‘లవ్ టుడే’ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రదీప్ రంగనాథన్ కొత్త చిత్రం

Must Read

* అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మాతలుగా సినిమా

 దక్షిణాది సినీ రంగం ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటి ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్. ఈ సంస్థ నిర్మించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘లవ్ టుడే’. ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే ప్రదీప్ రంగనాథన్ సినిమాను డైరెక్ట్ చేశారు. అన్నీ వర్గాల మన్ననలు అందుకుంటూ ఈ సినిమా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.

ఈ చిత్రానికి కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా మెప్పించనున్నారు. ఈ మే నెల నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రముఖ నటీనటులందరూ ఇందులో నటించనున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపొందుతోన్న 26వ సినిమా ఇది.

కొత్త సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను మేకర్స్ విడుదల చేయగా, సోషల్ మీడియాలో వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రదీప్ రంగనాథన్, అశ్వత్ మారిముత్తు మధ్య ఉన్న నిజ జీవితంలోని స్నేహాన్ని తెలియజేస్తూ ఎంటర్‌టైనింగ్‌గా వీడియో ఉంది.

ఈ ఎమోషనల్ మూవీకి అర్చనా కల్పాతి క్రియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుంటే ఐశ్వర్యా కల్పాతి అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రదీప్ ఇ.రాఘవ్ ఎడిటర్‌గా, ఎస్.ఎం.వెంకట్ మాణిక్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సందర్భంగా క్రియేటివ్ ప్రొడ్యూసర్ అర్చనా కల్పాతి మాట్లాడుతూ ‘‘లవ్ టుడే’ చిత్రంతో ప్రేక్షకుల హృదయాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్‌తో మరోసారి కలిసి పని చేయటం ఆనందంగా ఉంది. అలాగే ఓ మై కడవులే సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం ఆనందంగా ఉంది. వీరి కలయికలో రాబోతున్న ఈ సినిమా ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సూపర్ హిట్ చిత్రాల సరసన నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు.

సినిమా టైటిల్.. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలియజేసింది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News