పృథ్విరాజ్, అనూ మెహత హీరోహీరోయిన్లుగా పిఎస్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రాబరీ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా ఓ క్రొత్త చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ ద్వారా పి.మణిరాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పి.నాగమణి సమర్పణలో ప్రవీణ శివరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త తరహా కథ, కథనంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఓ ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే మొదలైన ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పి. మణిరాజ్ మాట్లాడుతూ – 27 రోజుల పాటు వికారాబాద్, హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని అందమైన లోకేషన్లలో చిత్రీకరణ జరిపాం. ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. హీరో పృథ్విరాజ్, హీరోయిన్ అనూ మోమత చక్కగా నటించారు. టెక్నీషియన్స్ అందరూ పూర్తి సహకారం అందించారు. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. ఒక రాబరీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి నవంబరు నెలలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలోనే టైటిల్, ఫస్ట్ విడుదల చేస్తాం అన్నారు.
పృథ్విరాజ్, అనూ మెహత హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి
సమర్ఫణ: పి. నాగమణి
బ్యానర్: పిఎస్ఆర్ ప్రొడక్షన్స్
నిర్మాత: ప్రవీణ శివరాజ్
దర్శకత్వం: పి. మణిరాజ్
సినిమాటోగ్రఫి: పరశురామ్ ఎరుగదిండి
ఎడిటర్: సి. అక్షయరాజ్
పీఆర్ఓ: శ్రీను-సిద్ధు
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…