హను-మాన్ జనవరి 12, 2024న సంక్రాంతికి విడుదల

Must Read

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్నతొలి చిత్రం ‘హను-మాన్‌’. ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం కొత్త విడుదల తేదిని ఖరారు చేశారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రాన్ని జనవరి 12, 2024న సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఈ సినిమా మాసీవ్  CGI వర్క్‌ ఉండటం వల్ల జాప్యం జరుగుతోంది. ఇప్పటికే ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన విఎఫ్‌ఎక్స్ వర్క్‌పై నిపుణుల బృందం పని చేస్తోంది. మేకర్స్ రాజీపడకుండా రూపొందిస్తున్నారు.

హై-బడ్జెట్ చిత్రాల లాగ్ థియేట్రికల్ రన్‌ కోసం మంచి సీజన్, ఫెర్ఫెక్ట్  విడుదల తేదీ అవసరం. సంక్రాంతి అతిపెద్ద సీజన్. మిగిలిన పనులు కోసం, సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేయడానికి కూడా కావాల్సిన సమయం దొరుకుతుంది.  విడుదల తేదీ పోస్టర్‌లో హీరో తేజ సజ్జ చేతిలో హనుమాన్ జెండాతో ఒక కొండపై నుండి మరొక కొండకు దూకడం కనిపిస్తుంది. ఇది హనుమంతుని ఆశీర్వాదంతో సూపర్ పవర్స్ ని కలిగిన అండర్‌డాగ్ ని చూపుతుంది.

అత్యున్నత విజువల్ ఎఫెక్ట్స్‌తో విడుదలైన టీజర్‌కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఆర్ట్ వర్క్  కూడిన హనుమాన్ చాలీసా కూడా మంచి ఆదరణ పొందింది.

హను-మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్‌తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్ విడుదల కానుంది.

హను-మాన్ “అంజనాద్రి” ఊహాత్మక ప్రదేశంలో సెటప్ చేయబడింది. కథానాయకుడు హనుమంతుని శక్తులను పొంది అంజనాద్రి కోసం ఎలా పోరాడాడనేది చిత్ర కథాంశం. సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

ఈ అద్భుతమైన చిత్రానికి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందించగా.. గౌరహరి, అనుదీప్ దేవ్,  కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.

తారాగణం: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు

సాంకేతిక విభాగం:
రచన & దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: కె నిరంజన్ రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పణ: శ్రీమతి చైతన్య
స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్‌విల్లే
డీవోపీ: దాశరధి శివేంద్ర
సంగీత దర్శకులు: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్
ఎడిటర్: సాయిబాబు తలారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి
అసోసియేట్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి, పుష్పక్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి

Latest News

Rahasyam Idam Jagat A Unique Story Komal R Bharadwaj

Rahasyam Idam Jagat" is a film blending science fiction and mythological thrillers. From the promotional content of the film,...

More News