పాజిటివ్‌ టాక్‌తో  సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోన్న ‘రివెంజ్‌’

Must Read

  ఆది అక్షర ఎంటర్టైన్‌ మెంట్స్‌ పతాకంపై బాబు పెదపూడి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘రివెంజ్‌’. నేహదేశ్‌ పాండే హీరోయిన్‌. రెట్టడి శ్రీనివాస్‌ దర్శకుడు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలై విజయవంతంగా రన్‌ అవుతోంది. ఈ సందర్భముగా ఈ రోజు ఫిలింఛాంబర్‌లో సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన

తెలుగు ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ బసిరెడ్డి మాట్లాడుతూ…‘‘ ఇటీవల కాలంలో మన తెలుగు సినిమాలు ఇంటర్నేషనల్‌ స్థాయిలో ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఇంకా పెద్ద ఎత్తును ప్రమోషన్‌ చేసి భారతీయులు ఉన్న ప్రతీచోట పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా రిలీజ్‌ చేయాలి. దానికోసం ఆన్‌లైన్‌ , డిజిటల్‌ ప్రమోషన్స్‌ పై దృష్టి పెట్టాలి. ఇక రివెంజ్‌ సినిమా విషయానికొస్తే..బాబు పెదపూడి సినిమా పై పాషన్‌తో అమెరికా నుండి ఇండియా కొచ్చి ఒక మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశారు. సినిమా విడుదలై పాజిటివ్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. ఇంకా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటూ ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా’ అన్నారు.


 తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ….‘‘సినిమా మీద పాషన్‌తో బాబు పెదపూడి ఈ సినిమా చేశారు. నటిస్తూ స్వయంగా నిర్మించారు. కమల్‌ హాసన్‌గారి ‘ఎర్రగులాబీలు’ తరహా కాన్సెప్ట్‌తో అన్ని వర్గాలకు నచ్చేలా ‘రివెంజ్‌’ సినిమా చేశారు. ఇప్పటికే విడుదలైన సినిమాకు మంచి పేరు వస్తోంది. ఇంకా పెద్ద విజయాన్ని అందించాలని ప్రేక్షకులను కోరుకుంటూ దర్శక నిర్మాతలకు నా శుభాకాంక్షలు’’ అన్నారు.
 రివెంజ్‌ చిత్ర నిర్మాత, నటుడు బాబు పెదపూడి మాట్లాడుతూ..‘‘అమెరికా వెళ్లి దాదాపు 35 ఏళ్లు అవుతోంది. సినిమాలంటే మొదటి నుంచి ఉన్న ఆసక్తితో మహేష్‌ గారు నటించిన ‘అతడు’ సినిమాతో పాటు మరికొన్ని  చిత్రాల్లో నటించాను. ఆ తర్వాత దర్శకుడు శ్రీనివాస్‌ గారు రివెంజ్‌ స్టోరి చెప్పడంతో నచ్చి నటిస్తూ ఈ సినిమా నిర్మించా. ఈ శుక్రవారం విడుదలైంది. అన్ని చోట్ల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. చూసిన వారంతా ఫోన్‌ చేసి అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఇంత రెస్పాన్స్‌ వస్తుందని ఊహించలేదు. మా డైరక్టర్‌ చాలా కష్టపడ్డారు. మా చిత్రాన్ని ఇంకా పెద్ద సక్సెస్‌ చేస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.


చిత్ర దర్శకుడు రెట్టడి శ్రీనివాస్‌ మాట్లాడుతూ…‘‘ప్రొడ్యూసర్‌ బాబు పెదపూడి గారితో ఐదేళ్ల ప్రయాణం. నన్ను, నా కాన్సెప్ట్‌ నమ్మి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు దాన్ని నిలబెట్టుకున్నాను అనుకుంటున్నా. ఏ విషయంలో రాజీ పడకుండా సినిమా చేయడానికి స్వేఛ్చనిచ్చారు.  ఈ శుక్రవారం విడుదలైన మా చిత్రానికి అన్ని చోట్ల నుండి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. చూసిన వారంతా సినిమా చాలా బావుందంటున్నారు. త్వరలో థియేటర్స్‌ కూడా పెంచుతున్నాం. అలాగే యుఎస్‌లో కూడా సినిమాను విడుదల చేయడానికి మా నిర్మాత ప్లాన్‌ చేస్తున్నారు. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులు ధన్యవాదాలు’’ అన్నారు.


 దర్శకుడు, నిర్మాత లయన్‌ సాయి వెంకట్‌ మాట్లాడుతూ…‘‘దర్శకుడు నాకు చాలా కాలంగా తెలుసు.  ప్రతిభావంతుడు. నిర్మాత బాబు పెదపూడి గారు ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు. పాజిటివ్‌ టాక్‌తో సినిమా రన్‌ అవుతోంది’’ అన్నారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ రివెంజ్ చిత్రం సక్సెస్ మీట్ పెట్టారంటే సక్సెస్ ఫుల్ గా థియేటర్ లో రన్ అవుతుందని అర్ధమైంది. నిర్మాత కు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో వడ్లపట్ల మోహన్‌, నాగులపల్లి పద్మిని పాల్గొని చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు’’ తెలిపారు.
బాబు పెదపూడి, నేహదేశ్ పాండే,   ఆరోహి, భార్గ‌వ్, నాగేష్ క‌ర్ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి డిఓపిః చిడ‌త‌ల న‌వీన్‌; సంగీతంః విజ‌య్ కురాకుల‌;  పీఆర్వోః ర‌మేష్ చందు;  ఎడిట‌ర్ః మేన‌గ శ్రీను; నిర్మాత: బాబురావు పెదపూడి(USA)  ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః రెట్టడి శ్రీనివాస్.

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News