“రేవు” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.

ఆగస్టు రెండో వారంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ సూపర్ విజన్ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేవు సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది.


తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ – “రేవు” సినిమా ఫస్ట్ లుక్ లాంఛ్ చేయడం హ్యాపీగా ఉంది. సినిమా ప్రమోషన్ లో జర్నలిస్ట్ లు ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుసు. ప్రభు గారు నాకు చాలా కాలంగా పరిచయం. నేను శ్రీహరి గారి దగ్గర ఉన్నప్పటి నుంచి ప్రభు గారు తెలుసు. డైరెక్టర్ గా నన్ను ముందు నుంచీ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు ప్రభు గారు, అలాగే పర్వతనేని రాంబాబు గారు కూడా మంచి మిత్రులు. వీరిద్దరు కలిసి మరో మిత్రుడు మురళీ గింజుపల్లి గారితో కలిసి “రేవు” సినిమా చేస్తున్నారు. నేను ఈ సినిమా విజువల్స్ చూశాను. చాలా బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ ప్రతిభ చూపించారు. ఈ సినిమాకు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అంతా కొత్త వారు చేశారు. యంగ్ టీమ్ అంతా కలిసి ఈ సినిమాకు పనిచేయడం నన్ను ఆకట్టుకుంది. ఇంతమంది కొత్త వాళ్లకు “రేవు” సినిమాలో అవకాశం ఇవ్వడం నాకు ఆనందంగా ఉంది. ఓటీటీలో మనం ఏదైనా మంచి కంటెంట్ మూవీ వస్తే చూస్తాం కదా అలా “రేవు” ఆకట్టుకుంటుంది. టీమ్ లోని ప్రతి ఒక్కరికి “రేవు” సినిమా మంచి పేరు తీసుకురావాలి. అలాగే నిర్మాతకు డబ్బులు తీసుకుని రావాలని కోరుకుంటున్నా. అన్నారు.


నిర్మాణ పర్యవేక్షణ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. “రేవు” సినిమాను యంగ్ టీమ్ అంతా కలిసి ప్యాషనేట్ గా రూపొందించారు. ఈ మూవీ కంటెంట్ చూశాకా చాలా ఇంప్రెస్ అయ్యాను. నా మిత్రుడు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా డా. మురళీ గింజుపల్లి గారి నిర్మాణంలో “రేవు” సినిమాను మీ ముందుకు తీసుకు వస్తుండటం సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్ సూపర్ విజన్ చేశాను. సినీ జర్నలిస్ట్ గా మాకున్న అనుభవంతో ఒక మంచి ప్రాడక్ట్ మీ ముందుకు వచ్చేలా ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా తుది దశకు వచ్చాయి. ఆగస్టు రెండో వారంలో “రేవు” సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. మా “రేవు” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడానికి అంగీకరించిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ గారికి థాంక్స్ చెబుతున్నా. ఆయన ఎన్ బీకే 109 సినిమా భారీ షెడ్యూల్ కోసం ఎంతో బిజీగా ఉన్నా మేము అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ – మా “రేవు” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ గారికి థాంక్స్. “రేవు” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎంటర్ టైన్ మెంట్ ఎమోషనల్ కలిసి మంచి కథతో మీ ముందుకు రాబోతోంది. ఆగస్టు రెండో వారంలో “రేవు” సినిమాను ఘనంగా మీ అందరి ముందుకు థియేట్రికల్ రిలీజ్ ద్వారా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మా ప్రొడ్యూసర్ డా.మురళీ గింజుపల్లి గారికి, నవీన్ పారుపల్లి గారికి, ప్రభు గారికి థాంక్స్ అన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు హరినాథ్ పులి మాట్లాడుతూ.. రేవు చిత్రాన్ని ఇంతవరకు తీసుకువచ్చిన నిర్మాణ పర్యవేక్షణ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత పర్వతనేని రాంబాబు, నిర్మాతలకు మా చిత్ర బృందానికి నాకు అన్ని విధాలా సహకరించినందుకు కృతజ్ఞతలు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్టిస్టులు ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు.
ఆర్టిస్టులు: వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి, గురు తేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి, తదితరులు.
సాంకేతిక నిపుణులు: డి ఓ పి – రేవంత్ సాగర్ నేపథ్య సంగీతం- వైశాఖ్ మురళీధరన్ పాట- జాన్ కె జోసెఫ్ ఎడిటర్ – శివ శర్వాని కళ- బాషా సాహిత్యం – ఇమ్రాన్ శాస్త్రి, నిర్మాణ పర్యవేక్షణ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత పర్వతనేని రాంబాబు, నిర్మాతలు డా॥ మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి రచయిత దర్శకుడు – హరినాథ్ పులి.

Tfja Team

Recent Posts

ఈ సంక్రాంతి ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోతుంది: ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సవ వేడుకలో స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం 'అనగనగా ఒక…

2 hours ago

వైభవంగా జరిగిన హీరో సతీష్ జై కుమార్తె ‘నైరా ‘ పుట్టినరోజు వేడుక

అంతకుమించి చిత్రం పేం సతీష్ జై, డాక్టర్ మైత్రి షరణ్ ల కుమార్తె "నైరా" మొదటి పుట్టినరోజు వేడుకలు ఇటీవల…

20 hours ago

హీరోలు సందీప్ కిషన్, విశ్వక్ సేన్ చేతుల మీదుగా హీరో తిరువీర్ “భగవంతుడు” మూవీ టీజర్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ…

21 hours ago

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు…

23 hours ago

శ్రీరామ్‌ ‘ది మేజ్‌’ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌ విడుదల

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్‌. ఈయన…

2 days ago

సబ్ స్క్రైబర్స్ కు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కంటెంట్ అందిస్తూ ఎంటర్ టైన్ చేస్తున్న ఆహా ఓటీటీ

తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…

2 days ago