యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌లో… ఆలియాభట్‌, శార్వరి… ఆల్ఫా గర్ల్స్ అంటున్న ఆదిత్యచోప్రా!

యష్‌రాజ్‌ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌లో ఫస్ట్ ఫీమేల్‌ లీడ్‌గా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆలియాభట్‌ అరుదైన ఘనత దక్కించుకున్నారు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో రెయిజింగ్‌ స్టార్‌, యష్‌రాజ్‌ ఫిల్మ్స్ హోమ్‌ గ్రోన్‌ టాలెంట్‌ శార్వరి ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. వారిద్దరూ స్పై యూనివర్శ్‌లో సూపర్‌ ఏజెంట్స్ గా కనిపించనున్నారు. ఈ స్పెషల్‌ ప్రాజెక్టులో వాళ్లిద్దరినీ ఆల్ఫాగర్ల్స్ గా పరిచయం చేయనున్నారు ఆదిత్య చోప్రా.
యష్‌రాజ్‌ఫిల్మ్స్ సంస్థలో ఆలియా, శార్వరి నటిస్తున్న సినిమాకు ‘ఆల్ఫా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఆల్ఫా అనే టైటిల్‌కి మగవారు మాత్రమే కాదు, మహిళలూ అర్హులే అని సమాజానికి గట్టిగా చాటి చెప్పాలనే ధ్యేయంతో ఈ టైటిల్‌ని ఖరారు చేశారు ఆదిత్య చోప్రా.

టైటిల్‌ రివీల్‌ వీడియాలో ఆలియా చెప్పిన డైలాగ్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. ”గ్రీక్‌ ఆల్ఫబెట్‌లో మొదటి అక్షరం, మన ప్రోగ్రామ్‌ మోటో, అన్నిటికన్నా ముందు, అన్నిటికన్నా వేగం, అన్నిటికన్నా స్థైర్యం… నిశితంగా గమనించండి… ప్రతి నగరం ఒక అడవే. ప్రతి అడవినీ ఏలేది.. అల్ఫా!” అంటూ ఆలియా చెప్పిన డైలాగ్‌ ఇన్‌స్టంట్‌గా వైరల్‌ అవుతోంది.


వైఆర్‌ఎఫ్‌ స్పై యూనివర్శ్‌లో ఫస్ట్ ఫీమేల్‌ లీడ్‌ సినిమా ఆల్ఫాను యాక్షన్‌ స్పెక్టకల్‌గా చేయాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నారు ఆదిత్య చోప్రా. ఆల్ఫా సినిమాను శివ్‌ రవైల్‌ తెరకెక్కిస్తున్నారు. గతంలో యష్‌రాజ్‌ఫిల్మ్స్ లో ది రైల్వేమెన్‌ సినిమాతో పేరు తెచ్చుకున్నారు శివ్‌ రవైల్‌.

ఇండియన్‌ సినిమాలో బిగ్గెస్ట్ స్పై యూనివర్శ్‌ ఐపీగా పేరుంది యష్‌రాజ్‌ఫిల్మ్స్ ఆదిత్య చోప్రాకి. స్పై వెర్స్ చిత్రాలు ఏక్‌ థా టైగర్‌, టైగర్‌ జిందా హై, వార్‌, పఠాన్‌, టైగర్‌ 3 ఆయన తెరకెక్కించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలే.

ప్రస్తుతం ఆలియా – శార్వది ఆల్ఫాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ఆదిత్య చోప్రా. మరోవైపు హృతిక్‌ రోషన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ వార్‌2 సినిమాను కూడా డీల్‌ చేస్తున్నారు. ఆయన బ్లాక్‌ బస్టర్‌ యూనివర్శ్‌  నుంచి నెక్స్ట్ సినిమాగా పఠాన్‌2 రానుంది.  ఆ వెంటనే టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌ సెట్స్ మీదకు వెళ్లనుంది.

Tfja Team

Recent Posts

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

15 hours ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

15 hours ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

16 hours ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

16 hours ago

ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…

16 hours ago

దీపావళి సందర్భంగా కార్తీక్ జయంతి ‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్..!

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…

21 hours ago