మంచి కథాంశంతో.. ఆసక్తిని కలిగించే నేపథ్యంతో రూపొందే డివోషనల్ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ వుంటుంది. ఆ నమ్మకంతోనే రూపొందుతున్న పాన్ ఇండియా డివోషనల్ థ్రిల్లర్ చిత్రం షణ్ముఖ. పవర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ కథానాయకుడు. అవికాగోర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్‌బ్రో ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మణానంతర పనులను జరుపుకుంటోంది.
కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్ ఈ పోస్టర్ అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా ఆది నటిస్తున్న విషయం తెలిసిందే. పోలీస్‌డ్రెస్‌తో ఆది పవర్‌ఫుల్‌గా కనిపిస్తుండగా, ఆయన వెనకాల షణ్ముఖ సుబ్రహ్మాణ స్వామి కనిపించడం, పోస్టర్ చూసిన అందరిలోనూ పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. ఈ సందర్భంగా దర్శకుడు మట్లాడుతూ ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ ఇది. విజువల్ వండర్‌లా, అద్బుతమైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.
డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర హైలైట్‌గా వుంటుంది. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. కేజీఎఫ్, సలార్ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన రవి బసూర్ ఈ చిత్రానికి స్టనింగ్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం అత్యున్నత సాంకేతిక నిపుణులతో నిర్మాణనంతర పనులు మొదలుకానున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఓ వండర్‌ఫుల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం ఆది కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది* అన్నారు.
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత…
మీడియా నేపథ్యంతో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్” తాజాగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల…
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…