు, భార్యల చేతిలో భర్తలు నలిగిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ‘ప్రేమ ఉన్న చోట నిజాయితీ ఉంటుంది.. నిజాయితీ లేని నీలాంటి వాడితో నేను ఉండలేను’ అని చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. ‘పెళ్లాం తిట్టినప్పుడు మన లోపల ఉన్న మగాడు పవర్ ఫుల్‌గా బయటకు వస్తాడు’ అనే డైలాగ్స్ ఎంటర్టైనింగ్‌గా ఉన్నాయి. ఫ్యామిలీ, యూత్, మాస్ ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలతో ట్రైలర్‌ను కట్ చేశారు.
ఈ ట్రైలర్‌లో సతీష్ ముత్యాల కెమెరా వర్క్, శ్రవణ్ ఆర్ఆర్ అన్నీ కూడా హైలెట్ అవుతున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం ఆద్యంతం వినోదభరితంగా ఉందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఇక ఈ మూవీని మే 22న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.
ఈ మూవీకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. సతీష్ ముత్యాల కెమెరామెన్‌గా, కోటి ఎడిటర్‌గా పని చేశారు.
నటీనటులు : పవన్ కళ్యాణ్ బత్తుల, సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్, అనంత్ శ్రీరామ్, వెన్నెల కిషోర్ తదితరులు
సాంకేతిక సిబ్బంది
బ్యానర్: కళ్యాణ్ ప్రొడక్షన్స్
సమర్పణ : సరస్వతి బత్తుల
నిర్మాత: బత్తుల కోటేశ్వరరావు
దర్శకుడు: వీరు వులవల
సంగీత దర్శకుడు: శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
ఎడిటర్: కోటి
ఆర్ట్ డైరెక్టర్: రవిబాబు దొండపాటి
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
పీఆర్వో: సాయి సతీష్
నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…
శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…
సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…
ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…
ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…