యంగ్ హీరో శ్రీ నందు న్యూ ఇయర్ బ్లాక్ బస్టర్ ‘సైక్ సిద్ధార్థ’. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించారు. సురేష్ ప్రొడక్షన్ ద్వారా జనవరి 1న గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ న్యూ ఇయర్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో హీరో శ్రీ నందు మాట్లాడుతూ.. ఈరోజు కోసమే 18 ఏళ్లుగా ఎదురు చూశాను. ఒక బ్లాక్ బస్టర్ పోస్టర్ తో మీ అందరి ముందు మాట్లాడాలని, సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ కి థాంక్స్ చెప్పాలని ఎదురు చూశాను. అది ఈరోజు కావడం చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్ వరుణ్ కి థాంక్యూ సో మచ్. నేను ఎన్నో సినిమాలు చేశాను కానీ అవి కూడా సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్లలేదు. ఈ సినిమా వెళ్లిందంటే కారణం డైరెక్టర్ వరుణ్ విజన్. ఈ సినిమా క్రెడిట్ అంతా వరుణ్ కే దక్కుతుంది. నాకు ఈ సినిమా ఇచ్చిన వరుణ్ కి థాంక్యూ. ఈ సినిమా రైటింగ్ ఎడిటింగ్ స్క్రీన్ ప్లే సౌండ్ డిజైన్ అన్నీ కొత్తగా ఉంటాయి. ప్రతిదీ చాలా ఆలోచించి చేసింది. ఫస్ట్ 100 మందిలో 40 మందికి నచ్చుతుంది. సెకండ్ హాఫ్ 100 మందికి నచ్చుతుంది. 40 మంది కూడా ఈ సినిమాని ఈ సినిమా గురించి జీవితాంతం మాట్లాడుకుంటారు. సినిమా హౌస్ ఫుల్ గా రన్ అవుతుంది. థియేటర్ లో ఒక మాస్ సినిమాని ఎంజాయ్ చేస్తున్నట్టుగా చూస్తున్నారు. ఈ సినిమాని ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ థాంక్యూ సో మచ్. ఈ సినిమాకి చాలా అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. ఇలాంటి ఒక వైవిధ్యమైన సినిమాకి అద్భుతమైన రివ్యూలు ఇచ్చిన అందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఉలవచారు బిర్యానీ లాంటిది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ ముద్దపప్పు అవకాయ లాంటింది అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా రేపటికి బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్యూ సో మచ్. సినిమా అనేది చూసిన వందమందిలో 70 మందికి నచ్చుతుందంటే సినిమా బాగున్నట్టు. నచ్చని వారికి వారి టెస్ట్ కి తగ్గట్టు లేనట్టు. ఇదేమైనా సైక్ సిద్ధార్థ గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది. అలా డిస్కషన్ జరగడం మంచిది. థియేటర్స్ కి వచ్చి నాకు సపోర్ట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థాంక్యూ. సినిమాని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ థాంక్యూ సో మచ్. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సురేష్ బాబు గారికి రానా గారికి థాంక్యూ సో మచ్. మా కలల్ని నిజం చేసినందుకు. పెద్దపెద్ద ప్రొడక్షన్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. టెక్నీషియన్స్ అందరికి కూడా చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. సక్సెస్ అంటే డబ్బులతో పాటు అవకాశాలు రావడం. మాకు అలాంటి అవకాశాలు వస్తున్నాయి. ఇంత మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
హీరోయిన్ యామిని భాస్కర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నా క్యారెక్టర్ కి ఆడియన్స్ చాలా కనెక్ట్ అయ్యారు. నాకు కం బ్యాక్ ఫిల్మ్ ని చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. నందు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అహర్నిశలు పనిచేశాడు తన కష్టాన్ని తగిన ఫలితం వచ్చింది. వరుణ్ కి థాంక్యూ. క్యారెక్టర్ చాలా అద్భుతంగా వచ్చింది. శ్రావ్య పాత్రకి అన్ని వైపుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. స్మరణ్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు తన మ్యూజిక్ తో సినిమా మరో లెవల్ కి వెళ్ళింది. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా ఇంకా హౌస్ ఫుల్ చూడాలని నేను కోరుకుంటున్నాను
డైరెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. చాలా గొప్ప గొప్ప రివ్యూలు వచ్చాయి. కొన్ని రిలువ్యూ చూస్తే ఎమోషనల్ గా ఏడుపొచ్చింది. ఈ సినిమాని థియేటర్లో చూస్తున్నప్పుడు ఆడియన్స్ నుంచి నాకు ఫైవ్ స్టార్, టెన్ స్టార్ రివ్యూస్ వచ్చాయి. మాస్ ఆడియోస్ ఈ సినిమాని విపరీతంగా చూస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ క్యారెక్టర్ అద్భుతంగా పేలింది. ఫ్రెండ్స్ తో కలిసి మాస్ థియేటర్స్ లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అంత అద్భుతంగా ఈ క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యారు. ఒకరి జీవితాన్ని ఆడియన్స్ సీట్ లో కూర్చుని పూర్తిగా అనుభవించాలనేదే సినిమా మెయిన్ పర్పస్. ఆ పర్పస్ ని ఈ సినిమా నిండుగా నెరవేర్చింది. థియేటర్స్ లో కేకలు వేసి ఫుల్ గా ఎంజాయ్ చేసే ఆడియన్స్ కి ఈ సినిమా అంకితం. సినిమా హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. సినిమాని మీ ఫ్రెండ్స్ తో కలిసి గ్రూపుగా రండి ఎంజాయ్ చేయండి. అరుపులు కేకలు పెట్టే టాలీవుడ్ ఆడియన్స్ కి ఈ సినిమా అంకితం. ఇంత అద్భుతమైన సక్సెస్ ఇచ్చిన అందరికీ థాంక్యూ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాని మేము చాలా బలంగా నమ్మాము. ఈ సినిమా నచ్చిన వాళ్ళకి విపరీతంగా నచ్చుతుంది. కాల్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిమ్స్ అని చెప్తున్నారు. మేము ఈ సినిమాలో ఉన్న ఒరిజినల్ వాయిస్ ని నమ్మాము. పెళ్లిచూపులు. కేర్ ఆఫ్ కంచరపాలెం, మల్లేశం రాజా వారు రాణివారు.. ఈ సినిమాలు ఎలాంటి ట్రెండ్ సెట్ చేసాయో మనందరికీ తెలుసు. సైక్ సిద్ధార్థ క్యారెక్టర్ ఆ బిహేవియర్ ని మేము నమ్మాము. దాన్ని చాలా హానెస్ట్ గా చూపించారు. ప్రతి సినిమాని ఒకేలాగా చూడకూడదు. కేరాఫ్ కంచరపాలెం ఫస్ట్ టైం చూసినప్పుడు యూట్యూబ్లో పెట్టండి అని చాలామంది కామెంట్ చేశారు. ఈరోజు ఆ సినిమా ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు. సైక్ సిద్ధార్థ కూడా అలాంటి ట్రెండ్ సెట్ చేసిన సినిమా. ఒక సినిమానే ఇంత కొత్తగా తీయొచ్చు అని చెప్పడానికి ఈ సినిమా ఒక బెంచ్ మార్క్ అవుతుంది. చాలా కొత్త సినిమా. అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి.

