‘యానిమల్’ డిసెంబర్ 1న విడుదల

Must Read

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ‘యానిమల్’ డిసెంబర్ 1న విడుదల

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా యాక్షన్-థ్రిల్లర్ ‘యానిమల్’ ప్రీ-టీజర్ కొన్ని రోజుల క్రితం విడుదలై ట్రెమండస్ రెస్పాన్స్ తో అంచనాలు పెంచింది. యానిమల్‌ని థియేటర్లలో చూసేందుకు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదల వాయిదా పడింది. మొదట ఆగస్ట్ 11న విడుదల కావాల్సిన యానిమల్ డిసెంబర్ 1కి వాయిదా పడింది.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేసి వాయిదాకు గల కారణాన్ని చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అధికంగా ఉండటమే ఆలస్యానికి ప్రధాన కారణమని వివరించారు. సినిమాలో 7 పాటలు ఉన్నాయని, ఒక్కో పాటను ఐదు భాషల్లో పర్ఫెక్ట్ లిరిక్స్‌తో రికార్డ్ చేయడం బిగ్ టాస్క్ అని చెప్పారు. ప్రీ టీజర్‌లోని సీక్వెన్స్ సినిమాలో ఉందని కూడా స్పష్టం చేశారు.

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోని డైనమిక్ పవర్‌హౌస్‌ల కలయికలో విజనరీ భూషణ్ కుమార్ టి సిరీస్ పై భద్రకాళి పిక్చర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగాతో కలసి ఈ యాక్షన్ సాగాను నిర్మిస్తున్నారు.

రణబీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

తారాగణం: రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా
నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా
బ్యానర్లు: టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్
పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల వైవిధ్యమైన...

More News