పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Sharwa38 అనౌన్స్‌మెంట్

చార్మింగ్ స్టార్ శర్వా వెర్సటైల్ పెర్ఫార్మెన్స్ తో డిఫరెంట్ స్క్రిప్ట్‌లతో అలరిస్తున్నారు. తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #Sharwa38 కోసం మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుపొందిన బ్లాక్‌బస్టర్ మేకర్ సంపత్ నందితో చేతులు కలిపారు. లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై  హై బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రముఖ నిర్మాత కెకె రాధామోహన్‌ ప్రతిష్టాత్మకంగాఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఇది1960లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పల్సేటింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామా.    

#Sharwa38 గ్రిప్పింగ్ యాక్షన్, ఎమోషనల్ చార్జ్డ్ సీక్వెన్స్‌లతో ఇంటెన్స్ నెరేటివ్ గా వుంటుంది. ఇంతకు ముందెన్నడూ చూడని ఎలిమెంట్స్ తో ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ మూవీగా వుండబోతోంది.

సబ్జెక్ట్ యూనివర్సల్ అప్పీల్ వుండటంతో మేకర్స్  దీనిని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు.శర్వా, సంపత్ నంది ఇద్దరికీ ఇది మెడిన్ పాన్ ఇండియా మూవీ.

సినిమా కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేసిన దర్శకుడు, శర్వాను మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు, 60ల నాటి క్యారెక్టర్ ని పోషించేందుకు శర్వా కంప్లీట్ గా మేకోవర్‌ అయ్యారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో మంటలు చెలరేగుతున్నట్లు కనిపించడం ఆసక్తికరంగా వుంది.

#Sharwa38 కి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సౌందర్ రాజన్ ఎస్ కెమెరామ్యాన్ గా పని చేస్తుండగా, సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.

ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి పని చేసే తారాగణం, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.  #Sharwa38 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం,  హిందీ భాషల్లో విడుదల కానుంది.

నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
సమర్పణ: లక్ష్మీ రాధామోహన్
డీవోపీ: సౌందర్ రాజన్ S
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
PRO: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “చిరంజీవి” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్…

3 hours ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

24 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago