సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేశారు రెబల్ స్టార్ ప్రభాస్. తనకు వర్షం సినిమాలా, సంతోష్ శోభన్ కు కపుల్ ఫ్రెండ్లీ గుర్తుండిపోయే మూవీ అవుతుందని ప్రభాస్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఇదొక లవ్ లీ బ్యూటిఫుల్ ఫిలిం అని, ఈ చిత్రాన్ని చూడటాన్ని ఎంజాయ్ చేశానంటూ ప్రభాస్ తెలిపారు. సంతోష్, మానస జోడీ అద్భుతంగా ఉందని, అశ్విన్ ఎంతో ప్రతిభావంతంగా సినిమాను తెరకెక్కించారని ప్రభాస్ ప్రశంసించారు. ఇలాంటి మంచి కథలను తెరపైకి తీసుకొచ్చిన కో ప్రొడ్యూసర్ అజయ్, యూవీ క్రియేషన్స్ కు ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపారు.
కపుల్ ఫ్రెండ్లీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ రూపొందించారు. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేశారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…