RGV ‘శారీ’ చిత్రం నుండి సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ ‘ఎగిరే గువ్వలాగ’ రిలీజ్

Must Read

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ ‘శారీ’ లాగ్ లైన్: ‘టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ’. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో,ఆర్జీవి-ఆర్వి ప్రొడక్షన్స్ LLP బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా పలు నిజజీవిత సంఘటనల ఆధారాలతో సైకలాజికల్ థ్రిల్లర్ గా ‘శారీ’ మూవీ రూపొందుతోంది. ఈ రోజు RGV డెన్ లో ‘శారీ’ చిత్రానికి సంబందించిన సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ ‘ఎగిరే గువ్వలాగా…’ విడుదల చేసారు.

ఈ రోజు ‘ఆర్జీవీ డెన్ మ్యూజిక్’ ద్వార సెకండ్ లిరికల్ సాంగ్ ‘ఎగిరే గువ్వలాగా…’ రిలీజ్ చేసామని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఈ పాట రాకేష్ పనికెళ్ళ ట్యూన్ చేసి లిరిక్ కూడా అతనే ఇచ్చాడని, పాటలో సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, ఈ పాటను సింగర్ సాయి చరణ్ పాడారని ఆయన తెలిపారు.

నిర్మాత రవి శంకర్ వర్మ మాట్లాడుతూ “మా ‘శారీ’ చిత్రంలోని తొలి లిరికల్ సాంగ్ ఇటివల విడుదల చేసిన ‘ఐ వాంట్ లవ్’ కి విశేష స్పందన లభించింది. ఈ రోజు సెకండ్ లిరికల్ సాంగ్ ‘ఎగిరే గువ్వలాగా…’ రిలీజ్ చేసాము. ఇంకా హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో కూడా ఈ రోజే ఈ సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల చేసాము. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయ్, కొన్ని అనివార్య కారణాల వలన విడుదల ఆలస్యం అయింది త్వరలోనే విడుదల తేది ప్రకటిస్తాము” అన్నారు.

బ్యానర్ : ఆర్జీవీ – ఆర్వీ ప్రొడక్షన్స్ LLP
నటీనటులు : సత్యా యాదు, ఆరాధ్య దేవి, సాహిల్ సంభవాల్, అప్పాజీ అంబరీష్, మరియు కల్పలత తదితరులు
సినిమాటోగ్రఫీ : శబరి,
మ్యూజిక్ :రాకేశ్ పనికెళ్ళ,
పాట రచన, బాణీ :రాకేశ్ పనికెళ్ళ,
నిర్మాత : రవి శంకర్ వర్మ,
దర్శకత్వం : గిరి కృష్ణ కమల్

Latest News

Dhanush Directorial ‘Jabilamma Neeku Antha Kopama’ Set to Release on Feb 21

After the success of blockbusters like Pa Pandi and Raayan, Dhanush is all set to impress again as a...

More News