“పురుషోత్తముడు” మూవీ ట్రైలర్ లాంఛ్

Must Read

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “పురుషోత్తముడు”. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. “ఆకతాయి”, “హమ్ తుమ్” చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన “పురుషోత్తముడు” సినిమాను రూపొందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు “పురుషోత్తముడు” చిత్ర ట్రైలర్ ను సినిమా యూనిట్ సమక్షంలో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ – ఈ రోజు ఫిలింనగర్ దైవసన్నిధానం, మోతీనగర్ రామాయలయంలో పూజా కార్యక్రమాలు జరుపుకుని మా “పురుషోత్తముడు” సినిమా ట్రైలర్ ను మూవీ యూనిట్ సమక్షంలో లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. మా సినిమా ట్రైలర్ కు అతి తక్కువ టైమ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. మా సినిమాలో ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం వంటి స్టార్ కాస్టింగ్ ఉన్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, యాక్షన్, మంచి మ్యూజిక్ వంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులందరికీ నచ్చేలా “పురుషోత్తముడు” సినిమా ఈ నెల 26న మీ ముందుకు రాబోతోంది. “పురుషోత్తముడు” థియేటర్స్ లో ఒక పండగ లాంటి వాతావరణం తీసుకొస్తుందని, మీ అందరి ఆదరణ సినిమాకు దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

నిర్మాత ప్రకాష్ తేజావత్ మాట్లాడుతూ – “పురుషోత్తముడు” సినిమా ట్రైలర్ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. అన్ని వర్గాల ఆడియెన్స్ నచ్చేలా సినిమాను రూపొందించారు మా డైరెక్టర్ రామ్ భీమన. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా “పురుషోత్తముడు” సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ నెల 26వ తేదీన థియేటర్స్ లో తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత డా.రమేష్ తేజావత్ మాట్లాడుతూ – “పురుషోత్తముడు” ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సంతోషంగా ఉంది. ఈ పాజిటివ్ రెస్పాన్స్ థియేటర్స్ లోనూ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నా. “పురుషోత్తముడు” సినిమా నిర్మించడం నా కల. నిర్మాతగా ఒక మంచి మూవీ చేశామని నమ్ముతున్నాం. సకుటుంబంగా మా సినిమాకు రండి మీరంతా తప్పకుండా ఎంజాయ్ చేసేలా “పురుషోత్తముడు” సినిమా ఉంటుంది. అన్నారు.

నటీనటులు – రాజ్ తరుణ్, హాసినీ సుధీర్, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, విరాన్ ముత్తంశెట్టి, ముకేష్ ఖన్నా, ప్రవీణ్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, సత్య తదితరులు

టెక్నికల్ టీమ్ – ఎడిటింగ్ – మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ – పీజీ విందా, మ్యూజిక్ – గోపీ సుందర్, సాహిత్యం – చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, చైతన్య ప్రసాద్, బాలాజీ, పూర్ణాచారి, పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలే, బ్యానర్ – శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్, నిర్మాతలు – డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్, పీఆర్ ఓ- సురేష్ కొండేటి, రచన, దర్శకత్వం – రామ్ భీమన

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News