గ్రాండ్‌గా ‘రాచరికం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జనవరి 31న చిత్రం విడుదల

అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రాచరికం’. ఈశ్వర్ నిర్మాతగా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. సురేశ్ లంకలపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్, పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మూవీని జనవరి 31న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం నాడు మూవీ ప్రీ రిలీజ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ.. ‘‘రాచరికం’ టైటిల్లోనే ఓ రాయల్టి ఉంటుంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూపిస్తామా? అని అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. సురేష్ గారి పనితనం, డెడికేషన్ ప్రతీ షాట్‌లో కనిపిస్తుంది. నా బ్రదర్ మన్మథరావు సపోర్ట్ వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఈ సినిమాను గొప్పగా తీయాలని ఈశ్వర్ గారు అహర్నిశలు కష్టపడ్డారు. రాయలసీమ అంటే ఏంటో ఈ సినిమా చూపిస్తుంది. ఇంత పెద్ద పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు సురేష్ గారికి థాంక్స్. మా డీఓపీ బాలీవుడ్‌లో బిజీగా ఉన్నా కూడా మాకోసం వచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ వెంగి ఇచ్చిన పాటలు, ఆర్ఆర్ ఇంకా మైండ్‌లోనే తిరుగుతున్నాయి. రామ్ ప్రసాద్ రాసిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మా చిత్రం జనవరి 31న రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ‘రాచరికం సినిమాలో నెగెటివ్ పాత్రను చేశాను. మైఖేల్ తరువాత మళ్లీ ఈ పాత్ర నన్ను ఎగ్జైట్ చేసింది. అందుకే ఈ సినిమాలో నటించాను. సురేశ్ మరియు ఈశ్వర్ అద్భుతంగా తీశారు. అప్సరా, విజయ్ కెమిస్ట్రీ బాగుంది. మ్యూజిక్ బాగుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. జనవరి 31న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

దర్శకుడు సురేశ్ లంకలపల్లి మాట్లాడుతూ.. ‘రాచరికం సినిమాకు నా టీం ఎంతో సహకరించింది. నటించిన ఆర్టిస్టులందరికీ థాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ వెంగి, డీఓపీ ఆర్య సాయి, రైటర్ రాం ప్రసాద్, వీఎఫ్ఎక్స్ చందు, ఎడిటర్ జేపీలకు ప్రత్యేకంగా థాంక్స్. నా డైరెక్షన్ టీం నా వెన్నంటే ఉంటూ నడిపించింది. కెమెరా వర్క్ చాలా రిచ్‌గా ఉంటుంది. వంద కోట్లతో తీసిన సినిమాలా కనిపిస్తుంది. రామ్ ప్రసాద్ రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. ఎడిటర్ జేపీగారు సినిమాను అద్భుతంగా కట్ చేశారు. కథ రాసినప్పటి నుంచి ఈశ్వర్ నాతోపాటున్నారు. ఎవరి కోసమో ఎదురుచూడటం ఎందుకు మనమే నిర్మిద్దామని ఈశ్వర్ ముందుకు వచ్చారు. విజయ్ గారు చాలా డెడికేటెడ్‌గా నటించారు. అప్సరా రాణి గారు మాత్రమే ఈ పాత్రను చేయాలని ముందే ఫిక్స్ అయ్యాను. ఆమె అద్భుతంగా నటించారు. విజయ రామరాజు విలనిజం చూసి అంతా
షాక్ అవుతారు. వరుణ్ సందేశ్ గారి కారెక్టర్ అదిరిపోతుంది. జనవరి 31న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

నిర్మాత ఈశ్వర్ మాట్లాడుతూ.. ‘ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, మాధవ్ గారికి థాంక్స్. మా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరి గురించి సురేశ్ చాలా బాగా చెప్పాడు. మా ట్రైలర్‌ను అశోక్ అద్భుతంగా కట్ చేశాడు. డైరెక్టర్ మారుతి గారు ట్రైలర్ లాంచ్ చేయడంతో ఎక్కువగా రీచ్ అయింది. శ్రీ విష్ణు గారు మౌలా పాటను లాంఛ్ చేశారు. టిక్కు టిక్కు పాటను రాహుల్ సంకృత్యాన్ గారు రిలీజ్ చేశారు. నేను, సురేష్, చాణక్య కలిసి చేసిన ఈ సినిమాకు నా ఫ్రెండ్స్ అండగా నిలిచారు. బడ్జెట్ పెరిగిపోతోన్న ప్రతీ సారి నా స్నేహితులే నాకు సపోర్ట్‌గా నిలిచారు. మన ప్రయత్నాల్ని మధ్యలో ఆపేయకూడదు. చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. సురేష్, నేను, చాణక్య కలిసి కష్టపడి ఇక్కడకు వచ్చాం. విజయ్ శంకర్ ఎంతో ఒదిగి ఉంటాడు. అప్సరా అద్భుతంగా నటించారు. విజయరామరాజు పర్ఫామెన్స్ చూసి షాక్ అవుతారు. వరుణ్ సందేశ్ గారు చాలా సపోర్ట్ చేశారు. జనవరి 31న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

అప్సరా రాణి మాట్లాడుతూ.. ‘‘రాచరికం’ మూవీ జనవరి 31న రాబోతోంది. ఈ చిత్రంలో ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన సురేశ్, ఈశ్వర్ గారికి థాంక్స్. ఒకే రకమైన పాత్రలు వస్తున్నాయని సినిమాలు వదిలేయాలని అనుకున్నా. ఆ టైంలోనే ఆ దేవుడు వీళ్లని నా దగ్గరకు పంపించాడు. విజయ్ శంకర్‌తో నటించడం ఆనందంగా ఉంది. సురేశ్ గారు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. జనవరి 31న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ వెంగి మాట్లాడుతూ.. ‘రాచరికం సినిమాలోని పాటలు చాలా బాగా వచ్చాయి. ఐపీఎల్ మూవీకి సురేశ్ గారితో పని చేశాను. ఈ మూవీని చాలా రిచ్‌గా తీశారు. నిర్మాత చాలా ఖర్చు పెట్టారు. విజయ్ శంకర్, అప్సరా రాణి, వరుణ్ సందేశ్ ఇలా అందరూ అద్భుతంగా నటించారు. విజువల్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. ఆర్టిస్టుల పర్ఫామెన్స్, కెమెరా వర్క్‌‌కి తగ్గట్టుగా నేను మ్యూజిక్ ఇచ్చాను. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రాచీ థాకర్ మాట్లాడుతూ.. ‘రాచరికం సినిమాలో నాకు మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడు సురేశ్, నిర్మాత ఈశ్వర్ గారికి థాంక్స్. విజయ్ శంకర్, అప్సరా, ప్రీతి ఇలా అందరితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. జనవరి 31న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

అనుపమ స్వాతి మాట్లాడుతూ.. ‘రాచరికం చిత్రంలో అప్సరా రాణికి తల్లిగా నటించాను. ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. జనవరి 31న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

టీఎస్సార్ మూవీ మేకర్ అధినేత శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘రాచరికం చూశాక సురేశ్ లంకపల్లి మా బ్యానర్లో సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఇది చాలా పెద్ద సినిమా కాబోతోంది. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.

చాణక్య మాట్లాడుతూ.. ‘రాచరికం సినిమాతో దర్శకుడు సురేశ్ తన సత్తా ఏంటో అందరికీ చూపించబోతున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కానుంది’ అని అన్నారు.

రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. ‘రాచరికం సినిమాను చాలా ప్రొఫెషనల్‌గా తీశారు. కొత్త టీం తీసిన సినిమాలా అనిపించలేదు. చాలా పెద్ద చిత్రం కాబోతోంది. మ్యూజిక్ డైరెక్టర్ వెంగి నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అతనే నాకు దారి చూపించాడు. జనవరి 31న ఈ చిత్రం రాబోతోంది. చాలా పెద్ద హిట్ కానుంది’ అని అన్నారు.

నాగ్ అశ్విన్ మదర్ జయంతి మాట్లాడుతూ.. ‘రాచరికం మూవీ ప్రారంభం నుంచీ నాకు అప్డేట్లు ఇస్తూనే ఉన్నారు. ట్రైలర్, పాటలు చాలా బాగా వచ్చాయి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. జనవరి 31న ఈ చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.

ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ.. ‘రాచరికం మూవీని సురేశ్ అద్భుతంగా తీశారు. ఈశ్వర్ ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కించారు. వెంగి, రాహుల్ సిప్లిగంజ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారానే కెరీర్ స్టార్ట్ చేశారు. జనవరి 31న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

డీఓపీ ఆర్య సాయి మాట్లాడుతూ.. ‘రాచరికం చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకుడు సురేశ్, నిర్మాత ఈశ్వర్ గారికి థాంక్స్’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

నా ఫిల్మ్ లైబ్రరీలో ‘పెద్ది’ నంబర్ వన్ సినిమాగా నిలుస్తుంది: భోపాల్‌ ‘పెద్ది కి ఆవాజ్’ బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.…

4 hours ago

జియో స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

సీజన్ 1, సీజన్ 2లతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను న‌వ్వుల్లో ముంచెత్తి భారీ విజయాలు సాధించిన అతి పెద్ద ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్…

22 hours ago

“అగ్లీ స్టోరీ” చిత్రానికి వచ్చిన అనూహ్య స్పందనకు చిత్ర టీం థాంక్యూ మీట్

నందు, అవికా గోర్ జంటగా నటిస్తూ నిన్న ప్రేక్షకుల ముందుకువచ్చిన 'అగ్లీ స్టోరీ' చిత్రానికి వచ్చిన అనూష స్పందనకు ఈ…

23 hours ago

ఫీల్ గుడ్ ఎమోషన్‌తో రాబోతోన్న విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి’

ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో ము. మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా చేస్తున్న చిత్రం ‘నాన్న కుట్టి’. యాక్షన్,…

2 days ago

కార్మికులకు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మరో వరం, ఫిలిం ఫెడరేషన్ కు భవనం నిర్మించి ఇస్తానని హామీ

సినీ కార్మికులకు అండగా నిలబడటంలో ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ నిర్మాత, దర్శకులు చదలవాడ శ్రీనివాసరావు. చిత్రపురి కాలనీకి కోట్లాది రూపాయల…

2 days ago

యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ “సమవర్తి” మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా…

2 days ago