పైరసీని అరికట్టిన డీసీపీ కవిత బృందాన్ని అభినందించిన ప్రేమిస్తున్నా చిత్ర యూనిట్ !!!

Must Read

ఎప్పటినుండో సినీ పరిశ్రమను భూతంలో పట్టి పీడిస్తున్నది పైరసీ. ఈ పైరసీని అరికట్టే ప్రయత్నంలో డీసీపీ కవిత అండ్ టీమ్ అనేక సినిమాల పైరసీకి పాల్పడిన నేరస్తుడిని పట్టుకొని సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసారు.

ఈ సందర్భంగా ఐబిఎమ్ ప్రొడక్షన్స్ ప్రేమిస్తున్నా చిత్ర బృందం ప్రేత్యేకంగా కలిసి అభినందించారు. భవిషత్తులో కూడా ఇలాంటి పైరసీ సైబర్ నేరస్తుల నుండి సినిమా పరిశ్రమని రక్షించమని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రేమిస్తున్నా చిత్ర నిర్మాత పప్పుల కనకదుర్గారావు దర్శకుడు భాను నిర్వాహకులు మర్రి రవికుమార్, హీరో సాత్విక్ వర్మ, హీరోయిన్ ప్రీతి నేహా, ఎడిటర్ శిరీష్ ప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ… “పైరసీ మహమ్మారి వలన చిత్ర నిర్మాతలు ఎంతో నష్టపోతున్నారని, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి, చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న నిర్మాత సినిమాను విడుదల చేసిన రోజు నుండే పైరసీ మహమ్మరితో ఎంతో నష్టపోతున్నారు, సైబర్ నేరగాళ్లను అరికట్టి చిత్ర పరిశ్రమను రక్షించాలని కోరారు.

ఈ సందర్భంగా డిసిపి కవిత మాట్లాడుతూ…
పైరసీ పట్ల ఎప్పటికి అప్పడు చిత్ర నిర్మాతలు అప్రమత్తమై సైబర్ క్రైమ్ అధికారులకు పిర్యాదు చెయ్యాలని కోరారు.

Latest News

ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్లు కొల్లగొట్టిన ‘మండాడి’.. సూరి, సుహాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం ‘మండాడి’. ఈ సినిమాని ఎల్రెడ్...

More News