‘రావణాసుర’ నెక్స్ట్ లెవల్ ఎక్స్పీరియన్స్:ఫరియా అబ్దుల్లా

Must Read

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌ పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా ‘రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ఈ చిత్రంలోని హీరోయిన్స్ లో ఒకరైన ఫరియా అబ్దుల్లా విలేఖరుల సమావేశంలో రావణాసుర విశేషాలని పంచుకున్నారు.

రావణాసుర  లో మీ పాత్ర ఎలా వుండబోతుంది ?

 రావణాసుర లో నా పాత్ర పేరు కనకమహాలక్ష్మీ. తను లాయర్. అయితే జాతిరత్నాలు లాంటి లాయర్ కాదు (నవ్వుతూ). చాలా సీరియస్ లాయర్. రవితేజ గారు సీనియర్ లాయర్. క్యారెక్టర్ లో చాలా వెరైటీ కలర్స్ వుంటాయి. కథ తో పాటు మారే పాత్ర.

లాయర్ పాత్రలు మీ సెంటిమెంటా ?

లేదండీ. ఈ కథకు లాయర్ అవసరం.

ఇందులో మొత్తం ఐదు మంది హీరోయిన్స్ వున్నారు కదా.. వాళ్ళతో మీ కాంబినేషన్ సీన్స్ ఎలా వుంటాయి ?

ఇందులో మేఘా ఆకాష్ తో మాత్రమే కాంబినేషన్ సీన్స్ వున్నాయి. ఐదు హీరోయిన్స్ ఉన్నప్పటికీ అందరికీ భిన్నమైన పాత్రలు. కథలో కీలకమైన పాత్ర చేశాను. నటించడానికి ఆస్కారం వుండే పాత్ర.

లాయర్ పాత్ర కోసం ఎలాంటి ప్రిపరేషన్ చేశారు ?

 కోర్టులో తక్కువ సీన్స్ వుంటాయి. లాయర్ నేపధ్యం కీలకంగా వుంటుంది. మ్యారీడ్ విమన్. బాడీ లాంగ్వేజ్ లో కూడా కొంచెం పరిణితి వుండాలి. మైండ్ సెట్ కొంచెం భిన్నంగా వుండాలి. 

ఇందులో  బ్రేకప్ సాంగ్  గురించి ?

కథలో ఒక ఫ్లాష్ బ్యాక్ పాయింట్ లో వచ్చే సాంగ్ అది. ఆ సాంగ్ షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశా. 

రవితేజ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?

రవితేజ గారితో పని చేయడం నెక్స్ట్ లెవల్ ఎక్స్ పీరియన్స్. నటుడిగానే కాదు వ్యక్తిగా కూడా ఆయన చాలా స్ఫూర్తిదాయకం. బ్రేక్ లో కాసేపు ఆయనతో మాట్లడితే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.

కథ వినప్పుడు మీ రియాక్షన్ ఏమిటి ?

రైటర్ శ్రీకాంత్ ఈ కథని చెప్పారు. విన్నప్పుడు చాలా ఎక్సయిటింగా అనిపించింది. దర్శకుడు సుధీర్ వర్మ గారు చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్. 

రావణాసురలో సీత ఎవరు ?

అది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. అప్పటివరకూ సస్పెన్స్ (నవ్వుతూ)

రవితేజ గారు సెట్స్ లో ఎలా వుంటారు ?

రవితేజ గారు చాలా ఫ్రండ్లీ గా వుంటారు. సెట్ లో అందరినీ చాలా కంఫర్ట్ బుల్ గా ఉంచుతారు. ఆయన నుంచి సహనం నేర్చుకున్నాను. రావణాసుర షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశా.

చాలా సెలక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటున్నారు కదా ?

త్వరగా ఎక్కువ సినిమాలు చేసేయాలనే ఆలోచన లేదు. నా ప్రయాణంపై నాకు స్పష్టత వుంది. మరో ఐదేళ్ళలో ఎక్కడ ఉంటానో ఒక అంచనా వుంది. అందుకే సినిమాల ఎంపిక విషయంలో తొందరపడను. నాకు ఎలాంటి రిగ్రేట్స్ లేవు. అవకాశాలు వస్తాయా రావా అనే భయం కూడా లేదు.

ఎలాంటి పాత్రలు చేయాలని వుంది ?

ప్రయోగాలు చేయడం ఇష్టం. నెగిటివ్, యాక్షన్, పిరియాడిక్ ఇలా భిన్నమైన పాత్రలు చేయడం ఇష్టం.

దర్శకత్వం చేసే ఆలోచన ఉందా ?

దర్శకత్వం ఆలోచన వుంది. అలాగే ప్రొడక్షన్ చేయాలనే ఆలోచన కూడా వుంది. అయితే దానికి ఇంకా సమయం పడుతుంది.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి

ప్రస్తుతం తెలుగు,  హిందీ, తమిళ్ లో చెరో సినిమా చేస్తున్నా. ఇంకొన్ని చర్చల దశలో వున్నాయి. 

ఆల్ ది బెస్ట్

థాంక్స్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News