మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం కోసం దర్శకుడు శివ నిర్వాణ జతకట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ గ్లింప్స్ కు వచ్చిన అద్భుతమైన స్పందనతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోంది. ఓ అంకితభావం గల తండ్రి పాత్రలో రవితేజ నటన ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉంటుంది,
గ్లింప్స్‌కు వచ్చిన విశేష స్పందనతో ఉత్సాహంతో ఉన్న చిత్రబృందం తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించింది. వరలక్ష్మీ వ్రతం శుభ సందర్భంగా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో రాబోయే రోజుల్లో వరుస ప్రమోషనల్ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రవితేజ, శివ నిర్వాణ పూర్తి అంకితభావంతో పని చేస్తూ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.
ఎనర్జిటిక్ కమర్షియల్ ఎంటర్టైనర్స్తో ప్రేక్షకులను అలరించిన రవితేజ ‘ఇరుముడి’లో పూర్తిగా భిన్నమైన, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించనున్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆయన నటన ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించనుంది. మానవ సంబంధాలు, కుటుంబ విలువల నేపథ్యంలో శివ నిర్వాణ ఈ కథను మనసుని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. అదే సమయంలో కమర్షియల్ అంశాలను కూడా సమతూకంగా మేళవించారు.
ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియ భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైన్, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
శివ నిర్వాణ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, నరేష్ బాబు పి స్క్రిప్ట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. యాక్షన్, భక్తి, కుటుంబ బంధాలు, భావోద్వేగాలను సమన్వయం చేస్తూ రూపొందుతున్న ‘ఇరుముడి’, రవితేజ కెరీర్లో అత్యంత ప్రత్యేకమైన చిత్రాల్లో ఒకటిగా నిలవబోతోంది.
నటీనటులు: మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: విష్ణు శర్మ
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: నరేష్ బాబు పి
కో-డైరెక్టర్: సురేష్
మేకప్: శ్రీనివాస్ రాజు
కాస్ట్యూమర్ డిజైనర్: రాజేష్
పోస్టర్ డిజైనర్: ఎల్లో టూత్స్
PRO: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్.వి…
వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు!’. వంశీ నందిపాటి నిర్మాతగా కన్ను…
మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…
మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…
పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…
సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…