బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీలీల, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ‘స్కంద’ నుంచి మాస్ ధమకేధార్ ఫోక్లోర్ ‘గందారబాయి’ సాంగ్ విడుదల
సరైనోడు, అఖండ బ్లాక్ బస్టర్స్ తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, సెన్సేషనల్ కంపోజర్ ఎస్ఎస్ థమన్ వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్‌లను పూర్తి చేయడానికి మూడవ చిత్రానికి కొలబరేట్ అయ్యారు. ఉస్తాద్ రామ్ పోతినేని పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్కంద’- ది ఎటాకర్ ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే జోరందుకున్నాయి. మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. మొదటి పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. మేకర్స్ సెకండ్ సింగిల్ గందారబాయి లిరికల్ వీడియోని విడుదల చేశారు.
ఎస్ఎస్ థమన్ మరో బ్లాక్ బస్టర్ నంబర్‌ను అందించారు. మొదటి పాట ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ అయితే, గందారబాయి మాస్ ధమకేధార్ ఫోక్లోర్. బీట్, ఆర్కెస్ట్రేషన్ ఎనర్జిటిక్ గా మాస్ వైబ్‌తో ఆకట్టుకున్నాయి. నకాష్ అజీజ్, సౌజన్య భాగవతుల వాయిస్ మెస్మరైజ్ చేసింది. అనంత శ్రీరామ్ మాస్ లిరిక్స్ రాసిన ఈ పాటను వైబ్రెంట్ సెట్స్ లో చిత్రీకరించారు.
రామ్, శ్రీలీల తమ ఎనర్జీతో ప్రేక్షకుల మనసుని కొల్లకొట్టారు.ఎక్స్ టార్డినరీ డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించారు. రామ్ డ్యాన్స్‌లో డైనమిజం చూపించగా, శ్రీలీల ఎనర్జీతో మ్యాచ్ చేసింది. ఈ ఇద్దరు గ్రేట్ డ్యాన్సర్లు. వాళ్ళ డ్యాన్స్ చూడ్డానికి రెండు కళ్లు చాలవు. నాటు నాటు సాంగ్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ నంబర్ కు కొరియోగ్రఫీ చేశారు.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది.
తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
ప్రెజెంట్స్: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్
సంగీతం: ఎస్ఎస్ థమన్
డీవోపీ: సంతోష్ డిటాకే
ఎడిటింగ్: తమ్మిరాజు
పీఆర్వో: వంశీ-శేఖర్, పులగం చిన్నారాయణ
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…