ప్రణవ్ మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘డీయస్ ఈరే’. మిస్టరీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందింది. ‘భూత కాలం’, ‘భ్రమ యుగం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ సంస్థలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది.
మలయాళంలో అక్టోబర్ 31న ‘డీయస్ ఈరే’ విడుదలైంది. నవంబర్ 7న (శుక్రవారం) పెయిడ్ ప్రీమియర్లతో తెలుగు వెర్షన్ విడుదల చేస్తున్నారు. నవంబర్ 8న (శనివారం) రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో సినిమా విడుదల కానుంది. ఈ రోజు ‘డీయస్ ఈరే’ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.
‘డీయస్ ఈరే’ ట్రైలర్ చూస్తే… ఓ విలాసవంతమైన భవంతి కనిపిస్తుంది. అందులో ఓ వ్యక్తి మహిళ హెయిర్ క్లిప్ పట్టుకుని కూర్చుంటాడు. ఆ తర్వాత వింత గొంతు ఒకటి వినబడుతుంది. ‘ఆకాశం… భూమి… భూడిద అవ్వగా, లోకం కన్నీళ్ల భయంతో నిండుతుంది’ అని ట్రైలర్ ముగిసింది. కథ ఏమిటి? అనేది రివీల్ చేయకుండా హారర్, థ్రిల్స్ ఎలిమెంట్స్ పుష్కంలంగా ఉన్నాయని చెప్పారు.
మలయాళంలో ‘డీయస్ ఈరే’కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. వసూళ్లతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. కమల్ హాసన్ ‘పుష్పక విమానం’, ‘నాయకుడు’ నుంచి ధనుష్ ‘రఘువరన్ బీటెక్’ వరకు తెలుగులో శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేసిన పరభాషా సినిమాలు భారీ విజయాలు సాధించడంతో పాటు విమర్శకుల – ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. ఆ కోవలో ‘డియస్ ఈరే’ కూడా చేరుతుందని చెప్పవచ్చు.
‘డీయస్ ఈరే’ సినిమాలో సుష్మితా భట్, జిబిన్ గోపీనాథ్, జయ కురుప్, మనోహరి జాయ్, అరుణ్ అజికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా రాహుల్ సదాశివన్ రచన, దర్శకత్వంలో రూపొందిన ‘డియస్ ఈరే’ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…