‘వాల్తేరు వీరయ్య’ 200 రోజులు వేడుకని చూస్తుంటే చరిత్రని తిరగరాసినట్లుగా అనిపించింది: మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్’ వాల్తేరు వీరయ్య’- గ్రాండ్ గా జరిగిన 200 డేస్ షీల్డ్స్ ప్రజంటేషన్ ఈవెంట్  

మెగాస్టార్ చిరంజీవి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’, మాస్ మహారాజా రవితేజతో కలిసి నటించిన చిత్రం 2023 సంక్రాంతికి విడుదలై టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా 200 రోజులను పూర్తి చేసుకుంది. ఇది చిరంజీవి, రవితేజలకు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటి.

సినిమా 200 రోజుల రన్ పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ టీమ్ మొత్తానికి, డిస్ట్రిబ్యూటర్లకు షీల్డ్స్ అందించారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ పాల్గొన్న ఈ గ్రాండ్ ఈవెంట్ లో దర్శకులు హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు సాన హాజరయ్యారు.

ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ.. ” ఒకప్పుడు సినిమాలు 100, 175, 200 రోజులు.. సిల్వర్ జూబ్లీ లు ఆడేవి. ఇప్పుడు.. రెండు వారాల్లో అటు ఇటు తేలిపోతుంది. ఇలాంటి నేపథ్యంలో ‘వాల్తేరు వీరయ్య’  200 రోజులు ప్రదర్శిచడం ఆనందంగా ఉంది. రెండు వందల రోజులు సినిమా ఆడి, విజయానికి గుర్తుగా షీల్డ్ ఇచ్చిపుచ్చుకోవడం చూస్తుంటే ఒళ్లు పులకరిస్తోంది. అందరు కలసికట్టుగా పని చేస్తే మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందనడానికి ఇది నిదర్శనం. చరిత్రను తిరగరాసినట్టుగా అనిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ గారు, రవి గారు చెర్రీ గారికి నా హృదయపూర్వక అభినందనలు.  నా తమ్ముడు రవితేజ ఈ సినిమా ఒప్పుకోవడం అనేది ఈ సినిమా మరో స్థాయికి వెళ్ళడానికి కారణం. తను సహాయ దర్శకుడిగా ఉన్నప్పటి నుంచి తెలుసు.

ఈ రోజు మాస్ మహారాజా గా ఎదగడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. తను   మోస్ట్ బిజియస్ట్ హీరో. ఏడాదికి దాదాపు ఐదు సినిమాలు చేస్తున్నాడు. ఇది చాలా మంచి పరిణామం. ఎక్కువ సినిమాలు చేస్తే ఎంతో మందికి ఉపాది లభిస్తుంది. తన వేగంతో నేనూ ధీటుగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను(నవ్వుతూ). తను ఇదు సినిమాలు చేస్తున్నాడు. నేను సుస్మితకి ఒక సినిమా, యువీ క్రియేషన్ కి మరో సినిమా చేస్తున్నాను. వాల్తేరు వీరయ్యకి పని చేసిన అందరికీ ధన్యవాదాలు.” తెలిపారు  

మాస్ మహారాజ రవితేజ మాట్లాడుతూ.. ఇలాంటి వేడుక చాలా ఏళ్ల తర్వాత జరిగింది. చాలా కొత్తగా అనందంగా వుంది. టీం అందరికీ అభినందనలు. మైత్రీ మూవీ మేకర్స్ కి అభినందనలు. బాబీ ఇలానే ముందుకు వెళ్ళాలి. ఈ సినిమాతో మొదలైన పూనకాలు భోళా శంకర్ తో కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ.. చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టం. ఫ్యాన్స్ తరపున నా కుటుంబం తరపున అన్నయ్య కి థాంక్స్. మా నాన్నకి వందరోజుల సినిమా చేస్తానని చెప్పాను. అది ఇప్పుడు రెండు వందల రోజులు అయ్యింది. ఆయన ఎక్కడున్నా చాలా గర్వంగా ఫీలౌతారు. నన్ను డైరెక్టర్ ని చేసింది మాస్ మహారాజా రవితేజ గారు. ఆయన పెట్టుకున్న నమ్మకంతోనే ఈ రోజు ఇక్కడ వున్నాను. మైత్రీ మూవీ మేకర్స్ లేకపోతే ఈ సినిమా లేదు.  ఈ సినిమాని ఇంత గ్రాండ్ గా తీయడానికి కారణం సినిమా పట్ల ప్యాషన్, చిరంజీవి గారి పట్ల వారికి వున్న అభిమానం. ఈ విజయం నా టీం అందరిది. సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు” తెలిపారు

నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ..  మేము ఎన్ని సినిమాలు,  విజయాలు అందుకున్నప్పటికీ చిరంజీవి గారితో సినిమా చేయడంతో ఒక పరిపూర్ణత వచ్చింది. మెగాస్టార్ గారితో హిట్టు అందుకోవడంలో కిక్కు వేరు. ఈ సినిమాని ఒప్పుకున్నా రవితేజ గారికి ధన్యవాదాలు. చిరంజీవి గారి సినిమా మాస్ క్లాస్ అన్నీ వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఇది ముఫ్ఫై ఏళ్లుగా చూస్తున్నాం. ఇది అందరికీ సాధ్యం కాదు. దర్శకుడు బాబీ చాలా హార్డ్ వర్క్ చేసి నమ్మకంగా బ్లాక్ బస్టర్ కొడతామని మొదటి రోజు నుంచే చాలా కాన్ఫిడెంట్ గా జర్నీ స్టార్ట్ చేశారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’ తెలిపారు

నిర్మాత నవీన్  యెర్నేని మాట్లాడుతూ.. చిరంజీవి గారితో సినిమా చేయడంతో నా కల నెరవేరింది. వాల్తేరు వీరయ్య ఇంత పెద్ద విజయం సాధించడం, 200 రోజుల పండగ జరుపుకోవడం చాలా ఆనందంగా వుంది. ఇంతకంటే ఏం కోరుకోము. ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు. రవితేజ గారు ఈ పాత్ర అంగీకరించి చేసినందుకు చాలా థాంక్స్. ఇంత విజయం ఇచ్చిన బాబీ గారికి థాంక్స్. వాల్తేరు వీరయ్యను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు” తెలిపారు.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

6 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago