ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వం లో “దీక్ష” మూవీ షూటింగ్ పూర్తి త్వరలో విడుదలకు సిద్ధం

Must Read

ఆర్‌.కె. ఫిలింస్‌, స్నిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిమ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’. పినిశెట్టి అశోక్‌ కుమార్‌, మదాడి కృష్ణారెడ్డి నిర్మాతలు. కిరణ్‌కుమార్‌, అలేఖ్యరెడ్డి జంటగా నటిస్తున్నారు.ఇటీవల తెలంగాణ ఫిలింఛాంబర్ లో చిత్ర ప్రోగ్రెస్ ను తెలిపే కార్యక్రమంలో ఆర్ కే గౌడ్, హీరో కిరణ్, నటి తులసి,రైటర్ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్‌.కె.గౌడ్‌ మాట్లాడుతూ – ‘దీక్ష’ సినిమా షూటింగ్ పూర్తయింది డబ్బింగ్ జరుగుతోంది. “దీక్ష” ఉంటే ఏదైనా సాధించగలం అనే పాయింట్ తో మూవీని తెరకెక్కించాం ఈ మూవీలో హీరో కిరణ్ చేసిన స్టంట్స్, భీముడు, ఆంజనేయుడు వంటి గెటప్స్ లో ఆకట్టుకునే సీన్స్ హైలైట్ అవుతాయి. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ ను పరిచయం చేస్తున్నాం. ‘దీక్ష’ సినిమాను పూర్తి చేసి త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం.మూవీ పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాం. అలాగే “మహిళా కబడ్డీ” అనే మరో చిత్రాన్ని18 భాషల్లో తెరకెక్కంచబోతున్నాం. కబడ్డీ ఆడగల యంగ్ హీరోయిన్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మహిళా కబడ్డిలో నటించే హీరోయిన్స్ కు నేషనల్ కబడ్డీ జట్టు కోచ్ తో శిక్షణ ఇప్పిస్తాం. అన్నారు

హీరో కిరణ్ మాట్లాడుతూ – నలభై సినిమాలకు దర్శకత్వం వహించిన రామకృష్ణ గౌడ్ గారు ‘దీక్ష’ మూవీతో మళ్లీ మెగాఫోన్ పట్టడం సంతోషంగా ఉంది. ఇప్పటి యంగ్ డైరెక్టర్స్ లా చాలా అప్డేటెడ్ గా, ప్లానింగ్ తో ‘దీక్ష’ మూవీ రూపొందిస్తున్నారు. గతంలో నేను తెలుగులో పది తమిళంలో రెండు సినిమాలు హీరోగా చేశాను ఈ సినిమాతో నాకు మంచి పేరుతో పాటు అవార్డ్స్ వస్తాయని ఆశిస్తున్నాను. మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. రియలిస్టిక్ గా ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ చేశాం. స్టంట్ మాస్టర్ రవికుమార్ చాలా బాగా ఆ ఫైట్ చేయించారు. ఒక నిమిషం పాటు ఉండే డైలాగ్ ఒకటి ఈ మూవీలో నాతో చెప్పించారు. ఆ డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. నా లాంటి యంగ్ హీరోలకు అవకాశాలు ఇస్తున్న ఆర్ కే గౌడ్ గారికి థ్యాంక్స్, అలాగే మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. మహిళా కబడ్డీ సినిమాను ఆర్ కే గౌడ్ గారు 18 భాషల్లో రూపొందిస్తున్నారు. ఆ మూవీ కూడా బాగా రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

రైటర్ రాంప్రసాద్ మాట్లాడుతూ – గతంలో ఎన్ టి ఆర్ నటించిన “దీక్ష” టైటిల్ ఈ చిత్రానికి కరెక్టుగా యాప్ట్ అవుతుంది. కృషి ఉంటె మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు “దీక్ష” తో ఏదైనా సాధ్యమే అన్నదే ఈ కథ అన్నారు

నటి తులసి మాట్లాడుతూ – ఈ సినిమాలో హీరో కిరణ్, హీరోయిన్ అలేఖ్యరెడ్డి తో పాటు మరో లీడ్ రోల్ లో నేను నటించాను. నాకు మంచి డైలాగ్స్ ఉంటాయి. కథ కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. ‘దీక్ష’ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News