‘కుబేర’ నుంచి రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ & గ్లింప్స్ రిలీజ్

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ శేఖర్ కమ్ముల మోస్ట్ ఎవైటెడ్ మైథలాజికల్ పాన్-ఇండియన్ మూవీ ‘కుబేర’ ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా వుంది. మేకర్స్ ఇప్పటికే ఈ ఇద్దరి సూపర్‌స్టార్‌ల క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ లకు ట్రెమండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తోంది.

ఈరోజు మేకర్స్ రష్మిక ఫస్ట్ లుక్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ని రివీల్ చేసారు. ఆమె ఎక్స్ ట్రార్డినరీ, డిఫరెంట్ అవతార్‌లో కనిపించి ప్రేక్షకులలో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ లుక్ థ్రిల్లింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

ఆకట్టుకునే విజువల్స్‌తో, శేఖర్ కమ్ముల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సోషల్ డ్రామాలో డిఫరెంట్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు. గ్లింప్స్ వీడియోలో డబ్బుని తవ్వి తీసున్న రష్మిక క్యారెక్టర్ ని ప్రజెంట్ చేసి క్యురియాసిటీని పెంచారు.  దేవి శ్రీ ప్రసాద్ రాకింగ్ మ్యూజిక్ కట్టిపడేసింది.

శేఖర్ కమ్ముల కుబేర నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ కాస్ట్ తో  రూపొందుతున్నమోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియన్ చిత్రాలలో ఒకటి. జిమ్ సర్భ్ మరో ప్రముఖ పాత్రలో కనిపించనున్న ఈ హై-బడ్జెట్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుబేర  పాన్-ఇండియా మల్టీ లాంగ్వేజ్ మూవీ. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago