రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా ‘అభిమాని’ మూవీ గ్లింప్స్‌ విడుదల

Must Read

సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు. ఇప్పటికే దేవినేని సహా అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సురేష్ కొండేటి లీడ్ రోల్ లో ఓ మూవీ చేస్తున్నారు. సురేష్ కొండేటి హీరోగా అభిమాని అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన సంవత్సరం సందర్భంగా ఆ సినిమాను అనౌన్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అభిమాని ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనే ట్యాగ్‍లైన్ తోనే సినిమా తెరకెక్కింది. భూలోకం, యమలోకం చుట్టూ తిరిగే కథలో ఈ చిత్రం రానుందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్‍కే రహ్మాన్, మరియు కంద సాంబశివరావు గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, అభిమాని చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సురేష్ కొండేటి పుట్టిన రోజు (అక్టోబర్ 6) సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా గ్లింప్స్ రిలీజ్ అయింది.

ఈ సందర్బంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ “ఇప్పుడే సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో నటించిన ‘అభిమాని’ మూవీ గ్లింప్స్ చూడడం జరిగింది. చాలా బాగుంది. ‘అభిమాని’ అనే టైటిల్ చాలా ఆరోగ్యకరంగా, చాలా బాగుంది. అక్కడే సినిమా సగం విజయం సాధించింది. అభిమాని అంటే కేవలం ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లి సినిమా చూసి కాగితాలు ఎగరవేయడమే కాదు, తన అభిమాన హీరో చేసే మంచి కార్యక్రమాలు, వారిలో ఉన్న మంచి లక్షణాలు, వారు ఎంత కష్టపడి పైకి వచ్చారో తెలుసుకుని, తాను పాటిస్తూ పదిమందికి చెప్పాలి. అదే ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. ఒక స్ఫూర్తిదాయకంగా ఈ మూవీ తీశారని అనుకుంటున్నాను. ఇక సురేష్ కొండేటి గురించి చెప్పాలంటే, తాను నాకు జర్నలిస్ట్‌గా ఉన్నప్పటి నుండే తెలుసు. అక్కడి నుండి తన ప్రయాణం జర్నలిస్ట్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా, నటుడిగా, ఇప్పుడు ప్రధాన పాత్ర పోషించే స్థాయికి ఎదిగిన తీరు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమా డైరెక్టర్‌కు మంచి పేరు తీసుకురావాలి, హీరోయిన్‌కి ఈ మూవీలో నటించిన నటీనటులందరికీ మంచి పేరు రావాలని, నటుడిగా సురేష్ కొండేటి బిజీ అవ్వాలని కోరుకుంటూ, అలాగే ప్రొడ్యూసర్స్‌కి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరి హీరోల అభిమానులు ఈ మూవీ చూసి మంచి విజయం అందించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ అల్ ది బెస్ట్ సురేష్” అన్నారు.

అనంతరం డైరెక్టర్ రాంబాబు మాట్లాడుతూ ” నేను డైరెక్ట్ చేసిన ‘అభిమాని’ మూవీ గ్లింప్స్‌ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా విడుదల కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ లో సురేష్ కొండేటి గారు ప్రధాన పాత్రలో నటించారు. యముడిగా అజయ్ ఘోష్ గారు నటించారు, నానమ్మ పాత్రలో అన్నపూర్ణమ్మ గారు నటించారు, చిత్రగుప్తుని పాత్రలో ఎస్.కె రెహమాన్ గారు నటించారు.హీరోయిన్‌గా అక్సాఖాన్ నటించారు, మరో పాత్రలో జై క్రిష్ నటించారు .నా మీద ఎంతో నమ్మకంతో ప్రధాన పాత్ర చేయడానికి ఒప్పుకున్న సురేష్ కొండేటి గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా మీద నమ్మకంతో సినిమాను ప్రొడ్యూస్ చేసిన SK రెహమాన్ గారికి, కందా సాంబశివరావు గారికి చాలా, చాలా థాంక్స్ . అలాగే మా ‘అభిమాని’ మూవీ గ్లింప్స్‌ విడుదల చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.

అక్సాఖాన్: మాట్లాడుతూ* ” నేను నటించిన ‘అభిమాని’ మూవీ గ్లింప్స్‌ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా విడుదల కావడం మా టీం అందరికీ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సర్. మీ అభిమానం మా మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మూవీలో ప్రధాన పాత్రలో సురేష్ కొండేటి గారు నటించారు. సురేష్ సర్‌తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. సురేష్ సర్‌ నాకు చాలా ఏళ్ల నుండి తెలుసు, అప్పటి నుండి నాకు చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. ఇక ముందు కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్, నన్ను ఈ పాత్రకు ఎంపిక చేసినందుకు. అలాగే మా టీంకి ప్రేక్షకుల సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.

సురేష్ కొండేటి మాట్లాడుతూ* ” దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారితో నా పరిచయం కొన్ని దశాబ్దాల నాటిది.


పంపిణీ దారుడిగా నా కెరీర్ మొదలైందే రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ‘స్టూడెంట్ నంబర్ 1’తో…
ఆ సినిమాతోనే రాజమౌళిగారు దర్శకుడిగా పరిచయం అయ్యారు.
ఆ సినిమా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో నేను పంపిణీ చేశాను.
ఘన విజయాన్ని సాధించిన ఆ సినిమా నాకు పంపిణీదారుడిగా బలమైన పునాదిని వేసింది. ఆ క్రమంలోనే ఆ తర్వాత పలు చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేశాను. నిర్మాతగానూ మారాను .
అలా ఫిల్మ్ జర్నలిస్ట్ గా ఉన్న నన్ను సినిమా ఇండస్ట్రీలో నిలబడేలా చేసింది రాఘవేంద్రరావు గారే.
స్టూడెంట్ నంబర్ వన్ వచ్చి మొన్న సెప్టెంబర్ 27కి 23 సంవత్సరాలైంది. సరిగ్గా అదే రోజున ఎన్టీఆర్ ‘దేవర’ విడుదలైంది. రాఘవేంద్రరావు గారు నాకెందుకు ఇష్టం అంటే…ఆయన ఫాదర్ కె.యస్. ప్రకాశరావు గారు పెద్ద పేరున్న దర్శకుడు అయినా… ఆయన పేరును వాడుకోకుండా…
పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు గారి దగ్గర, వి. మధుసూదనరావు గారి దగ్గర ఆయన డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేశారు. 1975 మే 2 వచ్చిన ‘బాబు’ మూవీతో డైరెక్టర్ అయ్యారు.
అంటే దర్శకుడిగా ఆయన వయసు ఇప్పుడు 50 సంవత్సరాలు.
వచ్చే యేడాదికి డైరెక్టర్ గా స్వర్ణోత్సవం జరుపుకోబోతున్నారు.
యాభై యేళ్ళుగా దర్శకత్వం వహిస్తూ, వందకు పైగా సినిమాలు తీసినా..
ఇప్పటికీ ఆయన నిత్య విద్యార్థిగానే వ్యవహరిస్తారు.
కొత్త నటీనటులను, యువ దర్శక నిర్మాతలను ప్రోత్సహిస్తుంటారు.
గైడ్ చేస్తుంటారు. ఎవరు ఏ సలహా కోసం వచ్చిన ఓర్పుగా వారి సందేహాలను నివృత్తి చేస్తుంటారు. ఆయన తెలుగు సినిమా రంగంలో లివింగ్ లెజెండ్. రాఘవేంద్రరావుగారు అందుకోని విజయం లేదు.
వెంకటేశ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ ను ఆయన తెలుగు తెరకు పరిచయం చేశారు.
ఎన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్ బాబు, రాజశేఖర్ వంటి వాళ్ళకు గ్రాండ్ సక్సెస్ లు ఇచ్చారు. ఏకంగా నాలుగు తరాలతో కలిసి పనిచేశారు.
ఎంతో మంది కొత్త అమ్మాయిలను హీరోయిన్లుగా పరిచయం చేశారు.
శ్రీదేవి మొదలు కొని ఎంతోమంది హీరోయిన్లకు స్టార్ డమ్ ను కట్టబెట్టారు.
తెలుగులోనే కాదు… బాలీవుడ్ లోనూ విజయ పతాకాన్ని ఎగరేశారు.
ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు. దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు సినిమా చరిత్రలో ఆయనదే సువర్ణ అధ్యాయం.
అలాంటి రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా… నేను ప్రధాన పాత్ర పోషించిన ‘అభిమాని’ సినిమా గ్లింప్స్ విడుదల కావడం ఎంతో ఎంతో ఆనందంగా ఉంది. గతంలో నేను కొన్ని సినిమాలలో నటించినా… అవన్నీ ఒక ఎత్తు… ఈ సినిమా ఒక ఎత్తు. ఇందులో నాది ప్రధాన పాత్ర.
సో… రాఘవేంద్రరావు గారి ఆశీస్సులతో ఈ సినిమా మంచి విజయాన్ని పొందుతుందని, నటుడిగా నేను మరో స్థాయికి చేరుకోవడానికి ఆ విజయం దోహదం చేస్తుందని భావిస్తున్నాను.

Latest News

Actor Yogesh Kalle in the Pan India Film Trimukha

Actor Yogesh kalle is making his acting debut with the Pan Indian Film "Trimukha" in which nassar, CID Aditya...

More News