‘రంగబలి’ హీరోయిన్ యుక్తి తరేజ ఇంటర్వ్యూ

యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘రంగబలి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఎస్‌ ఎల్‌ వి సినిమాస్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌, థియేట్రికల్ ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. జూలై 7న విడుదల కానున్న నేపథ్యంలో హీరోయిన్ యుక్తి తరేజ విలేకరుల సమావేశంలో ‘రంగబలి’ విశేషాలని పంచుకున్నారు

రంగబలి ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
దర్శకుడు పవన్ ఈ సినిమాలో పాత్ర కోసం ఆడిషన్స్ చేశారు. మొదట లుక్ టెస్ట్ జరిగింది. తర్వాత రెండు సీన్స్ ఇచ్చి నటించమని చెప్పారు. ఈ పాత్రకు నేను సరిపోతానని నమ్మకం కుదిరిన తర్వాతే ఎంపిక చేశారు. ఇది నా మొదటి తెలుగు సినిమా. నా మొదటి సినిమాకే నాగశౌర్య గారితో పాటు మంచి నిర్మాణ సంస్థలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.

ఇందులో మీ పాత్ర గురించి చెప్పండి ?
ఇందులో మెడికల్ స్టూడెంట్ గా కనిపిస్తా. నా పాత్ర పేరు సహజ. తనది చాలా కూల్ క్యారెక్టర్. పేరుకి తగ్గట్లే చాలా నాచురల్ గా వుంటుంది.

నాగశౌర్య గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
నాగశౌర్య గారు చేసిన సినిమాల గురించి తెలుసు. ఆయన సినిమాల్లో పాటలు విన్నాను. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాగశౌర్య గారు గ్రేట్ కో స్టార్. మంచి మనసున్న వ్యక్తి. చాలా స్పోర్టివ్. అద్భుతమైన యాక్టర్.

ఈ సినిమాలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి ?
నా మాతృభాష హిందీ. తెలుగులో ఖచ్చితంగా భాషాపరమైన సవాల్ వుంటుంది. పెద్ద పేరా గ్రాఫ్ డైలాగులు నేర్చుకొని చెప్పడం కొంచెం ఛాలెంజ్ గా అనిపించింది. ఈ విషయంలో డైరెక్షన్ టీం  కి  చాలా థాంక్స్ చెప్పాలి. చాలా హెల్ప్ చేశారు. అలాగే దర్శకుడు పవన్ స్క్రిప్ట్ ని ముందే ఇచ్చేవారు. దాని వలన నాకు సీన్ పై ఒక అవగాహన వచ్చేది. పవన్ సినిమాని చాలా అద్భుతంగా తీశారు.  

మీ నేపథ్యం గురించి చెప్పండి ?
మాది హర్యాన. ఢిల్లీ యూనీవర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. కాలేజీలో ఉన్నప్పుడే డ్యాన్స్ స్కూల్ లో జాయిన్ అయ్యాను. చాలా డ్యాన్స్ పోటీల్లో పాల్గొన్నాను. అలాగే ఢిల్లీ ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్ లో విన్ అయ్యాను. తర్వాత మోడలింగ్ మొదలుపెట్టాను. తర్వాత యాక్టింగ్ ఆడిషన్స్ ఇచ్చాను. లుట్ గయ్ అనే పాట మంచి పేరు తీసుకొచ్చింది. అలా ఈ జర్నీ మొదలైయింది.

తెలుగులో మీ ఫేవరేట్ హీరో ? హీరోయిన్ ?  
తెలుగులో నా ఫేవరేట్ హీరో అల్లు అర్జున్. తన డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆయన డ్యాన్స్ ని మ్యాచ్ చేయడం కష్టం. కానీ కలసి డ్యాన్స్ చేయాలని వుంది. అలాగే హీరోయిన్స్ లో అనుష్కశెట్టి అంటే ఇష్టం.

తెలుగులో కొత్త సినిమాలు చేస్తున్నారా ?
కొన్ని కథలు వింటున్నాను. ఈ సినిమా తర్వాత సైన్ చేస్తాను.

ఆల్ ది బెస్ట్
థాంక్స్

Tfja Team

Recent Posts

య‌ష్ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ రిలీజ్‌కు 100 రోజులు మాత్రమే..సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసిన మేక‌ర్స్‌

కొత్త టెక్నిషియ‌న్స్‌ను అనౌన్స్ చేసిన టీమ్‌ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ రిలీజ్‌కు కౌంట్ డౌన్…

6 days ago

డాక్టర్ అరుళనందు పుట్టినరోజు సందర్భంగా ‘హైకు’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన విజన్ సినిమా హౌస్

నిజాయితీతో, భావోద్వేగపూరిత కథలను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆక‌ర్షిస్తూ వేగంగా ఎదుగుతోన్న‌ నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. డా.…

1 week ago

జియో స్టార్ సరికొత్త కార్యక్రమం ‘సౌత్ బౌండ్’ టీజ‌ర్ విడుద‌ల‌

ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను మెపిస్తూ వారి హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్…

1 week ago

లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌తో తొలి భార‌తీయ సినిమాగా గుర్తింపు పొందిన దిల్ వాలే దుల్హ‌నియా లే జాయేంగే

యష్ రాజ్ ఫిల్మ్స్ హిస్టారిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ దిల్ వాలే దుల్హ‌నియా లే జాయేంగే (DDLJ) 30 వ‌సంతాల సంద‌ర్బంగా…

1 week ago

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

1 week ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

2 weeks ago