యువ హీరోలు పూరి ఆకాష్, రోషన్ కనకాల ముఖ్య అథితులుగా ప్రేమిస్తున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!

వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు.

ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులలతో పాటు యువ హీరోలు పూరి ఆకాష్, రోషన్ కనకాల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ…
మీడియాకు మరియు ప్రేక్షకులకు నమస్కారం. ఒక సినిమా విడుదల తేది వరుకు వచ్చింది అంటే దాని వెనక ఉన్న కష్టాలు నాకు తెలుసు. ప్రేమిస్తున్నా అందరి ఆశీస్సులతో నవంబర్ 7న విడుదల కానుంది, సాత్విక్ నటన చాలా బాగుంటుంది, డెబ్యూ హీరోలా కాకుండా బాగా చేసాడు. మూవీ యూనిట్ అందరికి బెస్ట్ విషెస్ తెలిపారు.

పూరి ఆకాష్ మాట్లాడుతూ…
హీరో సాత్విక్ తనకు తమ్ముడిలాంటివాడని, చిన్నప్పటి నుండి సాత్విక్ చైల్డ్ యాక్టర్‌గా ఎదిగి, ఇప్పుడు హీరోగా తన మొదటి సినిమా చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని చెప్పారు. సాత్విక్ ఎన్నో ఆడిషన్లు ఇచ్చి, తన సొంత కష్టం మీద ఎదిగాడని, అతను ఒక నిజమైన నటుడని ప్రశంసించారు. ‘ప్రేమిస్తున్నా’ టీజర్, పాటలు చూసినప్పుడు సాత్విక్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ అని, అతని నటన కోసమే సినిమా చూడాలనిపిస్తుందని అన్నారు. దర్శకుడు భను గారికి, నిర్మాత కనకదుర్గారావు గారికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.

ప్రేమిస్తున్నా చిత్రం నుండి ఇటీవల సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా, మరియు చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. 56 సెకెన్స్ నిడివి ఉన్న కంటెంట్ యువతను విపరీతంగా ఆకట్టుకొంటోంది. సినిమా ఎలా ఉండబోతోందో ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది, స్వచ్ఛమైన ప్రేమకథతో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు. దర్శకుడు భాను ప్రేమిస్తున్నా సినిమాను న్యూ ఏజెడ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కు చూపించబోతున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ…
“అన్ కండీషనల్ లవ్ తో తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా. ఇప్పటివరకు తెలుగులో అంత అన్ కండీషనల్ లవ్ తో ఏ సినిమా రాలేదు, అద్భుతమైన పాటలు, పర్ఫార్మెన్స్ తో ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. చాలా కాలం తరువాత వస్తోన్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ ఈ సినిమా, మేము విడుదల చేసిన ట్రైలర్ కు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోందని” అన్నారు.

ఇదొక మ్యూజికల్ లవ్ స్టొరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భాస్కర్ శ్యామల ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు, అనిల్ కుమార్ అచ్చు గట్ల ఈ సినిమాకు సంభాషణలు రాయడం జరిగింది, ఈ సినిమాకు నిర్వహణ మర్రి రవికుమార్, ఎడిటర్ శిరీష్ ప్రసాద్.

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

7 days ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago