ఘనంగా రెంట్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక

Must Read

ఘనంగా రెంట్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక

రెంట్ చిత్రం ఆగస్టు 25న విడుదల

జె ఎం ఎం జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై శివారెడ్డి, జాష్ణిని మరియు వనిత రెడ్డి హీరో హీరోయిన్ గా రఘు వర్ధన్ రెడ్డి దర్శకుడిగా బలగం జగదీష్ నిర్మించిన చిత్రం రెంట్ (Rent). ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం ఆగస్టు 25న విడుదల అవుతుంది. అయితే ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ వేడుక ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ “రఘు వర్ధన్ రెడ్డి మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. తాను కో డైరెక్టర్ గా పని చేస్తున్నప్పుడు నుంచి నాకు పరిచయం. రెంట్ సినిమా ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. యూత్ కి కావాల్సిన అంశాలు అన్ని ఈ చిత్రం లో ఉన్నాయి. శివ రెడ్డి మంచి టాలెంట్ ఉన్న నటుడు. సినిమా అద్భుతంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఆగస్టు 25న విడుదల అవుతుంది. మంచి విజయం సాధించాలి” అని కోరుకున్నారు.

హీరో శివ రెడ్డి మాట్లాడుతూ “ఈ చిత్ర దర్శకుడు నన్ను హీరో గ అడిగినప్పుడు నేను హీరో గ చేయటం లేదు అని చెప్పాను, కానీ దర్శకుడి సంస్కారం మరియు కథ నన్ను కట్టిపడేశాయి. వెంటనే సినిమా చేస్తా అని ఒప్పుకున్నా. మంచి థ్రిల్లింగ్ కథ, మంచి కామెడీ ఉంటుంది, యూత్ కి బాగా నచ్చుతుంది, మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. మంచి మెసేజ్ ఉంది. సినిమా అందరికీ నచ్చుతుంది. ఆగస్టు 25న విడుదల అవుతుంది” అని తెలిపారు.

నటుడు అమిత్ మాట్లాడుతూ “రెంట్ చిత్రం లో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది, ఆగస్టు 25న విడుదల అవుతుంది” అని తెలిపారు.

హీరోయిన్ జాష్ణిని మాట్లాడుతూ “నేను ఈ సినిమా లో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు లో విడుదల అవుతుంది నా మొదటి తెలుగు సినిమా. ఆగస్టు 25న విడుదల అవుతుంది” అని తెలిపారు.

హీరోయిన్ వనిత రెడ్డి మాట్లాడుతూ “నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఆగస్టు 25న విడుదల అవుతుంది. అందరు థియేటర్ కి మా సినిమా చూసి మంచి విజయం చేస్తారు” అని కోరుకున్నారు.

బ్యానర్ : జె ఏం ఏం జాగృతి మూవీ మేకర్స్

చిత్రం పేరు : రెంట్ (NOT FOR SALE)

నటీనటులు : శివారెడ్డి, జాష్ణిని, వనిత రెడ్డి, తదితరులు

కెమెరా మాన్ : వల్లి

సంగీతం : డి ఎస్ ఆర్ బాలాజీ

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News