దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన AGS ఎంటర్‌టైన్‌మెంట్ వరుసగా హిట్ చిత్రాలను నిర్మిస్తోంది. AGS ఎంటర్‌టైన్‌మెంట్, ప్రదీప్ రంగనాథన్ కాంబోలో బ్లాక్ బస్టర్ ‘లవ్ టుడే’ చిత్రం వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మించారు. ఒరి దేవుడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ విడుదల చేస్తున్నారు. కోస్తాంధ్రలో పూర్వీ పిక్చర్స్ రిలీజ్ చేస్తున్నారు.
ఈ ట్రైలర్‌లో అన్ని రకాల అంశాలను జోడించారు. యూత్‌కి కావాల్సినంత వినోదం, ప్రేమ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్నింటినీ జోడించారు. ఇంజనీరింగ్‌లో 48 బ్యాక్‌లాగ్‌లు పెట్టుకున్న హీరో.. కాలేజీలో పనీ పాటా లేనీ గాలికి తిరిగే ఓ కుర్రాడిగా కనిపించాడు. ప్రేమ, బ్రేకప్, లైఫ్‌లో సెటిల్ అవ్వడం కోసం కష్టపడే తీరు ఇలా అన్నీ చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్‌ను కూడా ట్రైలర్‌లో చూపించారు. బాధత్యారాహిత్యంగా ఉండే కుర్రాడి జీవితంలో వచ్చే సమస్యలు, సవాళ్లను చూపిస్తూ.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఓ ఎంటర్టైనర్ మూవీ అవుతుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.
ఈ చిత్రంలో కె. యస్. రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ వంటి స్టార్ డైరెక్టర్లు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో, టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ ట్రైలర్‌తో సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. ఈ మూవీకి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా అర్చన కల్పాతి, అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఐశ్వర్య కల్పాతి పనిచేస్తున్నారు.
లియోన్ జేమ్స్ సంగీతం అందించగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటర్‌గా, ఎస్.ఎమ్. వెంకట్ మాణిక్యం ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో వి.జె. సిద్ధు, హర్షత్ ఖాన్, మరియం జార్జ్, ఇందుమతి మణికందన్, తేనప్పన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది.
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…
గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’ కాంబో మళ్లీ మన ముందుకు రావటానికి సమాయత్తమవుతోంది. సైయారా అద్భుత విజయంతో…
ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…
అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…